- Home
- Entertainment
- చెంపలపై కొట్టుకుని నిజంగానే ఏడ్చేసిన పవన్ కళ్యాణ్, 40 టేకులు తీసుకున్న పవర్ స్టార్.. ఆ సీన్ గురించి తెలుసా
చెంపలపై కొట్టుకుని నిజంగానే ఏడ్చేసిన పవన్ కళ్యాణ్, 40 టేకులు తీసుకున్న పవర్ స్టార్.. ఆ సీన్ గురించి తెలుసా
పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎక్కువగా కష్టపడిన సన్నివేశం గురించి తెలిపారు. ఆ సీన్ కోసం నిజంగానే పవన్ ఏడ్చేశారట. అంతటి ఎమోషనల్ సీన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ ప్రేమ కథా చిత్రాలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ బిగినింగ్ లో ఎక్కువగా ప్రేమ కథా చిత్రాలు చేశారు. తొలిప్రేమ, సుస్వాగతం, ఖుషి లాంటి చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ అప్పట్లో తన చిత్రాల్లో మార్షల్ ఆర్ట్స్ సన్నివేశాలని ఎక్కువగా పెట్టేవారు. ఆ సీన్స్ కోసం పవన్ రియల్ స్టంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
KNOW
పవన్ కళ్యాణ్ ఎక్కువగా కష్టపడిన సీన్
పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎక్కువగా కష్టపడిన సన్నివేశం గురించి ఓ సందర్భంలో తెలిపారు. పవన్ కళ్యాణ్ అంతలా కష్టపడిన సీన్ సుస్వాగతం చిత్రంలోనిది. పవన్ మాట్లాడుతూ.. చదువు, బాధ్యత వదిలేసి కేవలం ప్రేమ కోసమే జీవితాన్ని వ్యర్థం చేసుకునే యువకుడి కథ సుస్వాగతం చిత్రం. తండ్రి ఉన్నప్పుడు ఆయన విలువ తెలియదు. దూరం అయినప్పుడే ఆ విలువ తెలుస్తుంది.
నిజంగానే ఏడ్చేసిన పవన్
ఆ చిత్రంలో తండ్రి చనిపోయినప్పుడు చాలా ఎమోషనల్ గా నేను ఏడవాలి. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆ సీన్ కోసం నిజంగానే ఏడ్చేశాను. అయినప్పటికీ డైరెక్టర్ భీమినేని శ్రీనివాస రావు గారు ఇంకా ఎమోషనల్ గా కావాలని చెప్పారు. దీనితో నన్ను నేనే చెంపలపై నిజగానే కొట్టుకుని ఏడ్చాను. చెంపలపై కొట్టుకుని తల నొప్పి కూడా వచ్చేసింది అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
రోజంతా ఏమీ తినకుండా..
సుస్వాగతం చిత్ర దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో క్లైమాక్స్ గురించి మాట్లాడారు. క్లైమాక్స్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఆ ఎమోషన్ పండించడానికి పవన్ కళ్యాణ్ రోజంతా ఏమీ తినలేదు. చాలా డెడికేషన్ తో సుస్వాగతం చిత్రంలో పవన్ నటించారు.
చిరంజీవి చేయాల్సిన మూవీ
ఆ తర్వాత భీమినేని శ్రీనివాస రావు, పవన్ కాంబినేషన్ లో అన్నవరం చిత్రం వచ్చింది. అయితే ఈ చిత్రం మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. తమిళంలో సూపర్ హిట్ అయిన తిరుప్పాచ్చి చిత్రానికి అన్నవరం రీమేక్. ముందుగా ఈ చిత్రం కోసం చిరంజీవిని నిర్మాతలు అప్రోచ్ అయ్యారట. కానీ చిరంజీవి ఈ కథ తన కంటే పవన్ కళ్యాణ్ కి బాగా సెట్ అవుతుందని చెప్పారట. ఆ విధంగా అన్నవరం చిత్రం పవన్ చేతుల్లోకి వచ్చింది.