- Home
- Entertainment
- ప్రభాస్ తో స్పిరిట్ మూవీ, సందీప్ వంగా దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్నాడా.. విలన్ గా మెగా హీరో ?
ప్రభాస్ తో స్పిరిట్ మూవీ, సందీప్ వంగా దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్నాడా.. విలన్ గా మెగా హీరో ?
ఈ ఏడాది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూడు పాన్ ఇండియా చిత్రాల్లో నటించాల్సి ఉంది. రాజా సాబ్ చిత్రం పూర్తి కావస్తోంది. ఇక ప్రభాస్ ఫోకస్ పెట్టాల్సింది స్పిరిట్, ఫౌజి, కల్కి 2 చిత్రాలపైనే.

ఈ ఏడాది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూడు పాన్ ఇండియా చిత్రాల్లో నటించాల్సి ఉంది. రాజా సాబ్ చిత్రం పూర్తి కావస్తోంది. ఇక ప్రభాస్ ఫోకస్ పెట్టాల్సింది స్పిరిట్, ఫౌజి, కల్కి 2 చిత్రాలపైనే. ఈ మూడు చిత్రాల షూటింగ్స్ ఈ ఏడాది జరగనున్నాయి. ఆల్రెడీ ఫౌజి షూటింగ్ కొంత భాగం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూడు ప్రభాస్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి.
సందీప్ రెడ్డి వంగా అయితే స్పిరిట్ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ప్రభాస్ ని యాక్షన్ అవతార్ లో ప్రెజెంట్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్ర చాలా కీలకం అని ముందు నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. హాలీవుడ్, కొరియన్ నటుడు డాంగ్ లీ ఈ చిత్రంలో విలన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది.
అంతటి పవర్ ఫుల్ రోల్ కాబట్టి సందీప్ వంగా ఈ చిత్రంలో విలన్ పాత్ర విషయంలో పెద్ద ప్లాన్ తోనే ఉన్నారు. డాంగ్ లీ నటిస్తారో లేదో తెలియదు కానీ.. తాజాగా మరో సంచలన రూమర్ వెలుగులోకి వచ్చింది. స్పిరిట్ మూవీలో విలన్ రోల్ కోసం సందీప్ ఏకంగా మెగా హీరోతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆ మెగా హీరో ఎవరో కాదు.. ఆరడుగుల కటౌట్ తో ఉన్న వరుణ్ తేజ్ అని తెలుస్తోంది. వరుణ్ తేజ్ ని స్పిరిట్ చిత్రంలో విలన్ గా నటింపజేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయట. అయితే వరుణ్ తేజ్ అంగీకరిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇది కనుక జరిగితే క్రేజీ కాంబినేషన్ అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.
వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. వరుస డిజాస్టర్లతో వరుణ్ తేజ్ సతమతమవుతున్నారు. ఇప్పుడు విలన్ గా నటిస్తే కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలియదు. మరి వరుణ్ తేజ్ ఏం చేస్తాడో చూడాలి. ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు కూడా రూమర్స్ ఉన్నాయి.