రామ్ చరణ్ కి ఉపాసన వార్నింగ్..? హీరోయిన్ తో ఆ సీన్లపై మెగా కోడలు గరం.. గరం...
హీరోయిన్లతో రామ్ చరణ్ రొమాన్స్ పై స్పందించింది ఉపాసన. చరణ్ ఆసీన్లు చేసినప్పుడు తాన ఫీలింగో ఏంటీ.. చరణ్ తో ఆమె ఎంచెప్పారు అనే విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది మెగా కోడలు.
Upasana Konidela
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ కపుల్స్ గా.. రామ్ చరణ్, ఉపాసన పేరు తెచ్చుకున్నారు. ఉపాసన సినిమా రంగానికి సబంధం లేకపోయినా.. బిజినెస్ ఉమెన్ గా ఆమె ప్రతీ ఒక్కరికి తెలుసు.
వీరి పెల్ళి జరిగి దాదాపు 12 ఏళ్లు అయ్యింది. అప్పటి నుంచి అన్యోన్య దంపతులుగా మంచి పేరు తెచ్చుకున్నారు జంట. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఈ స్నేహితులు.. భార్య భర్తలుగా కూడా మంచి పేరు సాధించారు.
హీరోగా రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. పాన్ ఇండియా హీరోగా మెగా పవర్ స్టార్ వెలుగు వెలిగిపోతున్నాడు. ఇక అటు మెగా కోడలు ఉపాసన కొణిదెల.. అపోలో హాస్పిటల్స్ అధిపతిగా.. మోడల్ గా.. సామాజిక కార్యకర్తగా.. సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా రకరకాల పాత్రలు పోషిస్తోంది. అంతే కాదు ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ విషయాలు సోషల్ మీడియాలో పంచుకుంటూ.. మెగా ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తుంటుంది ఉపాసన.
Upasana Konidela
ఇక వీరి పెళ్లి జరిగిన తరువాత దాదాపు 11 ఏళ్లకు పేరెంట్స్ గా మారారు స్టార్స్. లాస్ట్ ఇయర్ క్లింకారకు జన్మనిచ్చింది ఉపాసన. తాము అనుమెగా ప్యామిలీలో క్లింకార రాకతో అన్ని శుభాలు జరుగుతుండగా.. ఫ్యామిలీ అంతా పండగ వాతవారణ నెలకొంది. కునే పిల్లల విషయంలో గ్యాప్ ఇచ్చామని ఆమె క్లారిటీ కూడా ఇచ్చారు.
ఇక ఇవన్నీ ఇలా ఉండగా.. తాజాగా ఉపాసన. రామ్ చరణ్ కు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. పెళ్లైన కొత్తలో రామ్ చరణ్ సినిమాల గురించి ఉపాసన భయపడిందట. ఉపాసనకు సినిమాల మీద పెద్దగా అవగాహన లేకపోవడం.. ఇద్దరు వేరు వేరు ఫీల్డ్స్ నుంచి రావడంతో.. చరణ్ హీరోయిన్లతో క్లోజ్ గా ఉండవటం చూసి.. ఫీల్ అయ్యిందట. చరణ్ రొమాంటిక్ సీన్స్ చూసి తట్టుకోలేక అడిగేసిందట ఉపాసన.
Upasana Konidela
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన.. తనది, రామ్ చరణ్‌ది రెండు వేర్వేరు ప్రపంచాలు అని, అందుకే పెళ్లయిన కొత్తలో తన వర్క్‌ను అర్థం చేసుకోవడం ఇబ్బందిగా ఉండేదని బయటపెట్టారు. చరణ్ ఇంటిమేట్ సీన్స్ వల్ల పెళ్ళైన కొత్తలో వారి మధ్య ఎలాంటి విభేదాలు వచ్చాయని ఉపాసన చెప్పుకొచ్చారు.
సినిమాల్లో హీరోలు.. హీరోయిన్స్‌తో క్లోజ్ గా ఉండటం సహజం కాని ఉపాసన చరణ్ అలా ఉండటం సహించలేకపోయిందట. అలాంటి సీన్స్ ఉపాసనకు నచ్చేవి కాదట. చరణ్ ను అలాంటి సీన్స్ అవసరమా అని చాలాసార్లు అడిగాను అన్నారు ఉపాసన. అయితే మెగా పవర్ స్టార్ మాత్రం ఉపాసనను అర్ధం చేసుకుని.. ఆమెకు అర్ధం అయ్యేలా చెప్పేవారట. తన ప్రొషెషన్ అలాంటిదని. దాన్ని తప్పుగా అర్ధం చేసకోవద్దు అని.. అదిసినిమా మాత్రమే బయట అలా ఉండదు అని ఉపాసనకునమ్మకం కలిగేలా చెప్పాడం.
ఇక రాను రాను చరణ్ తో పాటు ట్రావెల్ చేసే క్రమంలో ఉపాసన అన్నీఅర్ధం చేసుకుందట. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకూ వారిమధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇద్దరు బిజినెస్ లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తూ.. చరణ్ సినిమాల్లో రాణిస్తూ.. దూసుకపోతున్నారు. క్లింకారతో హ్యాపీగా ఉంటున్నారు. ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ ఎండింగ్ లో ఉంది.. ఈసినిమా తరువాత బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు చరణ్.