MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నేను ఎవరి భార్యల ఉసురు పోసుకోలేదు,పెళ్ళైన హీరోలతో అలా చేయడం పాపం..లెజెండ్రీ నటిపై సీనియర్ హీరోయిన్ సంచలనం

నేను ఎవరి భార్యల ఉసురు పోసుకోలేదు,పెళ్ళైన హీరోలతో అలా చేయడం పాపం..లెజెండ్రీ నటిపై సీనియర్ హీరోయిన్ సంచలనం

జీవితంలో తప్పటడుగులు వేయకుండా తన తల్లి అనేక పాఠాలు నేర్పినట్లు వాణిశ్రీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను ఎవరి అండదండలతో ఎదగలేదని..కష్టపడి ప్రేక్షకుల అభిమానంతో ఎదిగానని అన్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 22 2024, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చిత్ర పరిశ్రమలో కళాభినేత్రిగా లెజెండ్రీ నటి వాణిశ్రీ చెరగని ముద్ర వేశారు. సావిత్రి తర్వాత అప్పట్లో అంత గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఆమె. అందం అభినయం కలిగిన వాణిశ్రీ అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ లాంటి లెజెండ్స్ తో అలవోకగా నటించి మెప్పించారు. 400పైగా ఆమె చిత్రాలు చేశారు. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

జీవితంలో తప్పటడుగులు వేయకుండా తన తల్లి అనేక పాఠాలు నేర్పినట్లు వాణిశ్రీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను ఎవరి అండదండలతో ఎదగలేదని..కష్టపడి ప్రేక్షకుల అభిమానంతో ఎదిగానని అన్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నాయి. 

 

36

చిత్ర పరిశ్రమ అన్నాక ప్రేమ వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. కొందరు హీరోయిన్లు పెళ్ళైన వ్యక్తులు, హీరోలతో కూడా ప్రేమాయణం సాగించారు. ఈ క్రమంలో వాణిశ్రీ మాట్లాడుతూ.. నేను ఎవరి భార్యల ఉసురు పోసుకోలేదు అని అన్నారు. పెళ్ళైన వ్యక్తిని నేను ప్రేమిస్తే.. అతడి భార్య ఉసురు నేను పోసుకున్నట్లే కదా.. నాకంటూ భర్త దొరకకుండా పోడు. అలాంటప్పుడు పెళ్ళైన వ్యక్తుల జోలికి ఎందుకు పోవాలి ?

 

46

నువ్వు లాంటి పనులన్నీ చేయకూడదు. చాలా పాపం అది.. సావిత్రి గారి జీవితం చూడు అని మా అమ్మ కొన్ని ఉదాహరణలు చెప్పింది అంటూ వాణిశ్రీ షాకింగ్ కామెంట్స్ చేశారు. డబ్బు కోసం కూడా నేను ఏ పని చేయలేదు. రెమ్యునరేషన్ బాగా ఇస్తేనే బాగా నటించాలని కూడా నేనెప్పుడూ అనుకోలేదు. రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా నా పని నేను కరెక్ట్ గా చేశాను. 

 

56

నేను ఏ హీరోల వలలో పడలేదు. కొందరు హీరోయిన్ల పరిస్థితి ఏమైందో నాకు తెలుసు. కారులో వస్తాడు.. లాంగ్ డ్రైవ్ కి వెళదామా అంటాడు. ఆమె కూర్చుంటుంది. ఆరు నెలలు సాగుతుంది. ఆ తర్వాత ఆ కారులో ఇంకో అమ్మాయి వస్తుంది అంటూ వాణిశ్రీ నవ్వుతూ అన్నారు. నీ కోసం తాజ్ మహల్ కడతా అంటూ ఏవేవో చెబుతారు. కానీ తాను ఎవరి వలలో పడలేదు అని వాణిశ్రీ తెలిపారు. 

 

66

నా పని నటించడం అది మాత్రమే చేశాను. జయలలిత సీఎం అయింది కదా.. మనం కూడా అవుదాం అనే పిచ్చి ఆలోచనలు కూడా నాకు ఎప్పుడూ రాలేదు. కాకపోతే నా సోమరి తనం వల్ల ఆస్తి విషయంలో కొన్ని ఇబ్బందులు పడ్డా. జీవితంలో అలాంటివి సహజం.. జరుగుతూ ఉంటాయి అని వాణిశ్రీ పేర్కొన్నారు. ఈ విషయాలని వాణిశ్రీ ఎన్టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Soundarya: 12 మంది హీరోలు వద్దన్న మూవీ..సౌందర్య సినిమా ఫ్లాప్ అయినా రికార్డుల్లో మాత్రం తోపు!
Recommended image2
Trisha: సీఎం విజయ్ కే కాదు.. మరో హీరోకి కూడా లక్కీగా మారిన త్రిష, అసలు విషయం ఏంటంటే?
Recommended image3
Karuppu 6 Days Collections: ఆరో రోజూ ఆగని సూర్య జోరు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'కరుప్పు`
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved