ఉపాసన అమ్మ మనసు.. తల్లి అయ్యాక పిల్లల కోసం సంచలన నిర్ణయం..
మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ భార్య ఉపాసన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తల్లి అయ్యాక తాను చూసిన సంఘటనల కారణంగా ఓ అదిరిపోయే నిర్ణయం తీసుకుంది.

రామ్‌చరణ్ భార్య, మెగా కోడలు ఉపసాన ప్రెగ్నెన్సీతోపాటు ఆమె డెలివరీ కూడా ఇండియా వైడ్‌గా చర్చనీయాంశమైంది. నేషనల్ మీడియా సైతం ఆమె డెలివరీని హైలైట్ చేసింది. దీంతో ఇటీవల కాలంలో ఓ ప్రెగ్నెన్సీ ఇంత పాపులారిటీ, హైలైట్ కావడం కేవలం రామ్‌చరణ్, ఉపాసనలు పేరెంట్స్ కావడమనే చెప్పాలి. చరణ్.. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన నేపథ్యంలో వారికి సంబంధించిన ప్రతి విషయం వార్తగా మారుతుంది. అందులో భాగంగానే ఉపాసన డెలివరీ కూడా హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉంటే తన ప్రెగ్నెన్సీ, డెలివరీ, తల్లి అయ్యాక తాను చూసిన సంఘటనలు, ఫేస్ చేసిన అనుభవాల నుంచి, తాను విన్న సంఘటనల నుంచి తనలో మార్పు వచ్చింది. దీంతో పిల్లల కోసం ఉపాసన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సింగిల్ పేరెంట్స్ చిన్నారులకు ఉచితంగా ఓపీడీ ప్రారంభించారు. అపోలో ఆసుపత్రుల్లో వీకెండ్స్ లో ఉచితంగా చికిత్స అందించేందుకుగానూ పిల్లల విభాగాన్ని ప్రారంభించారు ఉపాసన.
సోమవారం అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపసాన ఈ విషయాన్ని వెల్లడించారు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్న ఉపాసన ఈ మేరకు చిల్డ్రన్స్ హాస్పిటల్స్ లోగోని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె తన అనుభవాలను వెల్లడించారు. తాను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో అందరూ తనపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించటంతో పాటు ఆశీర్వాదాలను అందించారు. తన ప్రెగ్నెన్సీ జర్నీని అద్భుతమైన జ్ఞాపకంగా చేసిన అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియచేశారు ఉపాసన.
ఇంకా చెబుతూ, అపోలో పీడియాట్రిక్, అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో ఆనందంగా ఉందని, ప్రతీ తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోషనల్ జర్నీ. బిడ్డకు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంతో కోలుకుంటే వారి ఆనందానికి అంతే ఉండదు. అలాంటి మధుర క్షణాలను తల్లిదండ్రులకు అందిస్తోన్న డాక్టర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు ఉపాసన.
ఈ సందర్భంగా తన ప్రెగ్నెన్సీ గురించి ఓపెన్ అయ్యారు ఉపాసన. `నా ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది నన్ను కలిసి వారి సలహాలను ఇచ్చేవారు. అయితే కొందరి మహిళలకు ఇలాంటి సపోర్ట్ దొరకదు. ఆ విషయం నాకు తెలిసి బాధవేసింది. మరీ ముఖ్యంగా సింగిల్ మదర్స్‌కు ఇలాంటి విషయాల్లో సపోర్ట్ పెద్దగా ఉండదు. కాబట్టి అపోలో వైస్ చైర్‌పర్సన్‌గా నేను ఓ ప్రకటన చేయాలని అనుకుంటున్నా. వీకెండ్స్‌లో సింగిల్ మదర్ పిల్లలకు ఉచితంగా ఓపీడీ చికిత్సను అందించబోతున్నాం. ఇలాంటి ఓ ఎమోషనల్ జర్నీలో నేను వారికి నా వంతు సపోర్ట్ అందించటానికి సిద్ధం. ఈ ప్రకటన చేయటానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది చాలా మందికి హెల్ప్ అవుతుందని భావిస్తున్నా` అని వెల్లడించింది ఉపాసన.
రామ్‌చరణ్, ఉపాసన ఇటీవల పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ చిన్నారికి క్లీంకార కొణిదెల అనే పేరుని నామకరణం చేశారు. 21రోజులు వేడుక గ్రాండ్‌గా చేశారు. పుట్టుకతోనే స్టార్ స్టేటస్‌ని పొందిన ఆ చిన్నారి జననం ఇండియా వైడ్‌గా చర్చనీయాంశంగా మారడం విశేషం.