గ్రాండ్ గా మెహందీ వేడుక, వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి వేడుకల ఫోటోలు వైరల్..
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి పెళ్లి వేడుకలు ఇటలీలో అట్టహాసంగాజరుగుతున్నాయి. తాజాగా వారి మెహందీ వేడుక చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో మెగా ఫ్యామిలీ అంతా సందడి చేసింది. ఆఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి పెళ్ళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ ఇటలీ చేరి సందడి చేస్తున్నారు. మెగాస్టార్ , పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, ఐకాన్ స్టార్, సుప్రీం హీరో తో పాటు.. ఫ్యామిలీ.. పిల్లలు.. అంతా మెగా ప్రిన్స్ పెళ్ళి వేడుకల్లో సందడి చేస్తున్నారు.
తాజాగా పెళ్ళి వేడుకల్లో భాగంగా.. మెహందీ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో స్టార్ లేడీస్ అంతా.. చేతులకు మెరిసిపోయే మోహందీతో సందడి చేశారు. స్టార్ హీరోలంతా ఈ వేడుకల్లో వారి సతీమణులతో కలిసి సందడి చేశారు.
ఇక పెళ్లి కూతురు లావణ్య త్రిపాటి చేతుల నిండ ప్రత్యేకమైన డిజైన్ తో మెహందీ నిపుకుని.. కనిపించింది. అంతే కాదు.. స్పెషల్ గా డిజైన్ చేసిన గాగ్రలో హీరోయిన్ లావణ్య త్రిపాటి మెరిసిపోయింది.
మెహందీతో పాటు ఏర్పాటు చేసిన మ్యూజిక్ ఈవెంట్ ను మెగా ఫ్యామిలీ హీరోలంతా ఎంజాయ్ చేశారు. అటు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీకి చెందిన బంధువులు కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు.
ఈ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు హీరో నితిన్, తన భార్యతో కలిసి వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల్లో సందడి చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీ హీరోలు తప్పించి.. టాలీవుడ్ నుంచి ఈ పెళ్ళికి హాజరయిన ఏకైక హీరో నితిన్ మాత్రమే. అటు మెగా ఫ్యామిలీలో ఎప్పటి నుంచో కలిసి మెలిసి ఉన్న శర్వానంద్ మాత్రం ఈ పెళ్లి వేడుకల్లో కనిపించలేదు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ పెళ్ళి కార్యక్రమాలకు సబంధించి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈరోజు (నవంబర్ 1) వరుణ్ తేజ్-లావణ్య ల పెళ్ళి వేడుక హట్టహాసంగా జరగబోతోంది. ఈరోజు లావణ్య మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు మెగా హీరో.