సైమా అవార్డ్స్ లో కృతి శెట్టి.. ఆమెని ఇలా చూస్తే కుర్రాళ్ల గుండెల్లో ఉప్పెనే
డెబ్యూ చిత్రమే ఘనవిజయం సాధించే అదృష్టం కొంతమంది హీరోయిన్లకు మాత్రమే దక్కుతుంది. ఆ జాబితాలో చేరిపోయింది ఉప్పెన బ్యూటీ

డెబ్యూ చిత్రమే ఘనవిజయం సాధించే అదృష్టం కొంతమంది హీరోయిన్లకు మాత్రమే దక్కుతుంది. ఆ జాబితాలో చేరిపోయింది ఉప్పెన బ్యూటీ
కృతి శెట్టి. ఈ యంగ్ బ్యూటీ క్యూట్ లుక్స్, కళ్ళతోనే హావభావాలు పలికించగలిగే కెపాసిటీ యువతలో మంచి క్రేజ్ తెచ్చిపెట్టేలా చేశాయి.
ఉప్పెనలో కృతి శెట్టి నటనకు 100 శాతం మార్కులు పడ్డాయి. ఇక గ్లామర్ పరంగా కూడా క్రేజ్ తెచ్చుకుంటే టాలీవుడ్ ని ఊపేయడం ఖాయం.
కృతి శెట్టికి ప్రస్తుతం వరుస ఆఫర్స్ దక్కుతున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరోలు తమ చిత్రాల్లో హీరోయిన్ గా కృతి శెట్టిని ఎంపిక చేసుకుంటున్నారు.
ప్రస్తుతం కృతి శెట్టి నితిన్, రామ్, నాని లాంటి యంగ్ హీరోల సరసన నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా కృతి శెట్టి హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్న సైమా అవార్డ్స్ లో పాల్గొంది.
సైమా అవార్డ్స్ లో కృతి శెట్టి క్యూట్ లుక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆమెని చూడగానే యువత మైమరచిపోతారు అనడంలో సందేహం లేదు. కృతి శెట్టి సైమా వేడుకలో ఆకర్షణగా నిలిచింది.