MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఒక్క ఫ్లాప్‌ కూడా లేని స్టార్‌ డైరెక్టర్స్‌.. సౌత్ నుంచి ఐదుగురు హాట్ టాపిక్!

ఒక్క ఫ్లాప్‌ కూడా లేని స్టార్‌ డైరెక్టర్స్‌.. సౌత్ నుంచి ఐదుగురు హాట్ టాపిక్!

Success Directors : ఇండియన్ సినిమాకు వరల్డ్‌వైడ్‌గా కొత్త స్థాయి దక్కింది. బాహుబలి తర్వాత సౌత్ డైరెక్టర్స్ హాలీవుడ్ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడని 100% సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్ ఉన్నారు. ఆ లిస్ట్‌లో ఎవరన్నారు?    

3 Min read
Author : Rajesh K
Published : Sep 22 2025, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
100% సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్ లిస్ట్
Image Credit : Asianet News

100% సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్ లిస్ట్

100% Success Directors :  భారతీయ సినిమా స్థాయి పెరిగింది. వరల్డ్ వైడ్‌గా ఇండియన్ సినిమాలకు ఓ స్పెషల్ మార్క్ క్రియేట్ అయ్యింది. అందులో ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద షేక్ చేస్తున్నాయి. కొన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమా లెవల్ విడుదలై హాలీవుడ్ లెవెల్ క్రేజ్ సృష్టిస్తున్నాయి. బాహుబలి ముందు వరకు సౌత్ సినిమాలపై కొంత చిన్న చూపు ఉన్నాయి. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్, విక్రమ్, కాంతార, సలార్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలు వరల్డ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు. హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా మెప్పించాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడని డైరెక్టర్స్ జాబితా హాట్ టాపిక్‌గా మారింది. ఆ లిస్ట్‌లో సౌత్ నుంచి 5 గురు ఉండటం విశేషం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఎస్‌.ఎస్‌. రాజమౌళి (Tollywood)
Image Credit : Getty

ఎస్‌.ఎస్‌. రాజమౌళి (Tollywood)

భారతీయ సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ డైరెక్టర్ గా పేరొందిన దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి. ఇప్పటి వరకు రాజమౌళి 12 సినిమాలు చేశారు. ఒక్కటి కూడా ఫెయిల్ కాకుండా అన్ని బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. బాహుబలి సిరీస్‌తో ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన క్రెడిట్ ఆయన్నే దక్కింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు.

37
రాజ్‌కుమార్ హిరానీ (Bollywood)
Image Credit : instagram

రాజ్‌కుమార్ హిరానీ (Bollywood)

బాలీవుడ్ నుంచి లిస్ట్‌లో చోటు దక్కిన ఏకైక డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ. బాలీవుడ్‌లో 100% సక్సెస్ రేట్ తో దూసుకపోతున్నారు. ఇప్పటివరకు ఆయన కేవలం 5 సినిమాలకే దర్శకత్వం వహించి, అన్నింటినీ బ్లాక్‌బస్టర్‌లుగా నిలిపారు. మున్నాభాయి ఎంబీబీఎస్, 3 ఇడియట్స్, పీకే, సంజూ వంటి 6 సినిమాలు చేసి అన్ని బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. తన ప్రత్యేకమైన కథనం, ఎంటర్టైనింగ్ ట్రీట్మెంట్‌తో రాజ్‌కుమార్ హిరానీ హిందీ సినీ పరిశ్రమలో అత్యంత విశ్వసనీయ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

47
లోకేష్ కనగరాజ్ (Kollywood)
Image Credit : instagram

లోకేష్ కనగరాజ్ (Kollywood)

