- Home
- Entertainment
- Guppedantha Manasu: వసుధారకు గిఫ్ట్ ఇచ్చిన రిషీ.. జగతి, మహేంద్రల ప్రత్యేక అభినందనలు!
Guppedantha Manasu: వసుధారకు గిఫ్ట్ ఇచ్చిన రిషీ.. జగతి, మహేంద్రల ప్రత్యేక అభినందనలు!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 11వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. దేవాయని, గౌతమ్ రిషీ వసుధార కోసం వెయిట్ చేస్తుంటారు. రిషీ ఇష్టపడ్డాడు కాబట్టి వసుధారని ఇంటికి రానిస్తుంది అని గౌతమ్ మనసులో అనుకుంటాడు. అప్పుడే రిషి వసు ఇద్దరు కలిసి వస్తారు.. అయితే వసుధార రిషి కోట్ వేసుకొని రావడంతో అదేంటి వసుధార ఇలా వచ్చింది అని దేవయాని అంటుంది.. చెప్తాను పెద్దమ్మ అంటూ వస్తారా నువ్వు వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకో అని అంటాడు.. ఏమైంది నాన్న ఎక్కడికి వెళ్లావు ఏంటి ఇదంతా అంటే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి చెప్తాను పెద్దమ్మ అని చెప్తాడు. ఏంటో ఎక్కడికెళ్లాడు ఏం చేశారో అంటూ దేవయాని ఫీల్ అయిపోతుంది.
మరో సీన్లో మహేంద్ర జగతి వసుధార విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. వసుధారకు కేక్ పంపించాలి విషెస్ చెప్పాలి అంటే అవన్నీ ఇప్పుడు కుదురుతాయా జగతి అని మహేంద్ర అంటాడు. నా స్టూడెంట్ వస్తారని అభినందించడానికి ఈ మాత్రం చేయకపోతే ఎలా? నువ్వే చేయాలి అంటూ జగతి మహేంద్రకు ఆర్డర్ వేస్తుంది.. తనని ఒక్క స్టూడెంట్ ఏ కాదు డి బి ఎస్ టి కాలేజ్ స్టూడెంట్ కూడా అని మహేంద్ర అంటాడు. అయినా ఆ ఫ్లవర్ బొకేలు, కేక్ ఇవ్వడం ఎవరైనా చేస్తారు.. నేను కొత్తగా ట్రై చేస్తాను అని మహేంద్ర అక్కడ నుంచి వెళ్ళిపోతాడు..
మరో సీన్ లో వసుధారకు ఇంట్లో వారందరు కంగ్రాట్స్ చెబుతారు. దేవాయని పొగుడుతే ఏంటి ఇలా మాట్లాడుతోంది అంటూ అక్కడ అందరూ అనుకుంటారు. రిషి కూడా వసుధరకు స్వీట్ తినిపించి కంగ్రాట్స్ చెప్తాడు.. మాట్లాడుతూ ఈ విజయం నాది మాత్రమే కాదు ఇది విశేషాలు గొప్పతనం అంటూ రిషి కి స్వీట్ తినిపిస్తుంది.. ఈ టైంలో డాడ్ ఉంటే బాగుండేది అని రిషి మొదలుపెడితే.. అవును జగతి మేడం, మహేంద్ర సార్ ఉంటే చాలా బాగుండేది అని వసుధార కూడా ఫీల్ అవుతుంది.. ఇక అప్పుడే దేవయాని కలగజేసుకుని వాళ్ళు ఇక్కడ లేకపోతే ఏంటి కనీసం ఒక బొక్కే పంపించి కంగ్రాట్స్ చెప్పొచ్చుగా అని దేవాయని అంటుంది.
అప్పుడు గౌతమ్ ఉన్నట్టుండి పేపర్ ఇంటికి వచ్చిందని ఆ పేపర్లో మహేంద్ర జగతి మేడంలు వస్దార కంగ్రాట్స్ చెప్పారని చెబుతాడు. ఆ పేపర్ లో అభినందనలు చూసి దేవాయని షాక్ అవుతే రిషీ వసుధార ఆనందపడుతారు. దేవాయని మాత్రం ఆ అభినందనలు జిర్ణించుకోలేకపోతుంది. మరో సీన్ లో రిషీ వసుధారతో జరిగిన జ్ఞాపకాలు అన్నీ గుర్తుచేసుకొని తెగ సంతోషపడుతాడు.. వసుధారది గొప్ప ప్రయాణం, గొప్ప విజయం అంటూ పొగుడుతాడు. వసుధార రిషీ కలిసి ఇంటిలో దీపాలు వెలిగిస్తారు.. ఈరోజు నీ విజయంతో దీపావళి సెలబ్రేట్ నువ్వొక్కటే చేసుకుంటున్నావా అంటాడు.
అప్పుడే VR అనే అక్షరాలు ఉన్న ఉంగరాన్ని తీసుకెళ్లి వసుధారకు గిఫ్ట్ గా ఇస్తాడు రిషీ. అది చూసి వసుధార ఎంతో ఆనందపడుతుంది. ఆతర్వాత ఉంగరాన్ని రిషీ చేతికి ఇచ్చి తన వెలికి తొడగమని చెబుతుంది. ఆతర్వాత రిషీ వసుకి నువ్వు నా జీవితంలోకి వచ్చాక చాలా కొత్తగా ఉంది.. చాలా మారిపోయాయి.. ఏదో సాధించిన ఫీలింగ్ వచ్చింది అని రిషీ వసుకి చెబుతాడు. ఆ మాటలకూ వసుధార సంతోషించి రిషీని హగ్ చేసుకుంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. మరీ రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.