MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Actress: ఒకప్పుడు ఏకకాలంలో 12 చిత్రాలకు దూరం.. ఇప్పుడు ఇండస్ట్రీని శాసించే నటి అయింది.. ఎవరంటే.?

Actress: ఒకప్పుడు ఏకకాలంలో 12 చిత్రాలకు దూరం.. ఇప్పుడు ఇండస్ట్రీని శాసించే నటి అయింది.. ఎవరంటే.?

Actress Vidya Balan: ఒకప్పుడు ఈ నటిని ఐరన్ లెగ్ అని అన్నారు.. ఏకంగా 12 చిత్రాలకు దూరమైంది. వచ్చినట్టే వచ్చిందనుకున్న ఆఫర్లు చేజారిపోయాయి. కట్ చేస్తే.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోయిన్‌గా మారింది. మరి ఆమె ఎవరో తెలుసా.?

2 Min read
Author : Pavithra D
Published : Oct 13 2025, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తనకంటూ ప్రత్యేక స్థానం..
Image Credit : Vidya Balan Instagram

తనకంటూ ప్రత్యేక స్థానం..

బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆమె సహజ నటన ఆమెను బాలీవుడ్ అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా నిలిపింది. ఇక విద్యాబాలన్ సిల్వర్ స్క్రీన్‌పై మాత్రమే కాదు.. బుల్లితెరలోనూ నటించిన విషయం మీకు తెలుసా.?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కెరీర్ ప్రారంభంలో 'హమ్ పాంచ్'
Image Credit : Vidya Balan Instagram

కెరీర్ ప్రారంభంలో 'హమ్ పాంచ్'

విద్యాబాలన్ తన చదువును కొనసాగిస్తున్నప్పుడు అనగా.. 1995లో ఆమెకు 'హమ్ పాంచ్' అనే షో కోసం ఆఫర్ వచ్చింది. ఆమె తల్లి తన నటనకు అంగీకరించకపోయినా.. అనుమతి తీసుకుని మరీ తనకు ఇష్టమైన షోలో నటించింది విద్యాబాలన్. ఏడాదిన్నర పాటు ఆ షోలో పనిచేసిన తర్వాత, విద్యాబాలన్ పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది. ఆపై మలయాళంలో ఆఫర్ దక్కించుకుంది. అంతేకాదు ఏకకాలంలో 12 సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది. అయితే, కొన్ని కారణాల వల్ల అవన్నింటిని కోల్పోయింది.

35
సినిమా అరంగేట్రం మోహన్‌లాల్‌తో..
Image Credit : Vidya Balan Instagram

సినిమా అరంగేట్రం మోహన్‌లాల్‌తో..

బుల్లితెర నుంచి విరామం తీసుకున్న తర్వాత.. విద్యాబాలన్ ఓ యాడ్ షూటింగ్ నిమిత్తం కేరళకు వెళ్ళింది. అక్కడ ఓ నిర్మాత ఆమెను చూడటం జరిగింది. అలా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ 'చక్రభ' సినిమా ఆఫర్ దక్కింది. అయితే ఆ సినిమా ఎప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఈ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో.. ఆమెకు అంతకముందు వచ్చిన 12 చిత్రాలు కూడా దూరమయ్యాయి.

45
ఎక్కడా డిప్రెస్ అవ్వకుండా.. మనోధైర్యంతో..
Image Credit : Vidya Balan Instagram

ఎక్కడా డిప్రెస్ అవ్వకుండా.. మనోధైర్యంతో..

ఒకేసారి డజను సినిమాలు కోల్పోవడంతో విద్యాబాలన్ కాసింత డిప్రెస్ అయినా.. ఆ తర్వాత మనోధైర్యాన్ని కోల్పోలేదు. క్లిష్ట సమయంలో ఆమె తన ఇంటికి సమీపంలోని ఒక ఆలయాన్ని సందర్శించి దేవుడ్ని మొక్కుకుంది. ఆపై బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇక అనంతరం తిరిగి చూసుకోలేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

55
బాలీవుడ్‌లో గొప్ప చిత్రాలకు కేరాఫ్..
Image Credit : Vidya Balan Instagram

బాలీవుడ్‌లో గొప్ప చిత్రాలకు కేరాఫ్..

విద్యాబాలన్ 2005లో సంజయ్ దత్, సైఫ్ అలీఖాన్‌లతో కలిసి 'పరిణీత' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తన 20 సంవత్సరాల బాలీవుడ్ కెరీర్‌లో 'మిషన్ మంగళ్', 'తుమ్హారీ సులు', 'కహానీ', 'ది డర్టీ పిక్చర్', 'నో వన్ కిల్డ్ జెస్సికా', 'ఇష్కియా', 'పా', 'భూల్ భూలైయా', 'హే బేబీ', 'లగే రహో మున్నాభాయ్' వంటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా
బాలీవుడ్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Recommended image2
Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Recommended image3
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Related Stories
Recommended image1
Top 5 OTT Movies and Series: ఓటీటీలో కూలీకి షాకిచ్చిన మహావతార్‌ నరసింహ, సైయారా.. రజనీ మూవీ స్థానం ఎక్కడంటే
Recommended image2
OTT: రూ. 500 కోట్ల బడ్జెట్.. ఐఎండీబీలో టాప్ రేటింగ్.. 9 ఏళ్లుగా ఓటీటీ ఆడియన్స్‌ను భయపెడుతోన్న వెబ్‌సిరీస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved