- Home
- Entertainment
- వరుణ్ తేజ్ కాదు, సాయిధరమ్ తేజ్ హజ్బెండ్ మెటీరియల్.. లావణ్య త్రిపాఠి కామెంట్స్ వైరల్
వరుణ్ తేజ్ కాదు, సాయిధరమ్ తేజ్ హజ్బెండ్ మెటీరియల్.. లావణ్య త్రిపాఠి కామెంట్స్ వైరల్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని ఒక్కటవుతున్నారు. ఇటీవలే వీరి ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. తాజాగా లావణ్య చెప్పిన ఓ షాకింగ్ విషయం ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తుంది.

Varun Tej - Lavanya Tripathi engagement
లావణ్య త్రిపాఠి.. సైలెంట్‌గా వరుణ్ తేజ్‌ని బుట్టలో పడేసింది. వీరి రిలేషన్‌షిప్‌పై అనేక సార్లు దాటవేస్తూ వచ్చింది. ఏం లేదనే విషయాన్ని చెబుతూ వచ్చింది. కానీ అనుహ్యంగా ఎంగేజ్‌మెంట్‌ని ప్రకటించారు. శుక్రవారం ఈ ఇద్దరి నిశ్చితార్థం మెగా ఫ్యామిలీ, సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.
ఇదిలా ఉంటే ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి చెప్పిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. వివిధ ఇంటర్వ్యూలతో ఆమె మెగా ఫ్యామిలీ గురించి, వరుణ్ తేజ్ గురించి చెప్పిన వీడియో క్లిప్పులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌ల గురించి చెప్పిన ఓ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.
Image: Instagram
ఇందులో ఓ ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠికి ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. `హజ్బెండ్ మెటీరియల్ ఎవరు? అని యాంకర్ ప్రశ్నించగా, లావణ్య త్రిపాఠి తేజ్ హజ్బెండ్ మెటీరియల్ అని పేర్కొంది. తేజ్ భర్త లక్షణాలతో జన్మించారని పేర్కొంది. అయితే తేజ్ అంటే ఎవరు? అనేది ఇక్కడ ప్రశ్న, యాంకర్.. వరుణ్ తేజ్ పేరు చెప్పగా, కాదు, సాయిధరమ్ తేజ్ అని చెప్పి షాకిచ్చింది లావణ్య.
ఆ తర్వాత వరుణ్ తేజ్ పేరు కూడా చెప్పింది. `వరుణ్ తేజ్ కూడా, కానీ సాయిధరమ్ తేజ్‌ఒక మంచి వ్యక్తి. బాగా చూసుకుంటాడు, ఆ విషయం నాకు తెలుసు, సాయి.. నేను చెప్పిన ఈ విషయం నీకు నచ్చుతుంది` అంటూ పేర్కొంది లావణ్య. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తుంది. సాయిధరమ్ తేజ్‌లో హజ్బెండ్ మెటీరియల్ చూసి, వరుణ్ తేజ్‌ని పడేసిందేంటి? అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. వరుణ్ తేజ్‌ని త్వరలో లావణ్య పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో ఈ వీడియో క్లిప్పులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇక సాయిధరమ్ తేజ్‌తో లావణ్య త్రిపాఠి.. `ఇంటలిజెంట్` చిత్రంలో నటించింది. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పరాజయం చెందింది. అంతకు ముందే వరుణ్ తేజ్‌తో `మిస్టర్` చిత్రంలో నటించింది లావణ్య. ఈ సినిమా సమయంలోనే ఈ ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారిందని సమాచారం. నిన్న ఎంగేజ్‌మెంట్ సందర్భంగా కూడా సోషల్ మీడియాలో లావణ్య పోస్ట్ చేస్తూ 2016 లో ఏర్పడ్డ బంధం అని పేర్కొంది. ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి `అంతరిక్షం`లోనూ కలిసి నటించారు. అప్పటికి వీరి ప్రేమ మరింత బలంగా మారింది. ఇన్నాళ్లు సీక్రెట్‌గా ప్రేమించుకుంటూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు ఒక్కటి కాబోతుంది.
లావణ్య త్రిపాఠి సినిమా కెరీర్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. ఆమె చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. నిజం చెప్పాలంటే గతేడాది నుంచి ఆమెకి సినిమాలు లేవు. మరి మెగా కండీషన్ కారణంగా సినిమాలు ఒప్పుకోలేదా? లేక ఆమెకి ఆఫర్లు లేకపోవడంతో వరుణ్ తేజ్‌తో పెళ్లికి సిద్ధమైందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం `గాంఢీవధారి అర్జున`తోపాటు మరో సినిమా చేస్తున్నారు.