వర్ష మరొకరితో 5 వేల రూపాయల పూజ.. హర్ట్ అయిన ఇమ్మాన్యూల్, సెకండ్ హ్యాండ్ అంటున్నారు
వర్ష, ఇమ్మాన్యూల్ బుల్లి తెరపై క్రేజీ జంటగా పాపులర్ అయ్యారు. సుధీర్, రష్మీకి ఎలాంటి పాపులారిటీ దక్కిందో వర్ష, ఇమ్మాన్యూల్ కూడా అదే రేంజ్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు.
Varsha
వర్ష, ఇమ్మాన్యూల్ బుల్లి తెరపై క్రేజీ జంటగా పాపులర్ అయ్యారు. సుధీర్, రష్మీకి ఎలాంటి పాపులారిటీ దక్కిందో వర్ష, ఇమ్మాన్యూల్ కూడా అదే రేంజ్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. వారిద్దరి మధ్య రొమాన్స్ సాగుతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. కెమెరా ముందు కూడా వీరిద్దరూ సరదాగా ప్రేమికుల తరహాలో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు.
Varsha
వర్షపై మరొకరి కన్ను పడితే ఇమ్మాన్యూల్ అసూయ చెందడం.. వర్ష కావాలనే ఇమ్మాన్యూల్ ని ఏడిపించడం లాంటి సంఘటనలు వారి మధ్య జరుగుతూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంటాయి. తాజాగా జాతి రత్నాలు కామెడీ షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో వర్ష, ఇమ్మాన్యూల్ మధ్య జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
Varsha
వర్ష 'ఇప్పటి కింకా నా వయసు నిండా పదహారే' సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది. దీనితో శ్రీముఖి జోకులు వేసింది. వర్ష ఇమ్మాన్యూల్ కి సపోర్ట్ చేస్తున్నట్లు లేదు.. ఊరందరికి సపోర్ట్ చేస్తున్నట్లు ఉంది అని అనడంతో అంతా పగలబడి నవ్వారు. దీనితో ఇమ్మాన్యూల్ హర్ట్ అయ్యాడు. నీ వల్ల నన్ను అంతా సెకండ్ హ్యాండ్ గాడు అంటున్నారు అంటూ వాపోయాడు. ఇమ్మాన్యూల్ ఆవేదన నవ్వులు పూయించింది.
Varsha
మరో సాంగ్ లో వర్ష మరొకరితో డ్యాన్స్ చేస్తుంది. దీనితో ఇమ్మాన్యూల్ అసూయతో రగిలిపోతాడు. ఇంతలో నూకరాజు ఎంటర్ అవుతాడు. చూసావా మావా వర్ష 5 వేల రూపాయల పూజ అంటే ఇలా ఉంటుంది. ఇంకో పదివేలు ఇస్తావా పెద్ద పూజ ప్లాన్ చేస్తాను అని అంటాడు.
Varsha
దీనితో ఇమ్మాన్యూల్ కల్పించుకుని.. అవసరం లేదు రెండు వేలు ఇవ్వు చాలు.. ఇదే చేస్తుంది పెద్ద పూజ అని అంటాడు. దీనితో అంతా పగలబడి నవ్వుతారు. అలాగే ఇంత కమెడియన్స్ శ్రీముఖి పై కూడా జోకులు వేస్తారు.
Varsha
ఈ ప్రోమోలో వర్ష వైట్ లెహంగాలో అందంగా కనిపించింది. నాజూకైన సొగసుతో ఆమె హాట్ హాట్ గా డ్యాన్స్ చేయడం మెప్పిస్తోంది. మొత్తంగా జాతిరత్నాలు లేటెస్ట్ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.