- Home
- Entertainment
- Guppedantha Manasu: వసుకు ఐ లవ్యూ చెప్పిన గౌతమ్.. వసు మనసు తెలుసుకునే ప్రయత్నంలో రిషీ!
Guppedantha Manasu: వసుకు ఐ లవ్యూ చెప్పిన గౌతమ్.. వసు మనసు తెలుసుకునే ప్రయత్నంలో రిషీ!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే వసు (Vasu) తో కలిసి తన ఇంటికి వచ్చిన రిషి అక్కడ మహేంద్ర కారు ని చూసి ఇంటికి రావడానికి సందేహ పడతాడు. కానీ వసు రిషి ను తీసుకొని వెళుతుంది. ఇక రిషి (Vasu) వెళుతూ ఉండగా అందరూ కలిసి వచ్చారు ఉండండి సార్ అని బ్రతిమిలాడుతుంది.
మరోవైపు దేవయాని (Devayani) మనం ఇద్దరం కలిస్తే రిషి ను మన దారిలోకి తెచ్చుకోవచ్చు అని సాక్షితో అంటుంది. అంతేకాకుండా నన్ను నమ్ము సాక్షి (Sakshi) నీకు రిషి కి పెళ్లి చేపిస్తాను. మనం కొంచెం దూకుడుగా వెళ్లాల్సి ఉంటుంది అని అంటుంది. ఒక వైపు వసు దగ్గరకు ఇరుగుపొరుగు వస్తారు.
ఇక వసు (Vasu) ను ఇలా మగ వాళ్ళు వచ్చి పోతుంటే.. బస్తీ లో మంచిగా ఉండదు కదా అని అంటారు. నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు అని కోపం పడుతారు. ఇలా మనుషులు రావడం పద్ధతి కాదు అని చెప్పి వెళ్ళిపోతారు. మరోవైపు దేవయాని రిషి సాక్షి లకు పెళ్లి సెట్ అయ్యింది అని మహేంద్ర (Mahendra) వాళ్ళతో అంటుంది.
అదే క్రమంలో దేవయాని (Devayani) బాధ్యతలు వదిలేసి బస్తీ లో వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటారు మీరు అని మహేంద్ర దంపతులను ఉంటుంది. ఇక సాక్షినే ఈ ఇంటికి తగిన కోడలు అని చెబుతుంది. దాంతో రిషి (Rishi) ఈ విషయంలో నన్ను ఎప్పుడు ఒత్తిడి చేయకండి పెద్దమ్మ అని అంటాడు.
ఆ తర్వాత రిషి (Rishi) వసు ఇంటికి వెళతాడు కానీ వసు బస్తీ వాళ్ళు అన్న మాటలు గురించి రిషి ను ఈ ఇంటికి రావద్దు అని చెబుతోంది. అంతే కాకుండా ముఖం మీద తలుపులు వేసేస్తుంది. దాంతో ఒక్కసారిగా రిషి దీనంగా వెనక్కి వస్తుండగా ఈలోపు తన తండ్రి మహేంద్ర (Mahendra) తనకు ధైర్యం చెప్పినట్టు పట్టుకుంటాడు.
ఇక తరువాయి భాగం లో గౌతమ్ (Goutham) నేను వసు కు ఐ లవ్యూ చెబుతాను అని అంటాడు. దాంతో రిషి చెప్పు అని మరింత ఎంకరేజ్ చేస్తాడు. ఇక గౌతమ్ వసుకు ప్రపోజ్ చేస్తాడు. ఇక కొంత దూరం లో ఉన్న రిషి (Rishi) వసు ఇచ్చే రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ పరంగా తనమీద వసుకు ఉన్న అభిప్రాయం తెలుసుకోవడానికి బాగానే ప్లాన్ చేశాడు.