MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Ram Charan: పెద్ది రిలీజ్ పై ట్విస్టుల మీద ట్విస్ట్, ఫైనల్ డేట్ ఇదే, మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందా?

Ram Charan: పెద్ది రిలీజ్ పై ట్విస్టుల మీద ట్విస్ట్, ఫైనల్ డేట్ ఇదే, మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందా?

మెగా అభిమానులకు గుడ్ న్యూస్  రామ్ చరణ్ పెద్ది సినిమా ఫైనల్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తోన్న క్షణం త్వరలోనే ఉంది. తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న పెద్ది సినిమా.. థియేటర్లలో సందడి చేయబోయేది ఎప్పుడంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 01 2026, 06:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
షూటింగ్ కంప్లీట్ చేసుకున్న పెద్ది
Image Credit : Asianet News

షూటింగ్ కంప్లీట్ చేసుకున్న పెద్ది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది' షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రియశిష్యుడు బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫైనల్ రిలీజ్ డేట్ ను.. మూవీ టీమ్ తాజాగా ప్రకటించింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి పెద్ది సినిమా విడుదలవుతున్నట్టు ప్రకటించి.. ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసింది బుచ్చిబాబు టీమ్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
టాక్సిక్ పోస్ట్ పోన్ అవ్వడంతో..
Image Credit : X

టాక్సిక్ పోస్ట్ పోన్ అవ్వడంతో..

ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది పెద్ది. 2026 పొంగల్ కు రిలీజ్ అవుతుంది అనుకుంటే.. సమ్మర్ కు పోస్ట్ పోన్ అయ్యింది. అప్పటికీ షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడంతో.. సమ్మర్ బరి నుంచి కూడా తప్పుకుని జూన్ 25న ఈసినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నారట చరణ్ టీమ్. కానీ ఈలోపు 4న రిలీజ్ కావల్సిన టాక్సిక్ పోస్ట్ పోన్ అవ్వడంతో.. ఈ డేట్ ను పెద్ది టీమ్ లాక్ చేసుకున్నారు. సమ్మర్ హాలిడేస్ చివరి దశలో ఉండటం.. స్కూల్స్, కాలేజీలు స్టార్ట్ అవ్వడానికి ముందు.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని అంచనాతో ఈ డేట్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది.

Related Articles

Related image1
9 ఏళ్ల కెరీర్ లో 100 కోట్ల ఆస్తి, 29 ఏళ్ల వయసులో భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Related image2
Chiranjeevi: నువ్వేమన్నా స్టార్ హీరోవి అనుకుంటున్నావా.. చిరంజీవిని దారుణంగా అవమానించిన స్టార్ డైరెక్టర్ ఎవరు?
34
పహిల్వాన్ లుక్ కి అభిమానులు ఫిదా
Image Credit : Asianet News

పహిల్వాన్ లుక్ కి అభిమానులు ఫిదా

హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌లో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఒక అద్భుతమైన స్పెషల్ సాంగ్ షూట్ ను మూవీ టీమ్ పూర్తి చేయడంతో.. అధికారికంగా ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యాయి. ఈ ఎనర్జిటిక్ సాంగ్ 'పెద్ది' చిత్రంలోని మెయిన్ హైలెట్స్ లో ఒకటిగా నిలవనుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌ గా సాగుతున్నాయి.ఈ నెలలో ఫైనల్ వర్క్ కంప్లీట్ చేస్తూనే.. ప్రమోసన్స్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పెద్ది నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, స్పెషల్ వీడియోస్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా పహిల్వాన్ గా రామ్ చరణ్ లుక్ కు అభిమానులు ఫిదా అయిపోయారు.

44
పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్
Image Credit : Instagram/peddimovie

పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్

ఈ సినిమాలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా, సీనియర్ నటులు శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్‌ అందిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్, స్ట్రాంగ్ ఎమోషన్స్ తో కూడిన రూరల్ స్పోర్ట్స్ కథతో రూపొందిన 'పెద్ది' హిందీతో పాటు అన్ని దక్షిణ భారత భాషలలో పాన్-ఇండియా స్థాయిలో ఘనంగా విడుదల కానుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
రామ్ చరణ్ కొణిదెల
జాన్వీ కపూర్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Romanchakam Day 2 Collections: రోమాంచకం మూవీకి అదిరిపోయే కలెక్షన్లు.. 2 రోజుల్లో ఎంత వచ్చాయంటే?
Recommended image2
Sancharame Folk Song : మనిషి జీవితాన్ని కొత్తగా చూపించే జానపదం... ఈ లిరిక్స్ కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..!
Recommended image3
Tollywood: మీడియం బడ్జెట్ సినిమాలతో బడా స్టార్లని తొక్కేశారు.. 100 కోట్ల లాభాలు తెచ్చిన ముగ్గురు హీరోలు
Related Stories
Recommended image1
9 ఏళ్ల కెరీర్ లో 100 కోట్ల ఆస్తి, 29 ఏళ్ల వయసులో భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Chiranjeevi: నువ్వేమన్నా స్టార్ హీరోవి అనుకుంటున్నావా.. చిరంజీవిని దారుణంగా అవమానించిన స్టార్ డైరెక్టర్ ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved