MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కెన్యా షెడ్యూల్ కంప్లీట్, హైదరాబాద్ చేరిన మహేష్ బాబు , నెక్స్ట్ రాజమౌళి ప్లాన్ ఏంటి?

కెన్యా షెడ్యూల్ కంప్లీట్, హైదరాబాద్ చేరిన మహేష్ బాబు , నెక్స్ట్ రాజమౌళి ప్లాన్ ఏంటి?

దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రాజమౌళి , మహేష్ బాబు సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. చాలా కాలంగాఆఫ్రికాలో జరుగుతున్న లాంగ్ షెడ్యూల్ కప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఇక రాజమౌళి నెక్ట్స్ ప్లాన్ ఏంటి? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 14 2025, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హాలీవుడ్ రేంజ్ లో
Image Credit : instagram

హాలీవుడ్ రేంజ్ లో

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా గురించి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత రాజమౌళి చేస్తున్న తదుపరి చిత్రమిది కావడం, అందులో మహేష్ బాబు హీరోగా నటిస్తుండటంతో సహజంగానే ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘గ్లోబ్ ట్రాటర్’ అనే ట్యాగ్ లైన్‌తో దూసుకుపోతున్న ఈసినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో రూపొందిస్తున్నారు.

25
కెన్యా షెడ్యుల్ కంప్లీట్
Image Credit : X/SSMBTrendsTeam

కెన్యా షెడ్యుల్ కంప్లీట్

తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీకి సంబంధించిన కెన్యా షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. అక్కడ నిర్వహించిన షూటింగ్‌కు సంబంధించి లీకైన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. కర్ర పట్టుకుని కనిపించిన మహేష్ బాబు లుక్‌కి ఫ్యాన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ లుక్‌నే చూసి అభిమానులు “నెక్స్ట్ లెవల్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒరిజినల్ పోస్టర్ వస్తే ఆ క్రేజ్ మరింత పెరగనుంది అని టాక్.

Related Articles

Related image1
చిరంజీవి ఒడిలో ఆడుకుంటున్న ఈ చిన్నారి ప్రస్తుతం పాన్ ఇండియా హీరో, రీసెంట్ గా హిట్ కొట్టిన స్టార్ ?
Related image2
దేవదాసు రివ్యూ , తాగుబోతు కథ నడవదన్నారు, ఛాలెంజ్ గా తీసుకుని ఏఎన్నార్ ఏం చేశారంటే?
35
అడవుల్లో యాక్షన్ సీక్వెన్స్ లు
Image Credit : Instagram/Rajamouli

అడవుల్లో యాక్షన్ సీక్వెన్స్ లు

కెన్యా షెడ్యూల్‌లో అడవుల్లో భారీ ఛేజింగ్ సీన్లు, యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌ పూర్తి అయిన తరువాత యూనిట్ హైదరాబాద్‌ చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా ఈసినిమా కోసం ప్రత్యేకంగా సెట్లు వేసినట్టు సమాచారం. ఇక్కడ కూడా లాంగ్ షెడ్యుల్స్ ను కొనసాగించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే అక్కడి భారీ సెట్‌లో సినిమా షూటింగ్ కొనసాగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సెట్‌ కాశీ క్షేత్రం నేపథ్యంలో ఉండే సన్నివేశాల కోసం వాడుతున్నారట.

45
ఫిల్మ్ సిటీలో షెడ్యూల్
Image Credit : Asianet News

ఫిల్మ్ సిటీలో షెడ్యూల్

ఫిల్మ్ సిటీలో షెడ్యూల్ అక్టోబర్ 10 వరకు కొనసాగనుంది. ఇందులో సినిమాలో ఉన్న ప్రధాన పాత్రధారులంతా పాల్గొంటున్నారు. ఫస్ట్ హాఫ్‌కి సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత, సినిమా మొత్తం 50 శాతం షూటింగ్ పూర్తి అయినట్టవుతుంది. అలాగే, నవంబర్‌లో ఈ చిత్రానికి సంబంధించిన తొలి టీజర్‌ను విడుదల చేయనున్నట్టు రాజమౌళి టీమ్ నుంచి వినిపిస్తోన్న టాక్.

55
ఫ్యాన్స్ వెయిటింగ్
Image Credit : our own

ఫ్యాన్స్ వెయిటింగ్

బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృద్విరాజ్ సుకుమారన్‌లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్టు 2026 చివరలో విడుదలయ్యే అవకాశముంది. మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా టాలీవుడ్‌ ను మరో లెవల్ కు తీసుకెళ్లడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబుకు సబంధించి మేజర్ అప్ డేట్ కోసం ఆయన ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Suman: చరిత్రలో నిలిచిపోయిన సినిమా.. సుమన్ ని పక్కన పెట్టి మోహన్ బాబుతో చేసి ఉంటే అట్టర్ ఫ్లాప్
Recommended image2
Virosh Wedding: విజయ్- రష్మిక పెళ్లిలో పంది మాంసం పెడుతున్నారా?
Recommended image3
Trisha Krishnan: వివాదాలను దాటి దూసుకెళ్తున్న త్రిష, సెకండ్ ఇన్నింగ్స్‌ రచ్చ చేస్తోందిగా?
Related Stories
Recommended image1
చిరంజీవి ఒడిలో ఆడుకుంటున్న ఈ చిన్నారి ప్రస్తుతం పాన్ ఇండియా హీరో, రీసెంట్ గా హిట్ కొట్టిన స్టార్ ?
Recommended image2
దేవదాసు రివ్యూ , తాగుబోతు కథ నడవదన్నారు, ఛాలెంజ్ గా తీసుకుని ఏఎన్నార్ ఏం చేశారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved