Guppedantha Manasu: కోపంతో రగిలిపోతున్న దేవయాని.. రిషీ, వసు కోసం మహేంద్ర ప్లాన్!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 29వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..రిషి,వసుతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు. మీరు వెళ్తేనే నేను వెళ్తాను సార్ అని వసు అంటుంది. నా మనసు బాలేదు నన్ను వదిలే అని అనగా, నా మనసు కూడా బాలేదు సార్ ఇక్కడే ఉంటాను అని అంటుంది వసు. నాతో నీకేంటి అని రిషి అనగా మీరు నేను ఒకటే కదా సార్ మీరు వెళ్తేనే నేను వెళ్తున్నాను అని వసు ఉంటుంది. అప్పుడు రిషి బయటకు వెళ్తాడు.వసు కూడా రిషి వెనకాతలే వెళ్తుంది. నువ్విలా తయారయ్యావు ఏంటి వసుధార అని రిషి అనగా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాను సార్ అని వసు అంటుంది.ఇంతలో క్యాబ్ వస్తుంది. ఇంటికెళ్ళు అని రిషి అనగా వసు వెళ్ళిపోతుంది. రిషి కూడా కారు ఎక్కి వెళ్ళిపోతాడు. మరోవైపు జగతి, మహీంద్రలు రిషి కోసం కంగారు పడుతూ ఉంటారు. ఫోన్ చేసిన ఎత్తడం లేదు అని అనుకోగా ఇంతలో దేవయాని అక్కడికి వస్తుంది.
ఏంటి ఆలుమగలు ఇద్దరు దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు అని దేవయాని అనగా, అక్కయ్య,రిషి ఫోన్ ఎత్తట్లేదు మీరు ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కోండి అని అంటుంది.అప్పుడు దేవయాని, ఏంటి జగతీ నీ స్వభావానికి విభిన్నంగా ఇలాంటివి అడుగుతున్నావు. నేను చెయ్యను అని నీకు తెలుసు కదా అని అనగా ధరణి అక్కడికి వచ్చి, నా ఫోన్ తో చేయండి చిన్న అత్తయ్య రిషి ఎట్టుతాడు అని అంటుంది. దానికి దేవయాని కోపంతో, నేను మాట్లాడుతున్నాను కదా ధరణి నువ్వు లోపలికి వెళ్ళు అని అంటుంది. ఇంతలో గౌతం కూడా కిందకి వస్తాడు అదే సమయంలో రిషి లోపలికి వచ్చేసరికి అందరూ రిషి చేతికి ఉన్న దెబ్బను చూసి ఏమైంది అని కంగారుగా అడుగుతాడు. గాజుగీసుకున్నాది, నా మనసేం బాలేదు ఎవరూ డిస్టర్బ్ చేయద్దు అని లోపలికి వెళ్ళిపోతాడు రిషి. రాత్రికి వసు అక్కడికి వచ్చి రిషి దగ్గరికి వెళుతుంది.
వసు ని చూసిన దేవయాని ఇదేంటి ఈ సమయంలో వచ్చి తిన్నగా రిషి గదిలోకి దూరుతుంది అని ఇంట్లో వాళ్ళందరిని పిలిచి మీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఉన్నది అని దేవయాని అంటుంది. అప్పుడు జగతి చేతిలో ఉన్న భోజనం పల్లాన్ని తీసుకొని నేను రిషికి తినిపిస్తాను అని లోపలికి వెళుతుంది.అక్కడ వసూ ఉంటుంది. నువ్వేంటి వసుధార, ఈ సమయంలో వచ్చావు దారిలో వెళ్తూ చూసి వెళ్దాం అని వచ్చావా అని దేవయాని అనగా, లేదు మేడం, రిషి సార్ కోసమే వచ్చాను అని అంటుంది వసు. అప్పుడు దేవయాని వసుని పక్కకు తోసి రిషికి భోజనం పెట్టగా రిషి, నాకు తినాలని లేదు పెద్దమ్మ నాకు వదిలేయండి అని అంటాడు.దానికి దేవయాని, నువ్వు మందులు వేసుకోవాలి కదా రిషి, తిను లేకపోతే చేయి నొప్పి తగ్గదు అని అంటుంది. దాంతోపాటు జగతి వాళ్ళు కూడా భోజనం చేయమని చెప్తారు కానీ రిషి నేను తినను అంటాడు.
