MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జీన్స్ పాంట్ ను టాప్ గా మార్చిన ఉర్ఫీ జావేద్, ఇదేం పైత్యం అంటూ మండిపడుతున్న నెటిజన్లు

జీన్స్ పాంట్ ను టాప్ గా మార్చిన ఉర్ఫీ జావేద్, ఇదేం పైత్యం అంటూ మండిపడుతున్న నెటిజన్లు

మరో సరికొత్త అవతారం ఎత్తింది బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్. ఇప్పటికే మైండ్ బ్లోయింగ్ డిజైన్ కాస్ట్యూమ్స్ తో రచ్చ చేసిన ఈ బ్యూటీ.. ఈసారి బుర్ర తిరిగిపోయేలా మరో కొత్త రకంగా దుస్తులు కనిపెట్టింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 04 2023, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
urfi javed

urfi javed

ఒక హీరోనో.. ఒక హీరోయినో.. చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా సరే అది ఫ్యాషన్ గా మారుతుంది. మారడం కూడా కాదు..దాన్ని ఫ్యాషన్ గా మారుస్తారు ఫ్యాన్స్. ఇది అన్ని ఇండస్ట్రీలలో ఉన్నదే. అయితే కొన్ని సార్లు మాత్రం స్టార్లే ఫ్యాషన్ డిజైనర్లుగా మారి..తమ ఐడియాలను రుద్దేస్తుంటారు. అందులో బాలీవుడ్ యాక్ట్రస్ ఉర్పీ జావేద్ ఒకరు. 

27

సాధారణంగా అయితే ఫ్యాషన్ డిజైనర్ల కాస్ట్యూమ్స్ ను కొంత మంది యాక్టర్స్  ప్రమోట్ చేస్తుంటారు. మరి కొంత మంది మాత్రం తమ స్పెషాలిటీ చూపించడం కోసం సొంతంగా కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేస్తుంటారు.  వారి బట్టలు వారే స్వంగా..  మేకోవర్ చేయిస్తుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుందీ బాలీవుడ్ నటి, మోడల్ ఉర్ఫీ జావేద్. 

37
Image: Urfi Javed / Instagram

Image: Urfi Javed / Instagram

తీరొక్క రకాల.. వెరైటీ వెరైటీ కాస్ట్యూమ్స్ తో.. అందరిలో స్పెషల్ గా ఉంటుంది ఉర్ఫీ.అంతే కాదు హాట్ హాట్ గా కనిపిస్తూ.. అందాలు ఆరబోస్తూ..  కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది కూడా. ప్రతి రోజూ ఏదో ఒక బోల్డ్ లుక్ లో దర్శనమిస్తుంటుంది. సోషల్ మీడియాల స్పెషల్ గా కనిపిస్తుంది.. తాను చాలా స్పెషల్ అనిపిస్తుంటుంది ఉర్ఫీ. 

47
urfi javed 11

urfi javed 11

ఇక తాను చేసే ప్రయోగాలు..  తన డ్రెసింగ్ స్టైల్స్ పై ఎంత మంది ఎన్ని కామెంట్లు చేసినా.. ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినా ఆమె లెక్క చేయదు...వెనక్కు తగ్గదు. ఇక ఈ క్రమంలోనే..  తాజాగా మరో డ్రెస్‌తో హాట్ టాపిక్ గా మారింది ఉర్ఫీ. డిఫరెంట్ గా బయటకు వచ్చింది. అందరికి ఆశ్చర్యం కలిగించింది. దాంతో  కెమెరా కళ్లు క్లిక్ మనిపించడం..  ఈ ఫోటోలు నెట్టింట్లో  వైరల్ అవ్వడం కూడా అయిపోయింది. 

57
urfi javed

urfi javed

తాజాగా  మరో కొత్త అవతారంలో కనిపించింది ఉర్ఫీ జావేద్. డెనిమ్ జీన్స్ ఫ్యాంట్ ను టాప్ గా మార్చేసింది. పైనా కిందా జీన్స్  ధరించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. జీన్స్‌కి క్రియేటివ్ టచ్ ఇచ్చింది ఉర్ఫీ..  దాన్ని టాప్‌గా మార్చేసింది.. అయితే  వాటిని ఎవరికో వేసి ఆనందించకుండా.. తానే స్వయంగా  ధరించి జూహులోని ఓ రెస్టారెంట్‌కు వచ్చింది. దాంతో కెమెరాలు వాటి కళ్లకు పని చెప్పేశాయి.

67
urfi javed

urfi javed

ఉర్ఫీ మళ్లీ..మరో ప్రయోగం చేసింది బాబోయ్ అంటూ.. అక్కడివారు అనుకోవడం.. మనకు మంచి పని దొరికిందంటూ.. ఫోటో గ్రాఫర్లు సంతోషించడం.. వెరసీ.. ఉర్ఫీ ఈ ప్రయోగానికి మంచి పబ్లిసిటీ వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఉర్పీ డ్రెస్ కు ప్రచారం కూడా అయిపోయింది. ఇక జనాల కామెంట్ల విషయయానికి వస్తే.. తిట్టేవారు తిడుతున్నారు.. పొగిడే వారు పొగుడుతున్నారు. 
 

77
urfi javed

urfi javed

హిందీ బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొంది ఉర్ఫీ జావేద్. ఆతరువాత బాగా ఫేమస్ అయ్యింది. ఈ ప్రోగ్రామ్ తరువాతే  ఉర్ఫీ జావేద్‌కు ఫేమ్ వచ్చింది. ఇక రీసెంట్ గా హై హై యే మజ్పూరి అనే సాంగ్ లో హాట్ లుక్ లో కనిపించింది. ఫుల్ గ్లామర్ షో చేయడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం ఉర్ఫీ రియాలిటీ సిరిస్ స్పిట్ విల్లా సీజన్ 14లో పాల్గొంటుంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Recommended image2
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved