Varun Tej : వరుణ్ తేజ్ తన భార్యని ఇప్పటి వరకు ఆ మాట అడగలేదట..నిజంగా ఆశ్చర్యమే
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. దీనితో ఈ మూవీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. దీనితో ఈ మూవీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న రిలీజ్ కి రెడీ అవుతోంది.
మరో రెండు రోజుల్లో ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో వరుణ్ తేజ్ వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. వరుణ్ తేజ్ కొన్ని నెలల క్రితమే లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్నారు. దీనితో మీడియా తప్పకుండా లావణ్య త్రిపాఠి గురించి ప్రశ్నిస్తుంది. అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి.
అయితే తన భార్య గురించి వరుణ్ తేజ్ తెలిపిన ఒక విషయం ఆసక్తికరంగా ఉంది. మీ చిత్రాల్లో లావణ్య త్రిపాఠికి బాగా నచ్చిన మూవీ ఏది అని ప్రశ్నించారు. దీనికి వరుణ్ తేజ్ సమాధానం ఇస్తూ.. ఇంతవరకు లావణ్యని తాను ఆ ప్రశ్న అడగలేదని తెలిపారు.
అదే విధంగా భవిష్యత్తులో లావణ్య త్రిపాఠితో కలసి నటిస్తారా అని ప్రశ్నించగా వరుణ్ తేజ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మంచి కథ వస్తే తప్పకుండా నటిస్తాం. కానీ హడావిడిగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారని నటించడం ఉండదు. మంచి కథ వస్తేనే చేస్తాం అని వరుణ్ తేజ్ తెలిపారు.
గతంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో కలసి నటించారు. మిస్టర్ చిత్రం నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు ప్రచారం ఉంది. ఏది ఏమైనా వీళ్ళ ప్రేమ విషయం చివరి వరకు బయటకి రాకుండా సీక్రెట్ మైంటైన్ చేశాడు.
ఇటీవల ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ ప్రేమ విషయం తన వద్ద కూడా దాచాడని సరదాగా అన్నారు.ఈ చిత్రంలో వరుణ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.