MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ghani Twitter Review: వరుణ్ తేజ్ ఇలా చేశాడేంటి..?ఫస్ట్ హాఫ్ అయితే మరీ ఘోరం... గని మూవీ ట్విట్టర్ రివ్యూ

Ghani Twitter Review: వరుణ్ తేజ్ ఇలా చేశాడేంటి..?ఫస్ట్ హాఫ్ అయితే మరీ ఘోరం... గని మూవీ ట్విట్టర్ రివ్యూ

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ గని మూవీ ఈరోజు రిలీజ్ కాబోతోంది. ఇక యూఎస్ లో ముందే ప్రిమియర్ రిలీజ్ తో గని సందడి స్టార్ట్ అయ్యింది. ఈసినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో ఎలా స్పందిస్తున్నారో చూద్దాం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 08 2022, 06:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

వరుణ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ జంటగా.. డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. ఈ సినిమా కోసం  వరుణ్ తేజ్ ఎంతో కష్టపడ్డాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో తన మేకోవర్ తో అందరిని ఆశ్చర్య పరిచాడు. అలా తనను తాను చాలా మార్చుకుని ఈ మూవీలో నటించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మించిన ఈ సినిమాలో.. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. టీజర్స్, ట్రైలర్స్ కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక  ఈరోజు ( ఏప్రిల్ 8) సినిమా థియేటర్స్ ను పలకరించబోతుండగా.. ముందే ప్రీమిర్స్ రిలీజ్ తో గని సందడి స్టార్ట్ అయ్యింది. 
 

310

వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఉండే యాక్షన్స్ సీన్స్, వరుణ్ సిక్స్ ప్యాక్ బాడీ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి , నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో వరుణ్ తల్లి పాత్రలో అత్తారింటికి దారేది ఫేమ్ నదియా కనిపించంది. ఇక ఈమూవీ గురించి ట్విట్టర్ లో ఆడియన్స్ ఏమన్నారో చూద్దాం.  

410

వరుణ్ తేజ్ ప్రతి ప్రేమ్ లో స్టైలిష్ గా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా వరుణ్ మేకోవర్ రోమన్ శిల్పంలా అద్భుతంగా ఉంది. ఇక సినిమాలో తల్లికి ఇష్టం లేకున్నా బాక్సింగ్ కో రాణించే కుర్రాడిగా వరుణ్ తేజ్ కనిపిస్తున్నాడు. ఆట గెలవాలంటే నేను గెలవాలి, ఎందుకంటే ఈ సొసైటీ ఎప్పుడూ గెలిచిన వాడి మాటే నమ్ముతుంది అంటూ వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 
 

510

ట్విట్టర్ రివ్యూ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ సినిమా అస్సలు బాలేదంటూ.. కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ వరస్ట్ గా ఉందంటూ సినిమాచూసిన ఆడియన్స్ ట్వీట్ చేస్తున్నారు. 
 

610

అటు మెగా ఫ్యాన్స్ ది కూడా ఇదే మాట, ఫస్ట్ హాఫ్ అస్సలు బాగోలేదంటూనే...సెకండ్ హాఫ్ మూవీ బాగుందని.. అయితే ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతం అంటున్నారు. వరుణ్ తేజ్ ఎలివేషన్ సీన్స్ తో పాటు... మెగా ఫ్రీన్స్ యాక్షన్ సీన్స్ అదరగొట్టాడంటూ కొంతమంది ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు. 

710

మరికొంత మంది ఆడియన్స్ఈసినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పాటలతో పాటు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్  అద్భుతమంటున్నారు. అంతే కాదు వరుణ్ ఎలివేషన్ సీన్స్ లో తమన్ ఇచ్చిన బీజియం సినిమాను కాస్తో కూస్తో బ్రతికించిందంటూ ట్విట్టర్ కామెంట్స్ పెడుతున్నారు ఆడియన్స్. 
 

810

మరికొంత మంది ఫ్యాన్స్ మాత్రం రొటీన్ డ్రామాగా స్టార్ట్ అయిన గని సినిమా చిన్నగా పికప్ అందుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ స్టోరీని డైరెక్టర్ అద్భుతంగా హ్యాండిల్ చేశాడంటూ పొగిడేస్తున్నారు. అంతే కాదు ఇంటర్వెల్ సస్పెన్స్  బాగుందంటున్నారు. 

910

ఈ సినిమా స్టోరీ లైన్ బాగుంది కాని సినిమాను బోర్ కొట్టించాడు అంటూ మరికొందరు అంటుంటే.. వరుణ్ తేజ్ పెర్ఫామెన్స్ మాత్రం ఇదరగదీశాడంటున్నారు ట్విట్టర్ జనాలు కొంత మంది. ముఖ్యంగా బాలీవుడ్  హీరోయిన్ అయినా సాయి మంజ్రేకర్ అద్భుతంగా నటించిందంటూ ప్రశంసిస్తున్నారు. మరో వైపు బాలీవుడ్ స్టార్ సునిల్ శెట్టి, కన్నడ స్టార్ ఉపేంద్ర యాక్టింగ్ పై కూడా ప్రశంసల జల్లు కురుస్తుంది. రాకింగ్ సీనియర్ స్టార్స్ అంటూ సినిమా చూసిన అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. 

1010

ఓవర్ ఆల్ గా సినిమా లైన్ బాగుంది. కాని డైరెక్టర్ హ్యాండిల్ చేయలేకపోయాడన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఆడియన్స్ ట్వీట్టర్ అభిప్రాయాల ప్రకారం ఫస్ట్ హాఫ్ బాలేదు .. సెకండ్ హాఫ్ పర్లేదు.. క్లైమాక్స్ అదరగొట్టారు.. వరుణ్ తేజ్ సూపర్ మేక్ ఓవర్ అంటున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Sukumar: ఒరేయ్ బుచ్చి అనాలంటే భయమేసింది.. పెద్ది చూశాక సుకుమార్ ఏమన్నాడంటే..?
Recommended image2
Janhvi Saree: జాన్వీ కపూర్ కట్టిన ఈ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. దీని స్పెషాలిటీ ఏంటంటే?
Recommended image3
దర్శకుడి జీవితంలో విషాదం, భార్య కోరిక తీర్చలేక.. అదే వెంకటేష్ కి కామెడీ బ్లాక్ బస్టర్ అయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved