- Home
- Entertainment
- Guppedantha Deepam: మొత్తానికి వసుతో సారీ చెప్పించుకున్న దేవయాని.. రిషికి ఊహించని షాక్ ఇచ్చిన వసు!
Guppedantha Deepam: మొత్తానికి వసుతో సారీ చెప్పించుకున్న దేవయాని.. రిషికి ఊహించని షాక్ ఇచ్చిన వసు!
Guppedantha Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

రిషి (Rishi) వాళ్ల ఇంట్లో అందరూ కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా దేవయాని (Devayani) రిషి టాపిక్ తీస్తుంది. రిషి రాత్రి ఆలస్యంగా వచ్చాడని అంటూ.. మహేంద్ర వర్మ ను మధ్యలోకి లాగుతూ కాసేపు మాటల యుద్ధం చేస్తుంది. అప్పుడే రిషి రావడంతో అందరూ రిషిని పలకరిస్తారు.
అప్పుడే గౌతమ్ (Gautham) టాపిక్ రావడంతో రిషి కూడా గౌతమ్ గురించి ఆలోచిస్తాడు. వసు ఇంటికి వెళ్ళాడేమో అని.. వెంటనే గౌతమ్ కు ఫోన్ చేస్తాడు. కానీ గౌతమ్ తనను ఎక్కడ వెనుకకు రమ్మంటాడో అని ఫోన్ కట్ చేసి బిజీగా ఉన్నానని మెసేజ్ పంపించాడు. ఇక రిషి (Rishi) ఇలా చేస్తావా అని ఒక ప్లాన్ చేస్తాడు.
వెంటనే వసుకు (Vasu) ఫోన్ చేస్తాడు. వెంటనే ప్రాజెక్ట్ వర్క్ కోసం తన ఇంటికి రమ్మంటాడు. మరోవైపు గౌతమ్ వసును కలవటానికి హుషారుగా వెళ్తాడు. మొత్తానికి వసును గౌతమ్ (Gautham) ను కలవకుండా చేస్తాడు. ఇక గౌతమ్ వసు ఇంటికి వెళ్లేసరికి వసు లేకపోవడంతో నిరాశ పడతాడు.
ఇక జగతి (Jagathi) ఇంతకు ఏ పని మీద వచ్చావని అడగటంతో గౌతమ్ (Gautham) కాలేజీ కి వెళ్తుంటే పికప్ కోసం వచ్చానని అంటాడు. రోమియో, జూలియట్ నాటకం కోసం డిస్కస్ చేయడానికి వచ్చానని అంటాడు. ఇక జగతి కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇంట్లో రిషి (Rishi) వసు కోసం తెగ ఎదురు చూస్తూ ఉంటాడు. దేవయాని ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అనడంతో వసు కోసం అనడంతో దేవయాని కోపంతో రగిలిపోతుంది. తనని ఎందుకు ఇంటికి పిలవడం అని అనడంతో అప్పుడే బయట నుంచి వసు (Vasu) వస్తుంది.
వసును (Vasu) చూసి అందరూ షాక్ లో ఉంటారు. ఇక దేవయాని (Devayani) కోపంతో అక్కడనుండి వెళ్ళిపోవాలి అని అనుకోటం తో.. వసు మేడం అని పిలిచి ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది. ఇక నీ పరామర్శలు వద్దులే అని అనడంతో వసు చేతులు ఎత్తి దండం పెడుతూ క్షమాపణలు కోరుకుంటుంది.
ఇక వసు (Vasu) గతంలో సారీ చెప్పానని అన్న సంగతి గుర్తుకు చేసుకుంటాడు రిషి. కానీ దేవయానికి సారీ చెప్పటం తో అందరు షాక్ అవుతారు. ఇక వసు సారీ చెప్పిన విధానానికి మహేంద్ర, ధరణి (Dharani) గ్రేట్ అని అనుకుంటారు. ఇక వసు, రిషి కారులో బయటకు బయలుదేరుతారు.
కాసేపు దేవయాని (Devayani) గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి అని అనుకుంటారు. తరువాయి భాగంలో రిషి కి ఆకలి కావటంతో దారిన టీ తాగుతూ ఉంటారు. అంతలోనే వసు రిషితో (Rishi) నిన్ను ప్రేమిస్తున్నాను అని అనడంతో రిషి షాక్ అవుతాడు.