బాలీవుడ్ కు అనిల్ రావిపూడి, టాలీవుడ్ కు గుడ్ బై చెపుతాడా?
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. రాజమౌళి తరువాత ఆ రికార్డ్ ఉన్న అనిల్ త్వరలో బాలీవుడ్ గుమ్మం తొక్కబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజమెంత?

రాజమౌళి తరువాత అతనే
టాలీవుడ్‌లో సక్సెస్ రేట్ పరంగా రాజమౌళి తర్వాత అత్యధిక విజయాలు సాధించిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఎంటర్టైన్మెంట్‌తో కూడిన ఫ్యామిలీ సినిమాలను తీస్తూ వరుసగా హిట్స్ అందుకుంటున్న ఆయన, ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్‌తో తీసిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో భారీ విజయం సాధించారు. ఈ చిత్రం దాదాపు 300 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి రీజనల్ సినిమాల రికార్డులు బద్దలు కొట్టింది.
మెగాస్టార్ తో సినిమా
సంక్రాంతికి వస్తున్నాం సినిమా తరువాత అనిల్ రావిపూడికి డిమాండ్ భారీ స్థాయిలో పెరిగింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ అనిల్ కు అవకాశం ఇచ్చాడు. అయితే చిరంజీవిని మునుపెన్నడు ఫ్యాన్స్ చూడని విధంగా చూపిస్తానని అనిల్ ఛాలెంజ్ చేసి మరీ, సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈసినిమా ఇప్పటికే 4 షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది.
బాలీవుడ్ కు అనిల్ రావిపూడి
ఇక మెగాస్టార్ తో సినిమా తరువాత అనిల్, త్వరలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నట్టు సమాచారం. ప్రస్తుత టాక్ ప్రకారం, నిర్మాత దిల్ రాజు "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాను హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఈ రీమేక్‌లో అక్షయ్ కుమార్ హీరోగా కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే బాలీవుడ్ రైటర్స్ టీమ్ అనిల్ రావిపూడిని కలిసి స్క్రిప్ట్ పై చర్చలు జరిపినట్టు సమాచారం. హిందీ నేటివిటీకి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేస్తూ, అదే టెంపోను స్క్రీన్‌ప్లే ను రీ రైడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అనిల్ ఒప్పుకుంటాడా?
అయితే ఈ ప్రాజెక్ట్‌ను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తారా లేదా మరో బాలీవుడ్ దర్శకుడికి అప్పగిస్తారా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. గతంలో "భగవంత్ కేసరి" సినిమాను తమిళంలో హీరో విజయ్ తో రీమేక్ చేయాలని ఆఫర్ వచ్చినప్పుడు, అనిల్ "నేను రీమేక్‌లు చేయను" అంటూ ఆ ఆఫర్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో "సంక్రాంతికి వస్తున్నాం" హిందీ వెర్షన్‌ను ఆయనే డైరెక్ట్ చేస్తారా, లేక రీమేక్ రైట్స్‌ను దిల్ రాజు వేరే డైరెక్టర్‌కు అప్పగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
దిల్ రాజు భారీ ప్లాన్
ఇక మరోవైపు దిల్ రాజు మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఈసారి దర్శకుడు వంశీ పైడిపల్లి కాగా, హీరో ఆమీర్ ఖాన్ ఉండే ఛాన్స్ ఉన్నట్టు టాక్. ఇప్పటికే ఆ కథను ఆమీర్‌కు వినిపించగా, ఆయన నిర్ణయాన్ని దిల్ రాజు ఎదురు చూస్తున్నట్టు సమాచారం. మొత్తానికి, అనిల్ రావిపూడి బాలీవుడ్ ఎంట్రీపై స్పష్టత రావాల్సి ఉంది. కానీ "సంక్రాంతికి వస్తున్నాం" రీమేక్ హిందీలో త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి.