- Home
- Entertainment
- 2023 లో బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పిన స్టార్ హీరోలు, పెళ్లి పీటలెక్కిన సినిమా తారలు
2023 లో బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పిన స్టార్ హీరోలు, పెళ్లి పీటలెక్కిన సినిమా తారలు
2023 లో చాలామంది ఫిల్మ్ స్టార్స్ పెళ్లి పీటలెక్కారు.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో యంగ్ హీరోలు వరుసగా పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రభాస్, సల్మాన్ లాంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లు తప్పించి. యంగ్ స్టార్స్ చాలా మంది ఓ ఇంటివారు అయ్యారు. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న తారలు ఎవరో చూద్దాం.

ఈ ఏడాది ( 2023) లో ఎంతో మంది యంగ్ స్టార్ తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పారు. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నప్రభాస్, అనుష్క, సల్మాన్ ఖాన్ లాంటివారు తప్పించి.. ఆల్ మెస్ట్ టాలీవుడ్ యంగ్ స్టార్స్ అంతా ఓ ఇంటివారు అయ్యారు. ఈక్రమంలో మిగిలి ఉన్న కొంత మంది కూడా ఒకరి తరువాత ఒకరు ఓ ఇంటివారు అవుతున్నారు. మరి ఈ ఏడాది.. 2023 లో బ్రహ్మచర్యానికి గుడ్ బై చెప్పిన తారలెవరు..?
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ స్టార్స్ లో ముందుగా చెప్పుకోవల్సింది వరుణ్ తేజ్ లావణ్య గురించే. దాదాపు 5 ఏళ్లు రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట.. సడెన్ గా పెళ్లంటూ షాక్ ఇచ్చారు. తాజాగా అంటే నవంబర్ 1న ఇంటలీలోని చారిత్రాత్మక గ్రామంలో ఘనంగా పెళ్ళి చేసుకున్నారు ఈమెగా జంట. అలా హీరోయిన్ లావణ్యను ప్రేమించి.. పెళ్ళాడి.. మెగా ఇంటి కోడలిని చేశాడు వరుణ్.
ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పెళ్లి చేసుకున్న మరో యంగ్ హీరో శర్వానంద్. ఈ హీరో ఈఏడాది ప్రారంభంలోనే పెళ్ళి చేసుకున్నాడు. తాను ప్రేమించిన రక్షితా రెడ్డిని.. జూన్ 2 న రాజస్థాన్ లోని జైపూర్ లో ఘనంగా పెళ్లాడాడు. ఇక పెళ్లి చేసుకోవడమే కాదు.. ఈ ఏడాదే తండ్రి కూడా కాబోతున్నట్టు గుడ్ న్యూస్ చెప్పాడు యంగ్ హీరో.
ఇక 2023 లో పెళ్లి చేసుకున్న మరో స్టార్ సెలబ్రిటీ జంట కియారా అద్వాని -సిద్దార్ధ్ మల్హోత్ర. ఈ బాలీవుడ్ జంట కూడా చాలా కాలంగా ప్రేమింకున్నారు. అయితే కలిసి తిరిగారు.. ఫారెన్ టూర్లు కూడా వేశారు. కాని ఎప్పుడూ తాము ప్రేమించుకుంటున్నాం అని డైరెక్ట్ గా చెప్పలేదు. కాని హింట్లు మాత్రం ఇచ్చారు. చివరికి ఫిబ్రవరి 7న వీరిద్దరి వివాహం రాజస్థాన్ లోని జైసల్మేర్‌లోని సూర్యఘర్ ప్యాలెస్‌లో జరిగింది.
Manas Wedding
ఇక ఈ ఏడాది పెళ్లి చేసుకున్న మరో స్టార్ మానస్. రీసెంట్ గా ఈ బుల్లితెర హీరో ఓ ఇంటివాడు అయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో కనిపించిన మానస్.. ఆతరువాత బుల్లితెర హీరోగా పరిచయం అయ్యాడు.. అటు యాంకరింగ్ లో కూడా తన ప్రతిభ చూపించాడు. ఇక తాజాగా విజయవాడలో శ్రీజ మెడలో మూడు ముళ్లు వేసి.. తన లైఫ్ పార్ట్ నర్ గా వెల్కం చెప్పాడు. ఈ పెళ్లిళో బుల్లితెరతారలు సందడిచేశారు.
ఈ ఏడాది పెళ్ళి పీటలు ఎక్కిన మరో హీరో మంచు మోహన్ బాబు రెండో కొడుకు మంచు మనోజ్. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ ను సాదించిన మనోజ్.. మంచి వాడిగ పేరు తెచ్చుకున్నాడు. కాని హిట్లు మాత్రం కొట్టలేకపోయాడు. ఇక తాను ప్రేమించి మౌనిక రెడ్డిని మార్చి 3న మంచు మనోజ్ పెళ్లి చేసుకున్నాడు.మంచు మనోజ్ తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత మౌనికా రెడ్డితో కలిసి ఏడడుగులు వేశారు.మౌనికా రెడ్డికి కూడాఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.
Actor Naresh and actress Pavitra lokesh
వీరే కాదు ఇంకా చాలామంది తారులు ఈ ఏడాది పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. సీనియర్ నటుడు నరేష్.. సీనియర్ నటి పవిత్ర లోకేష్ కూడా ఈ ఏడాది పెళ్ళి చేసుకున్నారని టాక్. అయితే అది సినిమా కోసం చేశామనివారు చెపుతున్నా.. ప్రస్తుతం సహజీవనం చేస్తున్న ఈ ఇద్దరు నటులు.. యూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారని టాక్. ఇక నరేష్ కు ఇది నాలుగో పెళ్ళి కాగా..పవిత్రకు రెండో పెళ్ళి. ఇలా ఈ ఏడాది యంగ్ స్టార్స్ చాలా మంది తమ బ్యాచిలర్ లైఫ్ ను వదులుకుని..ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యారు.