MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మట్కా: షాకింగ్ కలెక్షన్స్ , అంత పెద్ద డిజాస్టరా?

మట్కా: షాకింగ్ కలెక్షన్స్ , అంత పెద్ద డిజాస్టరా?

నవంబర్ 14న విడుదలైన వరుణ్ తేజ్ నటించిన 'మట్కా' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కథ, నటీనటులు, మరియు బాక్సాఫీస్ ఫలితాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

3 Min read
Surya Prakash
Published : Nov 19 2024, 08:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


 వరుణ్ తేజ్ (Varun Tej)తాజా చిత్రం ‘మట్కా’ (Matka) సినిమా నవంబర్ 14న రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. ’పలాస’ ఫేమ్ కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్ గా నటించింది.

నోరా ఫతేహి (Nora Fatehi) కూడా కీలక పాత్ర పోషించింది. రిలీజ్ కు ముందు ‘మట్కా’పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.  టీజర్, ట్రైలర్స్ లో డైలాగులు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే రిలీజ్ రోజు మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం థియేటర్ రైట్స్ ఎంతకు అమ్మారు. ఎంత శాతం రికవరీ అయ్యింది. ఎంత నష్టపోతున్నారో చూద్దాం. 
 

26
Varun Tej, Matka, Allu Arjun

Varun Tej, Matka, Allu Arjun


వరుణ్ తేజ ఫ్లాఫ్ ల నుంచి తప్పించుకోవాటనికి కొత్త సబ్జెక్ట్ లతో ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో  ఇప్పుడు మట్కా కింగ్ రతన్ ఖేత్రీ స్ఫూర్తితో అల్లిన కథతో మన ముందుకు వచ్చాడు. అయితే సినిమా అనుకున్న స్దాయిలో లేదు.

వరుణ్ తేజ్ కెరీర్ కు కొత్త వెలుగు ఇస్తుందనుకున్న ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది.  పీరియడ్ సినిమాలు డీల్ చేయాలంటే చాలా ఖర్చు , చాలా టైట్ స్క్రిప్టు అవసరం. అసలు ఆ కథ ఇప్పుడు ఎందుకు చెప్తున్నామనే విషయం కన్నా ఎంతలా జనాలకు కనెక్ట్ అయ్యామనే చెప్తేనే కనెక్ట్ అవుతారు.  అయితే ఆ జాగ్రత్తలు ఏమీ ఈ సినిమాలో తీసుకోలేదు.
 

36
Varun Tej,

Varun Tej,


 కేజీఎఫ్, పుష్ప వంటి సినిమాలు నెగిటివ్ హీరోయిజంతో వస్తూంటే వాటిని అనుసరిస్తూ ఈ సినిమా చేసినట్లు అనిపిస్తుంది. అయితే వాటిలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, స్క్రిప్టు మీద ఉన్న పట్టుకానీ, కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ ఇందులో మిస్సయ్యాయి.

గాఢ్ ఫాధర్ ఛాయలు కొన్ని చోట్ల కనపడతాయి. అది ప్రక్కన పెడితే స్లో నేరషన్, కొంత డాక్యుమెంటేషన్ టైప్ వ్యవహారం కలబోసి ఉంది.  వీటిన్నంటితో పాటు రొటీన్ ఫార్ములా ఎలిమెంట్స్ సైతం చొప్పించాడు దర్శకుడు. దాంతో సినిమా అటూ, ఇటూ కాకుండా పోయింది. ఎక్కడా ఇంటెన్స్ సాగే సీన్స్ కానీ, చూసేవారిని ఆశ్చర్యపరిచే ట్విస్ట్ లు కానీ ఉండవు. ఉన్న కాసిని సోసో గా ఉన్నాయి. అవే సినిమాని దెబ్బకొట్టాయి.

46

ఈ చిత్రం థియేటర్ రైట్స్  ₹20 కోట్లవరకూ అమ్ముడయ్యాయి. కానీ రికవరీ మాత్రం 3% మాత్రమే ఉంది. సినిమా బడ్జెట్  ₹50 కోట్లు దాటిందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ట్రేడ్ ఈ సినిమాని భారీ డిజాస్టర్ గా అభివర్ణిస్తోంది.

ఇప్పటిదాకా వచ్చిన షేర్ చూస్తే థియేటర్ మెయింటినెన్స్  ఖర్చులు కూడా వచ్చేలా లేవు అంటున్నారు. క్లోజింగ్ కలెక్షన్స్ షేర్ 1 కోటి దగ్గరే ఆగిపోయేలా కనపడుతోంది.  సినిమా మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది. రెండో రోజు నుండి ఏమైనా హోల్డ్ ని చూపెడుతుంది అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు. 

56

 చిత్రం కథ విషయానికి వస్తే... కథా కాలం 1958- 1982 మధ్య నడుస్తుంది.  బర్మా నుంచి శరణార్ది వాసు (వరుణ్ తేజ్) చేసిన అనుకోని పరిస్దితుల్లో చేసిన ఓ హత్య వల్ల బాల ఖైదిగా జైల్ కు వెళ్తాడు. అక్కడే బాల్యం పూర్తి చేసుకుని  యుక్తవయసు వచ్చాక జైల్లోంచి బయట ప్రపంచంలోకి వస్తాడు.

జైలులో తనకు అయిన పరిచయాలు, తనలోని అసలు నైజం కలిపి ఓ మొరటు వ్యక్తిగా తయారవుతాడు. రౌడీయిజం ని తన వృత్తిగా ఎంచుకుంటాడు.  బ్రతుకుతెరవు కోసం మొదట్లో విశాఖలో కూలీ గా ప్రయాణం మొదలెట్టినా షార్ట్ పీరియడ్ లో ఎదిగిపోవాలనే ఆలోచన అతని మెదుడ్ని తొలిచేస్తుంది.

66


దాంతో  తెలివిన  వాసు గ్యాంబ్లింగ్ లోకి ఎంటరవుతాడు. మట్కాని ప్రవేశపెట్టి అంచలంచలుగా మట్కా కింగ్ గా ఎదుగుతాడు.  ఆ క్రమంలో అతనికి  నానినాబు (కిషోర్) లాంటి వాళ్లు సాయిపడితే  కెబి (జాన్ విజయ్) లాంటి రౌడీలు వాళ్ళు శతృవులు అవుతారు. కెబికు ఒకటే జీవితాశయం  తన రౌడీయిజానికి ఎదురొచ్చిన   వాసుని చంపాలని. ఇక వాసు పర్శనల్ లైఫ్ విషయానికి వస్తే... వాసుకి ఒక వేశ్య (సలోని) చెల్లెలు (మీనాక్షి) పరిచయమవుతుంది. అది మెల్లిగా ఇద్దర్నీ ఒకటి చేస్తుంది. 

ఇక గ్యాంబ్లర్ గా తన “మట్కా” సామ్రాజ్యాన్ని వాసు దేశమంతా ఎలా విస్తరింపజేస్తూంటే సీబీఐ కన్ను అతనిపై పడుతుంది. వారి నుంచి ఎలా  వాసు తప్పించుకున్నాడు.  సీబీఐ అధికారి సాహు (నవీన్ చంద్ర) అతన్ని పట్టుకోవటానికి వల విసురుతాడు. అప్పుడు ఏమైంది. మట్కా కింగ్ గా ఎదిగిన అతని జీవితం చివరకు ఏమైంది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved