MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరలో ఉపాసన అందం ఓవర్‌ లోడ్.. థ్రోబ్యాక్‌ ఫోటోలతో సండే ట్రీట్‌.. ఇన్నాళ్లు మిస్‌ చేసిందే!

చీరలో ఉపాసన అందం ఓవర్‌ లోడ్.. థ్రోబ్యాక్‌ ఫోటోలతో సండే ట్రీట్‌.. ఇన్నాళ్లు మిస్‌ చేసిందే!

మెగా కోడలు ఉపాసన కొణిదెల ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. ఇటీవల గ్లామర్‌ ఫోటోలతో, బేబీ బంప్‌ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. రెగ్యూలర్‌గా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రతి మూవ్‌మెంట్‌ని షేర్‌ చేస్తుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : May 28 2023, 09:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఉపాసన తాజాగా రెడ్‌ శారీలో మెరిసిపోతున్న ఫోటోలను పంచుకుంది. అందం ఓవర్‌ లోడ్‌ అనేలా ఆమె ఫోటోలుండటం విశేషం. నిండైన శారీలో ఆమె ఎంతో కనువిందు చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ఉపాసన, కాస్త క్యూట్‌నెస్‌, ఇంకాస్త హాట్‌నెస్‌ మేళవింపుగా ఉండటం విశేషం.

26

ఉపాసన పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు ఆమె థ్రోబ్యాక్‌ పిక్చర్స్ కావడం విశేషం. త్రైమాసికంలో దిగిన ఫోటోలు తన ఫోన్‌లో ఉన్నాయట. ఇన్నాళ్లకి అవి కనిపించాయట. దీంతో ఇన్ని రోజులు వీటిని మీతో పంచుకోలేదా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అభిమానులతో షేర్‌ చేసింది ఉపసాన. ప్రస్తుతం అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

36

ఉపాసన ప్రస్తుతం గర్భవతిగా ఉంది. మరికొన్ని రోజుల్లో ఆమె తల్లి కాబోతుంది. పండంటి బిడ్డకి జన్మనివ్వబోతుంది. పదేళ్ల తర్వాత తాను గర్బవతి కావడంతో ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. భర్త, రామ్‌చరణ్‌ కూడా ఈ మూవ్‌మెంట్‌ని చాలా స్పెషల్‌గా భావిస్తున్నారు. అందుకే తరచూ ఆ ఆనందాన్ని పంచుకుంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి సైతం తమ వారసుడి కోసం వేచి చూస్తున్నారని చెప్పొచ్చు. 
 

46

ఉపాసన మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తున్నారు. ఆమె అపోలో ఫార్మాకీ హెడ్‌గా ఉన్నారు. మరోవైపు సామాజిక కార్యకర్తగా రాణిస్తున్నారు. మెగా ఫ్యామిలీలో కోడలిగా ఇలా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నారు. ఉపాసన.. పదేళ్ల క్రితం రామ్‌చరణ్‌ని పెళ్లి చేసుకున్న విషయంతెలిసిందే. మొదట వీరిది అరెంజ్‌ మ్యారేజ్‌ అని అంతా అనుకున్నారు. కానీ దాని వెనకాల వీరిద్దరి మధ్యలవ్‌ స్టోరీ ఉందని ఆ తర్వాత వెల్లడించారు. పెళ్లికి ముందు కొన్నాళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. 
 

56
Upasana Konidela

Upasana Konidela

ఇక పెళ్లి తర్వాత తమ జీవితంలో గోల్స్ రీచ్‌ అయ్యే క్రమంలో పిల్లలకు గ్యాప్‌ తీసుకోవాలనుకున్నారట. అలా దాదాపు పదేళ్ల పాటు వీరు గ్యాప్‌ తీసుకున్నారు. అయితే గతేడాది వీరికి పిల్లలు పుట్టుకపోవడానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పిల్లలు అయ్యే యోగ్యం లేదా? అనే కామెంట్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ తమ ప్రెగ్నెన్సీని ప్రకటించారీ రామ్‌చరణ్‌, ఉపాసన జంట. 
 

66

ఇక రామ్‌చరణ్‌ ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. ఆయన `ఆర్‌ఆర్‌ఆర్‌`తో తన ఇమేజ్‌ని అమాంతం పెంచుకున్నారు. ఇండియా వైడ్‌గా చరణ్‌ నటించిన అల్లూరి సీతారామరాజు పాత్ర బాగా ఆదరణ పొందింది. దీనికి తోడు అంతర్జాతీయంగానూ తన పాపులారిటీని సొంతం చేసుకున్నారు చరణ్‌. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వేడుకలో, ఆస్కార్‌ వేడుక సమయంలో చరణ్‌ అంతర్జాతీయ మీడియాతో చిట్‌చాట్‌ చేసి తన సత్తాని చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన శంకర్‌తో `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Anushka Shetty: అనుష్క పాత్ర వల్లే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ ? అంతా అయిపోయాక క్లాసిక్ అంటూ ప్రశంసలు
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ కంటే.. శోభన్ బాబు తో కంఫర్ట్ ఎక్కువ అన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
రజినీకాంత్ ను కొట్టమనందుకు.. సినిమానే వదిలేసిన స్టార్ హీరోయిన్? ఖుష్బూ మిస్ అయిన మూవీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved