వ్యాధితో బాధపడుతున్న వితికా షేర్. అనారోగ్యం గురించి వెల్లడించిన వరుణ్ సందేశ్ భార్య
ఫిల్మ్ ఇండస్ట్రీలోసెలబ్రిటీలుగా ఉన్నవారంతా హ్యాపీగా లేదు. అందులో కొంత మంది వింత వ్యాధులతో బాధపడుతున్నారు. మనశ్శాంతి లేక ఇంకొంత మంది ఇబ్బందుులు పడుతున్నారు. తాజాగా హీరోయిన్ వితికా శేర్ తనకున్న వ్యాధి గురించి వెల్లడించింది.
Vithika
సెలబ్రిటీలంటే లగ్జరీ లైఫ్, స్టార్ హేజ్, కాస్ట్లై లైఫ్ స్టైల్.. సోషల్ మీడియా ఫాలోయింగ్ లాంటివే గుర్తుకు వస్తాయి అందరికి. కాని వారు పడే ఇబ్బందులు చాలా మందికి తెలియవు పట్టించుకోరు. డబ్బు మాత్రమే ఉంటే సరిపోతు.. ఇతర ఇబ్బందులు కూడా లేకుండా మనశ్శాంతితో ఉండగలడగడం కూడా ముఖ్యమే. ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఉంటే అదే చాలు అనుకునేవారు చాలా మంది ఉన్నారు.
చాలా మంది సెలబ్రిటీలు డబ్బున్నా.. ఆనారోగ్యాలతో ఇబ్బందిపడేవారు ఉన్నారు. తాజాగా ఆలిస్ట్ లో వితికా శేర్ కూడా చేరింది. ఆమె తాను అనారోగ్యంతో పడుతున్న ఇబ్బందుల గురించి వెల్లడించింది. పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. పరిచయమయ్యారు నటి వితికా షేర్. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది బ్యూటీ.
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తుంది వితికా. వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వీరిద్దరూ పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అవకాశాలు లేకపోవడంతో ఈ జంట బిజినెస్ లు చేసుకుంటూ బిజీ అయిపోయారు. అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన అవకాశాన్ని మాత్రం అందుకుని మరోసారి తెరపై మెరిశారు జంట.
Vithika Sheru
సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటారు వితికా, వరుణ్. రీసెంట్ గా వితికా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకునేవారు అయితే తాజాగా ఈమె ఒక వీడియో ద్వారా తనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను గురించి బయటపెట్టారు. ఈ సందర్భంగా వితికా తనకు ఉన్నటువంటి సమస్యల గురించి వివరంగా మాట్లాడింది.
తాను కొద్దిరోజులుగా స్పాండిలైటిస్ , మైగ్రేన్ వంటి వ్యాధితో బాధపడుతున్నానని వితికా తెలియజేసింది. మైగ్రేన్ వల్ల విపరీతమైన తలనొప్పి వెన్నపోటు రావటం వల్ల తాను ఏ పని చేయలేకపోతున్నానని అలాగే స్పాండిలైటిస్ వ్యాధికి ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటున్నాను అని తెలియజేశారు. తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నటువంటి తాను ఇటీవల నీడ్లింగ్ చేయించుకున్నానని కూడా చెప్పింది వితిక.
అంతే కాదు ఈ ట్రీట్మెంట్ తర్వాత కాస్త రిలీఫ్ గా ఉంటుందని.. దాంతో తన పనులు తాను చేసుకోగలుగుతున్నాను అంటూ తన బాధను వెల్లడించింది బ్యూటీ. గత రెండు వారాల నుంచి మైగ్రేన్ తలనొప్పి తనని బాధపెడుతుందని ఈ రెండింటి నుంచి తాను ఎంతో ఇబ్బంది పడుతున్నానని తెలియజేశారు.
Vithika
ఇలా అభిమానులతో తన బాధను వెల్లడించడం ద్వారా కాస్త రిలీజ్ పొందుతుననాను అన్నారు వితిక. తాను బాధపడుతున్నటువంటి ఈ వ్యాధి నుంచి ఇంకా పూర్తిగా వివరాలు వెల్లడించలేదు వితికా. వాటిని కొంతవరకు నయం చేయవచ్చు అంటూ.. ఈ సందర్భంగా వితిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.