హీరోయిన్లతో ఏఎన్నార్ సరసం, అనుభవాలు బయటపెట్టిన వాణి శ్రీ.. మనవడు చెప్పింది నిజమే!
ఏఎన్నార్ ప్రేమ కథ చిత్రాలతో మెప్పించారు. అంతేకాదు రియల్ లైఫ్‌లోనూ ఆయనలో సరసం చాలానే ఉందట. వాణిశ్రీ తన అనుభవాలు బయటపెట్టింది.
అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్నార్) తెలుగు సినిమాకి దిక్సూచి లాంటివారు. ఎన్టీఆర్ తో కలిసి వారు వేసిన బాటలోనే ఇప్పుడు ఇండస్ట్రీ నడుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగు తెరకు డాన్సులు, రొమాన్స్ ని పరిచయం చేసిన హీరో ఏఎన్నార్. ఫ్యామిలీ చిత్రాలతో మెప్పించారు. రొమాంటిక్ లవ్ స్టోరీస్‌తో అలరించారు. భగ్న ప్రేమికుడిగా అమ్మాయిలకు దగ్గరయ్యాడు. అప్పట్లో లేడీస్ డ్రీమ్ బాయ్ ఏఎన్నార్ అంటే అతిశయోక్తి కాదు.
ఇదిలా ఉంటే సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఆయన చాలా రొమాంటిక్ అట. ఆ విషయాన్ని సీనియర్ నటి వాణి శ్రీ తెలిపారు. ఏఎన్నార్, వాణి శ్రీ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. హిట్ పెయిర్‌గానూ నిలిచారు. అప్పట్లో బెస్ట్ జోడీ అనిపించుకున్నారు. అయితే ఆ అనుభవంతో సినిమా షూటింగ్‌లో అక్కినేని ఎలా ఉంటారో తెలిపింది వాణిశ్రీ. షాకింగ్ విషయాలను ఆమె బయటపెట్టింది.
సెట్‌లో ఏఎన్నార్ చాలా జోవియల్‌గా ఉంటారట. ఫన్నీగా వ్యవహరిస్తారట. హీరోయిన్లతో ఆయన సరసం వేరే లెవల్‌లో ఉంటుందని తెలిపింది వాణి శ్రీ. ఆయనకు కోపం వస్తే, `హ.. ఓ కులుక్కుంటూ వస్తారు` అంటూ మాడిన మొహంతో సెటైర్లు వేస్తుంటాడట. హీరోయిన్ల నడకపై ఆయన చిలిచి కామెంట్లు చేస్తుంటాడని చెప్పింది. కోపంలో ఉన్నప్పుడు ఇలా దెప్పిపొడుపు మాటలు అంటుంటాడట.
అదే పాజిటివ్‌గా, ఫన్నీ మూడ్‌లో ఉంటే ఏ అమ్మాయి ఇలా రా అని దగ్గరికి తీసుకుని ఏంటీ ఈ మధ్య జబ్బలు(భుజాలు) పెరుగుతున్నాయి. బాగా లావవుతున్నావ్ అంటూ జబ్బలపై ఒక దెబ్బ వేస్తాడట. అదే ఆయన జోకులు వేసే విధానం, ఓ రకమైన సరసం అని తెలిపింది వాణిశ్రీ. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో ఈ విషయాన్ని బయటపెట్టింది వాణిశ్రీ. ఈ వీడియో చక్కర్లు కొడుతుంది.
ఇదిలా ఉంటే ఆ మధ్య హీరో సుమంత్ కూడా ఈ విషయాన్ని చెప్పాడు. మామ నాగార్జున కంటే తాత ఏఎన్నారే రొమాంటిక్ అని, చనిపోయే చివరి దశలో కూడా తనకు సహాయకులుగా ఉండేందుకు నర్స్ లను పెట్టుకున్నారు. వారితో కూడా ఏఎన్నార్ సరసం ఆడేవాడట. ఆ దశలో, అలాంటి స్థితిలో కూడా అమ్మాయిలతో ఆయన వ్యవహరించిన తీరు చూసి తాను షాక్ అయినట్టు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు సుమంత్. వాణిశ్రీ కూడా అదే చెప్పింది. ఈ లెక్కన నాగ్ ని మించిపోయాడు ఏఎన్నార్ అని చెప్పొచ్చు.
అక్కినేని, వాణి శ్రీ కలిసి `ఆత్మీయులు`, `దసరా బుల్లోడు`, ` ప్రేమ్ నగర్`, `ఆలుమగలు`, `పవిత్ర బంధం`, `విచిత్ర బంధం`, `దత్తపుత్రుడు`, `dకొడుకు కోడలు`, `బంగారుబాబు`, `సెక్రెటరీ`, `శ్రీరామరక్ష`, `చక్రధరి` వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. బెస్ట్ పెయిర్ అనిపించుకున్నారు. ప్రస్తుతం వాణి శ్రీ సినిమాలకు దూరంగా ఉంటోంది.