Guppedantha Manasu: జగతి ఇంటి నుంచి వెళ్లిపోయిన వసు.. 'టెన్షన్'లో రిషి?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

వసుధార (Vasudhara) తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని అడగగా.. జగతి తనను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వు వసు అని చిరాకు పడి వెళ్ళిపోతుంది. ఈలోపు జగతికి మహేంద్ర కాల్ చేసి నీ ప్రవర్తనకు కారణం ఏమిటి? అని అడగగా జగతి మహేంద్ర (Mahendra) పై కూడా మొదటి చిరాకు పడి తరువాత ఎమోషనల్ అవుతుంది.
ఇక వసుధార (Vasudhara ) ఒక చెట్టుకింద కూర్చొని జగతి ప్రవర్తన గురించి ఆలోచిస్తూ భాధ పడుతూ ఉంటుంది. ఈ లోపు అక్కడకు రిషి వస్తాడు. ఏమైంది అని వసు ను అడగగా.. వసు, జగతి ప్రవర్తన గురించి చెబుతుంది. ఇక రిషి (Rishi) తన ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా అని మనసులో ఆలోచిస్తాడు.
మరి ఇంకా ఎందుకుంటున్నావ్ ఏదైనా హాస్టల్ లో ఉండొచ్చు కదా వసు.. అని రిషి (Rishi) అనడతో హాస్టల్ కి వెళ్లడం అయితే జరగదు సార్ అని అంటుంది. అసలు మేడం అలా నన్ను అనరు అంటూ జగతి (Jagathi) కి తన మీద ఉన్న ప్రేమను గురించి రిషికి చెబుతుంది.
ఇదంతా కావాలనే మేడంతో ఎవరో చేపిస్తున్నారు సార్. అదేవరో నేను తెలుసుకోవాలి అని వసు (Vasu) చెప్పగా రిషికి టెన్షన్ పుడుతుంది. వసు ఏది ఏమైనా నేను మేడం ని వదిలి ఉండను సార్ అని తల్చేసి చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోతుంది. రిషి (Rishi) కి ఎక్కడకి వెళుతుందో అర్ధంకాదు.
ఇక రిషి (Rishi) దగ్గర నుంచి సడన్ గా ఏమీ చెప్పకుండా బయలుదేరిన వసు ఇంటికి వచ్చి బట్టలు సర్దుకుంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. వెళ్లే ముందు ఒకసారి జగతి ఇదివరకు తనమీద చూపించిన ప్రేమ గురుంచి అలోచించి భాధ పడుతుంది. ఇక బ్యాగ్ పట్టుకొని బయటకు వస్తుంది. అయిన జగతి (Jagathi) ఏమీ మాట్లాడకుండా ఉంటుంది.
ఇక వసు బ్యాగ్ సర్దుకొని బయటకు వెళ్లిపోయే క్రమంలో దాదాపు వసుధార (Vasudhara), జగతిని క్రాస్ చేస్తుంది. అయినా కూడా జగతి ఏమీ పట్టించుకోకుండా ఉంటుంది. జగతి (Jagthi) తట్టుకోలేక వసుని వెళ్లొద్దు అని అపుతుందో లేదో తెలవకుండా పోయింది. ఇక ఏం జరుగుతుందో చుడాలి అంటే తరువాత భాగం కోసం ఎదురు చూడాలి.