'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ అంటూ బాలయ్య హీరోయిన్ వెటకారం?!
ఊర్వశి రౌటేలా, కియారా అద్వానీ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తోంది. డాకు మహారాజ్ సినిమా విజయం తర్వాత ఊర్వశి, గేమ్ ఛేంజర్ సినిమా పరాజయంపై వ్యాఖ్యలు చేయడంతో చరణ్ అభిమానులు ఆమెపై విమర్శలు చేస్తున్నారు.

Urvashi Rautela, Kiara Advani, Game Changer
బాలీవుడ్ భామలకు ఒకరంటే ఒకరికి పడుతున్నట్లు లేదు. డైరక్ట్ గానో, ఇండైరక్ట్ గానో సోషల్ మీడియాలో యుద్దాలు ప్రకటించేస్తున్నారు. ఒకరిపై మరొకరు సెటైర్స్ వేసుకుంటున్నారు. ఇప్పుడు ఊర్వశి రౌటాలా అదే స్కీమ్ మొదలెట్టింది. తన సినిమా డాకూ మహారాజ్ తో పాటు రిలీజైన గేమ్ ఛేంజర్ సినిమాలో హీరోయిన్ గా చేసిన కియారా అద్వానీపై కౌంటర్స్ వేస్తోంది. అయితే అది పద్దతి కాదంటున్నారు సోషల్ మీడియా జనం.
Nandamuri Balakrishna Makes Urvashi Rautela Video
2025 సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు వచ్చాయి. అందులో మొట్ట మొదట రిలీజైన మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer Movie). రామ్‌చరణ్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తొలి రోజు భారీగానే వసూళ్లు రాబట్టినా డివైడ్ టాక్ వల్ల రెండో రోజు నుంచి డీలా పడిపోయింది. కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. వేరే హీరోల ఫ్యాన్స్, కొంతమంది నెటిజన్లు సినిమాపై సోషల్ మీడియాలో బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. ఈ సినిమాని కావాలని కొంతమంది పైరసీ కూడా చేసారు. దీంతో మూవీ యూనిట్ కూడా సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసింది.
గేమ్ ఛేంజర్ రిలీజైన రెండు రోజుల గ్యాప్‌తో నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ (Daaku Maharaaj Movie)తో థియేటర్లలో అడుగుపెట్టాడు. ఈ సినిమాకు మార్నింగ్ షోకే హిట్ టాక్ రావడంతో కలెక్షన్లు ఊపందుకున్నాయి. రిలీజ్ కు ముందు దబిడి దిబిడి పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాతో బాలయ్య చేసిన స్టెప్పులపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కానీ అవేవీ సినిమా హిట్ అవ్వటానికి అడ్డం అవ్వలేదు.
రీసెంట్ గా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి రౌటేలాను సినిమా ఫలితాల గురించి పట్టించుకుంటారా? మీ సినిమాతో పాటు బాలీవుడ్ నటి కియారా గేమ్ ఛేంజర్ సినిమా కుడా రిలీజయింది కదా అని అడిగారు. దీనికి ఊర్వశి రౌటేలా సమాధానమిస్తూ.. ఎక్కువ కలెక్షన్స్ ఇచ్చే ట్యాగ్స్ ఉండాలి.
అది కూడా ఒక మంచి గుర్తింపు ఇస్తుంది సినిమా పరిశ్రమలో. వరల్డ్ వైడ్ మన యాక్టింగ్ స్కిల్స్ కి అభినందనలు వస్తాయి. నేను చాలా ట్వీట్స్ చదివాను. మా సినిమా మకర సంక్రాంతి ఫెస్టివల్ రోజు రిలీజయింది. 2025లో రూ.100 కోట్లు రాబట్టిన ఫస్ట్ అవుట్‌సైడర్ నటిగా ఓ రికార్డు ఇచ్చారు. అందరూ కియారా సినిమా డిజాస్టర్, ఊర్వశి సినిమా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు, అందులో నా తప్పేమిలేదు అని అంది. దీంతో ఊర్వశి వ్యాఖ్యలు వైరల్ అవ్వగా చరణ్ ఫ్యాన్స్ ఊర్వశిని విమర్శిస్తున్నారు.
దబిడి దిబిడి సాంగ్‌లోని స్టెప్పులపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. సక్సెస్ వెంట విమర్శలు కూడా ఉంటాయి. ఈ పాటపై జరుగుతున్న చర్చను నేను అర్థం చేసుకోగలను. నందమూరి బాలకృష్ణతో చేసిన డ్యాన్స్ విషయానికి వస్తే.. మా పర్ఫామెన్స్ గురించి పలువురూ పలురకాలుగా అభిప్రాయపడుతున్నారు. అందరి అభిప్రాయాలను నేను గౌరవిస్తాను.
Dabidi Dibidi song from Daaku Maharaaj
ఆయనతో కలిసి పని చేయడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో డ్యాన్స్ అంటే కేవలం పర్ఫామెన్స్ మాత్రమే కాదు.. కళపై నాకున్న గౌరవాన్ని సెలబ్రేట్ చేసుకోవడంగా ఫీలవుతాను. ఇదంతా కళలో ఒక భాగం. . మేము వేసిన ప్రతి స్టెప్ కూడా మమ్మల్ని మరింత అందంగా చూపించింది. ఆయనతో పని చేయడం వల్ల నా కల నిజమైనట్లుగా ఉంది అని చెప్పుకొచ్చింది.