‘లోకీ’ అని అభిమానులు పిలుచుకునే లోకేష్ ఇప్పటి వరకు 6 సినిమాలు డైరెక్ట్ చేశారు. 2016లో అవియల్ షార్ట్ ఫిల్మ్‌తో తన సినీ ప్రయాణం ప్రారంభించారు. 2017లో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మానగరంతో దర్శకుడిగా బలమైన ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2019లో కార్తీతో ఖైదీ, 2021లో విజయ్‌తో మాస్టర్, కమల్ హాసన్‌తో విక్రమ్, మరోసారి విజయ్‌తో లియో చిత్రాలను తెరకెక్కించి భారీ విజయాలను సాధించారు. తాజాగా రజనీకాంత్‌తో కూలీ సినిమా తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, పూజా హెగ్డే తదితరులు నటించారు. ఈ సినిమా యావరేజ్ హిట్ అందుకుంది.

57
 అట్లీ కుమార్ (Kollywood)
Image Credit : our own

అట్లీ కుమార్ (Kollywood)

తనదైన స్టైల్లో మాస్ ఎంటర్‌టైనర్స్ ఇచ్చే అట్లీ, 5 సినిమాలు డైరెక్ట్ చేసి అన్ని బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచారు. హిందీలో షారుక్‌ ఖాన్‌తో 'జవాన్‌' తీసి, బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నారు తమిళ దర్శకుడు అట్లీ ( Atlee Kumar). 'జవాన్‌' సినిమా బాక్సాఫీస్‌ వసూళ్లు రూ. వెయ్యి కోట్లకు పైగా దాటేయడంతో బాలీవుడ్ మార్కెట్‌నే షేక్ చేశారు.

67
ప్రశాంత్ నీల్ (Sandalwood/Tollywood)
Image Credit : instagram

ప్రశాంత్ నీల్ (Sandalwood/Tollywood)

ప్రశాంత్ నీల్ ఈ పేరు వింటే సినీ అభిమానికి ఎలివేషన్స్ తో కూడిన భారీ సీన్స్ గుర్తుకు వస్తాయి. కన్నడ సినిమా ఇండస్ట్రీకి ఆయన ఓ వరం. కన్నడ, తెలుగు చలనచిత్ర రంగంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచుకొన్నారు ఒక అద్భుతమైన దర్శకుడు. కేజీఎఫ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు 4 సినిమాలు మాత్రమే చేశారు. కానీ అన్నీ వరల్డ్‌వైడ్ సెన్సేషన్ అయ్యాయి. సలార్ తో తన పాన్-ఇండియా స్థాయిని మరింత పెంచుకున్నారు.

77
అనిల్ రావిపూడి (Tollywood)
Image Credit : Asianet News

అనిల్ రావిపూడి (Tollywood)

కమెర్షియల్ ఎంటర్‌టైన్మెంట్‌లో తనదైన ముద్ర వేసుకున్న అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి టాలీవుడ్‌లో ప్రస్తుతం పర్ఫెక్ట్ సంక్రాంతి హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. 2015లో పటాస్ తో కెరీర్ ప్రారంభించి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడలేదు. సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకేవ్వరు, ఎఫ్3, భగవంత్ కేసరి వరకూ అన్ని హిట్స్ ఇచ్చిన ఆయన, 2024లో వెంకటేష్‌తో వచ్చిన సంక్రాంతి వస్తున్నాంతో మరోసారి బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్నారు. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా మేళవించి ప్రేక్షకులను అలరించడం ఆయన సక్సెస్ మంత్ర. వరుసగా రూ.100 కోట్ల మార్క్ దాటిన సినిమాలతో ఫెయిల్యూర్ అంటే తెలియని డైరెక్టర్ గా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. అన్ని సూపర్ హిట్స్‌గా నిలిచి ఆయనను “100% సక్సెస్ డైరెక్టర్”గా నిలబెట్టాయి.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
బాలీవుడ్ కు అనిల్ రావిపూడి, టాలీవుడ్ కు గుడ్ బై చెపుతాడా?
Recommended image2
కెన్యా షెడ్యూల్ కంప్లీట్, హైదరాబాద్ చేరిన మహేష్ బాబు , నెక్స్ట్ రాజమౌళి ప్లాన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved