- Home
- Entertainment
- రాంచరణ్ తో నాది మగధీర లవ్ స్టోరీ కాదు, మావయ్య ఫస్ట్ టైం నన్ను చూడగానే ఆ మాట అన్నారు.. ఉపాసన కామెంట్స్
రాంచరణ్ తో నాది మగధీర లవ్ స్టోరీ కాదు, మావయ్య ఫస్ట్ టైం నన్ను చూడగానే ఆ మాట అన్నారు.. ఉపాసన కామెంట్స్
ఉపాసన, రామ్‌చరణ్‌తో వివాహ జీవితం గురించి మాట్లాడుతూ, అత్తగారు సురేఖ తనకు ఇచ్చిన సపోర్ట్ , చిరంజీవి మొదటి స్పందన, ప్రేమకథ వివరాలు పంచుకున్నారు.

ఫ్యామిలీ గురించి ఉపాసన చెప్పిన సంగతులు
ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలు. 2012లో ఉపాసన, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ల వివాహం జరిగింది. దాదాపు పదేళ్ల పెళ్లి తర్వాత వీరికి కుమార్తె జన్మించింది. కూతురికి క్లీంకార అని నామకరణం చేశారు. తాజాగా ఉపాసన కర్లీ టేల్స్ అనే ట్రావెల్ సంస్థతో జరిగిన చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఉపాసన రాంచరణ్ తో ప్రేమ పెళ్లి.. ఆ తర్వాత మావయ్య చిరంజీవి, అత్తగారు సురేఖ కొణిదెల సపోర్ట్ గురించి అనేక విషయాలు పంచుకుంది. రాంచరణ్ నివాసంలోనే ఈ ఇంటర్వ్యూ జరిగింది. ఇంటి లోపల దృశ్యాలు అబ్బురపరిచేలా ఉన్నాయి.
సురేఖ ఇచ్చిన సపోర్ట్
రాంచరణ్ లాంటి సూపర్ స్టార్ కి భార్యగా ఉండడం అంత సులువైన విషయం కాదు. చరణ్ కి ఎప్పుడూ యాక్టింగ్ పైనే ధ్యాస ఉంటుంది. హాలిడేస్, సండేస్ లో కూడా షూటింగ్ కి వెళతాడు. ఈ లైఫ్ నాకు కొత్త. దీనితో ఎదురయ్యే సవాళ్ళని ఎలా అధికమించాలి అని అత్తమ్మ సురేఖ గారు నాకు నేర్పించారు. పెళ్లి జరిగినప్పటి నుంచి ఆమె ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేను.
చూసినవి మాత్రమే నమ్మాలి
సురేఖ గారు నాకు ఇచ్చిన విలువలైన సలహా ఏంటంటే ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. అన్నింటినీ పట్టించుకోకూడదు. కళ్ళతో చూసిన దానిని మాత్రమే నమ్మాలి.ఇతరులు ఎన్నో విషయాలు చెబుతుంటారు అవన్నీ పట్టించుకోకూడదు అని తెలిపారు. ఆ సలహా నాకు ఎంతగానో ఉపయోగపడింది.
ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు మావయ్య చెప్పింది ఇదే
మావయ్య చిరంజీవి గారు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ అమ్మాయి ట్రెడిషనల్ కాదు.. కొంచెం డిఫెరెంట్ అని అన్నారు. ఆ మాటలు మరచిపోలేను. కానీ మావయ్య కూడా ఎంతో సపోర్టివ్ గా ఉంటారు. నా వర్క్ ని గౌరవిస్తారు అని ఉపాసన పేర్కొంది.
మగధీర లవ్ స్టోరీ కాదు మాది
రాంచరణ్ నాకు పరిచయమైనా కొత్తల్లో మా ఇద్దరివీ రెండు వేర్వేరు ప్రపంచాలు. ఇద్దరం ఒకరికొకరం అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. రెండేళ్ల వరకు ఫ్రెండ్ షిప్ మాత్రమే చేశాం. లవ్ లేదు. కానీ ఆ తర్వాత మేమిద్దరం ఒకరికొకరు పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఫీల్ అయ్యాం. ఆ విధంగా లవ్ మొదలైనట్లు ఉపాసన తెలిపింది. మా ఇద్దరి లవ్ స్టోరీ మగధీర చిత్రంలో తాకితే స్పార్క్ వచ్చినట్లు ఉండదు. మేమిద్దరం రియాలిటీలో జీవించాం అని ఉపాసన పేర్కొన్నారు.