అప్పుడు వసుధార గట్టిగా ఇన్ని మంది తినమని చెప్తున్నారు కదా సార్ మీరు ఎందుకు తినరో నేను చూస్తాను అని దేవయాని దగ్గర ప్లేట్ లాక్కొని దేవయాని ని పక్కన తోసి తినండి సార్ అని అంటుంది వసు. అప్పుడు రిషీ మౌనంగా ఉంటాడు. అప్పుడు వసు కోపంతో స్పూన్ కింద పడేసి అన్నం కలిపి ఆ అనండి సార్ అని అంటుంది. వసుధార ఎందుకు ఇంత రెబల్గా తయారైంది సైలెంట్ గా ఉంటే అందరి ముందు భోజనం తినిపిస్తుందేమో అని అనుకుంటాడు రిషి. ఇంతలో వసు ఆ అనండి సార్ అని అంటుంది. దేవయాని,వసు పెట్టినా రిషి భోజనం చేయట్లేదు అని ఆనందపడుతుంది. మరోవైపు జగతి మహీంద్రాలు,వసు ఇంత కోపంగా ఉన్నాది ఎందుకని అనుకుంటారు. ఇంతలో రిషి అ అని అంటాడు. వసు భోజనం పెడుతుంది. దీన్ని చూసిన దేవయాని ఆశ్చర్య పోతుంది.అప్పుడు గౌతమ్ మనసులో, ఈ యాంగిల్ కూడా ఉన్నదా వాసుధార అని అనుకుంటాడు.
ఇంతలో వసూ ఒక దాని మీద కోపాన్ని ఇంకోదానిమీద చూపించొద్దు సార్ అని భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఇంతలో జగతి, మహీంద్రా, గౌతమ్ లు మందులు తెస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు దేవయాని, అయినా వసుదార ఎందుకు ఇక్కడికి వచ్చింది,అది చెప్పిన వెంటనే రిషి తినడం ఎందుకు? నాకే పనులు చెప్తుంది ఇక్కడ ఉంటే ఇంకా పనులు చెప్తాదేమో వెళ్లిపోవడం బెటర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవయాని. అప్పుడు వసు, రిషి పక్కన కూర్చొని భోజనానికి కోపానికి సంబంధం ఏంటి సార్ తినండి అని అంటుంది.
నువ్వు ఇక్కడకి రావడం ఎందుకు? భోజనం పెట్టడం ఎందుకు? అని రిషి అనగా, మీరే చెప్పారు కదా సార్ ప్రేమకి, కోపానికి సంబంధం లేదని. ఏదో విషయం మీద కోపంతో ఉన్నంత మాత్రాన ప్రేమ తగ్గదు కద సార్. కోపంతో మీ చేతిని మీరే హాని చేసుకున్నారు అని ఏడుస్తూ భోజనం తినిపిస్తూ ఉంటుంది.భోజనం అయిపోయిన తర్వాత నేను ఇంక బయలుదేరుతాను సార్ అని వసు ఉంటుంది. దానికి రిషి జాగ్రత్తగా వెళ్ళు అని అంటాడు.అప్పుడు వసు కిచెన్ లో ప్లేట్ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో జగతి, మహేంద్ర, గౌతమ్ వాళ్లు గదిలో ఉంటారు.
రిషి, వసుధారని దూరం చేసుకోలేడు. అలాగని గురుదక్షిణ ఒప్పందానికి ఒప్పుకోలేడు పోనీ వసు ని ఒక అడుగు వెనక్కి వెయ్యమందామా అని అంటే, ఎప్పుడూ లేనిది ఈసారి వసు కూడా నా మాట వినడం లేదు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య దూరంగా పెరిగిపోకూడదు.మనం ఎలాగైనా వాళ్ళని కలపాలి. మనం కలపాలి అంటే వీళ్ళిద్దరూ ఒక దగ్గర ఉండాలి ఏం చేద్దాము కాఫీ షాప్ లో అంటే కాఫీ తాగి వెళ్లిపోతారు. బయట కలిసే అవకాశం లేదు కాలేజ్ ఒకటే మార్గం ఉన్నది అని గౌతమ్ అనగా, ఇప్పుడు కాలేజీకి సెలవులు కదా అని మహేంద్ర అంటాడు.
అప్పుడు గౌతమ్, కాలేజీకి సెలవులైనా సరే కాలేజీకి రప్పించే ఐడియా లు ఏమైనా ఉన్నాయా అని అనగా, మీటింగులు ఉన్నాయి అని అంటుంది జగతి. అయితే అదే మంచి ఆలోచన ఇప్పుడు నుంచి మిషన్ రిషిదార మొదలు అని మహేంద్ర అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!