MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సాయం కోసం వెళితే వాణిశ్రీని అవమానించిన స్టార్ హీరో తండ్రి.. కష్టం తెలుసుకుని ఆదుకున్న కృష్ణం రాజు

సాయం కోసం వెళితే వాణిశ్రీని అవమానించిన స్టార్ హీరో తండ్రి.. కష్టం తెలుసుకుని ఆదుకున్న కృష్ణం రాజు

ఇలా ఎలా మారిపోతారు మనుషులు అని వాణిశ్రీ ఆశ్చర్యపోయిందట. అయితే తన సమస్య తెలుసుకుని సాయం చేసిన వ్యక్తి కృష్ణంరాజు గారు అని వాణిశ్రీ తెలిపింది. అప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 20 2024, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వాణిశ్రీ. సావిత్రి ప్రభావం తగ్గుతున్న సమయంలో వాణిశ్రీకి క్రేజ్ పెరిగింది. శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇలా స్టార్ హీరోలందరితో నటించింది. ఆ తర్వాతి తరం హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున చిత్రాల్లో వాణిశ్రీ తల్లి, అత్త తరహా పత్రాలు చేసింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

వాణిశ్రీ కూడా అందరిలాగే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. టాలీవుడ్ లో ఆమెకి కృష్ణం రాజుతో.. ఏఎన్నార్  ఫ్యామిలీతో మంచి అనుభందం ఉంది. అదే విధంగా మూవీ మొఘల్, విక్టరీ వెంకటేష్ తండ్రి రామానాయుడుతో కూడా ఆమెకి మంచి అనుభందం ఉంది.  అయితే ఒక సందర్భంలో రామానాయుడు ప్రవర్తించిన విధానం వల్ల ఆమె భాదపడిందట. ఈ విషయాన్ని స్వయంగా వాణిశ్రీ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

 

37

రామానాయుడు నిర్మాణంలో వాణిశ్రీ అనేక చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. వెంకటేష్ హీరో అయ్యాక బొబ్బిలి రాజా చిత్రంలో కీలక పాత్రలో నటించింది. వెంకటేష్ తో, అలాగే రామానాయుడు ఇద్దరితో ఆమె చాలా సన్నిహితంగా ఉండేవారు. 

 

47

అయితే ఒక సందర్భంలో వాణిశ్రీకి ఆస్తి విషయంలో తీవ్రమైన సమస్య ఏర్పడిందట. రామానాయుడుకి అప్పట్లో రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది. సమస్య పరిష్కరిస్తారని ఆయన దగ్గరకి వెళ్లిందట. కానీ ఆయన ఒక్కసారిగా మనిషి మారిపోయారు అనిపించింది. వెళ్లి సురేష్ ని అడుగు అని రామానాయుడు సరిగ్గా సమాధానం చెప్పలేదట. ఇలా ఎలా మారిపోతారు మనుషులు అని వాణిశ్రీ ఆశ్చర్యపోయిందట. 

 

57

అయితే తన సమస్య తెలుసుకుని సాయం చేసిన వ్యక్తి కృష్ణంరాజు గారు అని వాణిశ్రీ తెలిపింది. అప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. నాకు జీవితంలో అతి గొప్ప సాయం చేసిన వ్యక్తి ఎవరంటే అది కృష్ణం రాజు గారే అని వాణిశ్రీ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. గతంలో ఎన్టీవీలో ఈ ఇంటర్వ్యూ జరిగింది. 

 

67

వాణిశ్రీ, కృష్ణం రాజు అనేక చిత్రాల్లో కలసి నటించారు. కృష్ణం రాజు కెరీర్ లోనే క్లాసిక్ గా నిలిచిపోయిన చిత్రం భక్త కన్నప్పలో వాణిశ్రీ నటించింది. అదే విధంగా కృష్ణవేణి, జీవనతరంగాలు లాంటి చిత్రాల్లో నటించారు. 

 

77

కృష్ణంరాజు కూడా వాణిశ్రీపై అప్పట్లో ప్రశంసలు కురిపించారు తనకి ఇష్టమైన నటీమణులలో వాణిశ్రీ కూడా ఒకరు అని తెలిపారు. సెట్స్ బయట ఏదో సరదాగా ఉన్నట్లు ఉంటుంది. కానీ ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా వచ్చి సింపుల్ గా డైలాగ్ చెప్పేస్తుంది అని కృష్ణంరాజు అన్నారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
కృష్ణంరాజు
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana: మొదటి రోజే రూ.100 కోట్లు దాటుతుందా.. ఈ బజ్ తో రణ్‌బీర్ సినిమాకి అది సాధ్యమేనా ?
Recommended image2
Heroes Without Makeup: మేకప్‌ లేకుండా స్టార్‌ హీరోలు.. అసలు రూపాలు చూస్తే ఫ్యూజులు ఔట్‌
Recommended image3
Jana Nayagan: జన నాయకుడు సినిమా చూస్తూ త్రిష రచ్చ.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved