- Home
- Entertainment
- రహస్యంగా వరలక్ష్మీ శరత్ కుమార్ నిశ్చితార్ధం, లేడీ విలన్ చేసుకోబోయేది ఎవరినో తెలుసా..?
రహస్యంగా వరలక్ష్మీ శరత్ కుమార్ నిశ్చితార్ధం, లేడీ విలన్ చేసుకోబోయేది ఎవరినో తెలుసా..?
ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతోంది సౌత్ నటి.. తమిళ లేడీ విలన్ వరలక్ష్మీ శరత్ కుమార్. సడెన్ గా ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. నిశ్చితార్దం కూడా చేసుకుని షాక్ ఇచ్చింది.

నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తమిళం, తెలుగు ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తోంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారిపోయింది. చెల్లిగా, అక్కగ నటిస్తూ.. విలన్ గా అవతారం ఎత్తింది. పవర్ ఫుల్ లేడీ విలన్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్.
Varalakshmi
తెలుగులో క్రాక్, వీరసింహ రెడ్డి, నాంది.. లాంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించింది. సౌత్ లోని అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఇప్పటికే 50 సినిమాలు పూర్తి చేసేసింది. ఈ తమిళ్ భామకు 38 ఏళ్ళు వచ్చినా పెళ్లి గురించి మాట్లాడేది కాదు. పెళ్లి గురించి అడిగినా సమాధానం చెప్పలేదు. తాజాగా నిశ్చితార్థం చేసుకొని ఫొటోలతో అందరిని ఆశ్చర్యపరిచింది.i
అంతకుముందు, నటుడు విశాల్ వరలక్ష్మి శరత్‌కుమార్‌తో ప్రేమలో ఉన్నారని, వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కొన్నాళ్లుగా పుకార్లు వచ్చాయి. ఇంతలో ముంబైకి చెందిన వ్యాపారవేత్త నిక్లాయ్ సచ్‌దేవ్‌తో వరలక్ష్మి నిశ్చితార్థం కూడా పూర్తయింది. నిన్న ( మార్చ్ 1) న కుటుంబ సభ్యులు, సన్నిహితులు కొంంత మంది మాత్రమే అతిథుల మధ్య నిశ్చితార్థం రహస్యంగా జరిగింది.
తండ్రి శరత్‌కుమార్, రాధికతో పాటు పలువురు కుటుంబ సభ్యులు మాత్రంమే ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. వరలక్ష్మికి కాబోయే భర్త నిక్లాయ్ సచ్‌దేవ్ ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నాడు. వీరిద్దరూ గత 14 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఇప్పుడు వారి ప్రేమకు శుభం కార్డు వేస్తూ.. ఇరువురు తల్లిదండ్రులు లను ఒప్పించి ఉంగరాలు మార్చుకుని వారి అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారని సమాచారం.
వరలక్ష్మి శరత్‌కుమార్, నికెలాయ్ సచ్‌దేవ్ వివాహ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీంతో ఈ కొత్త జంటకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సంవత్సరమే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. త్వరలో పెళ్ళి డేట్ కూడా అనౌన్స్ చేస్తారని సమాచారం.