- Home
- Entertainment
- నక్సలైట్ అవుదామనుకుని.. హీరోగా, జనసేనానిగా... పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
నక్సలైట్ అవుదామనుకుని.. హీరోగా, జనసేనానిగా... పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరులో పవర్ ఉంది. ఆ పేరుకు ఒక ఇమేజ్ ఉంది. హీరోగా, నాయకుడిగా కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చినా.. ఆయనకంటూ.. ఓ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్టార్ హీరో.. ప్రస్తుతం నాయకుడిగా కూడా తన ప్రభావం చూపిస్తున్నారు. యూత్ ఐకాన్ గా మారిన పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా.. ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.

నక్సలైట్ అవుదామనుకున్న వ్యక్తి..నాయకుడయ్యాడు.. ఈమధ్యలో ఈ మధ్యలో అభిమానులు మెచ్చిన హీరో అయ్యాడు. తన సినిమాలతో కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. హీరో గా పవర్ స్టార్ అన్న బిరుదు సాధించుకుని అభిమానులు గుండెల్లో నిలిచిపోయాడు. అసలు జనాల కష్టాలు చూడలేక అడవుల్లో అన్నలా మారాలి అనుకున్న వ్యాక్తిని హీరో చేసింది ఎవరు..?
కొణిదెల వెంకట రావు, అంజలీ దేవికి అందరికంటే చివరగా పుట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన అసలు పేరు కళ్యాణ్ బాబు. కాని ఆంజనేయుడి మీద భక్తితో తన పేరుకు పవన్ ను ఆడ్ చేసుకుని పవన్ కళ్యాణ్ గా మారారు. సెప్టెంబర్ 2, 1971 న ఆయన జన్మించారు. బి.కామ్ డిగ్రీని అందుకున్నారు.
పవన్ కి చిన్నప్పటి నుంచి రకరకాల ఆలోచనలు ఉండేవి. ఒక సారి అది అవ్వాలి.. ఇది అవ్వాలి అని చాలా అనుకున్నారు. పట్టుదలతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఆయనకి మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రాణం. అందుకే కరాటే నేర్చుకోవడమే కాకుండా అందులో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. హీరోగా మారిన తర్వాత కూడా మార్షల్ ప్రాక్టీస్ మానలేదు. దీని బేస్ తోనే తమ్ముడు సినిమా చేసి.. సూపర్ సక్సెస్ సాధించారు పవన్.
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కు అసలు హీరోగా చేయడం ఇష్టం లేదు. ఆయన ఆలోచనలు వేరేగా ఉండేవి. సినిమాలమీద పెద్దగా ఆసక్తి లేదు. కాని తనను కొడుకులా చూసుకునే వదిన సురేఖ చెప్పడంతోనే అయిష్టంగానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. 1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ తో ఆయన తెరంగేట్రం జరిగింది.
ఇక తొలి ప్రేమ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కు ఆతరువాత సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది. వెంటనే వరుసగా తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకోవడంతో.. ఆయనకంటూ స్పెషల్ ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది. మెగా ఫ్యామిలీ హీరో నుంచి.. పవర్ స్టార్ గా ఎదిగాడు. పట్టుమని పది సినిమాలు పడకుండానే టాలీవుడ్ టాప్ హీరో అయ్యాడు.. 20 సినిమాల దగ్గరకు వచ్చే సరికి తిరుగులేని టాలీవుడ్ హీరోగా ఎదిగాడు పవర్ స్టార్.
వరుసగా జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది.. ఇలా మంచి మంచి సినిమాలతో తెలుగు యూవతపై చెరగని ముద్ర వేసుకున్నారు పవన్. తెలుగు యువతకు పవనిజం కొత్త మతమయ్యింది. సమాజం కోసం, దేశం కోసం పాటు పడే పవన్ అభిమానులు కలిసి ఈ గ్రూప్ ని సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అంతటా స్ప్రెడ్ చేస్తున్నారు.
చాలా తక్కువ సినిమాలతో టాలీవుడ్ టాప్ స్టార్ గా మారిన పవన్ కళ్యాణ్.. సౌత్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోగా ఎప్పుడో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. దేశంలో ఎక్కువమంది ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎవరు అని నిర్వహించిన ఓ సర్వేలో.. పవన్ కళ్యాణ్ 5వ స్థానంలో నిలిచారంటే ఆయన మ్యానియా ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది.
తన సినిమా వల్ల తనతో పాటు ఇండస్ట్రీ కూడా బాగుపడాలి అని చూసే వక్తి పవన్ కల్యాణ్. ఆయన వల్ల ఎవరైనా నష్ట పోతే అస్సలు ఒప్పుకోరు.. వారికి పవన్ అండగా ఉంటారు. ఇలానే తన సినిమాల జానీ, కొమురం పులి వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి చెల్లించారు. రెమ్యూనరేషన్ నుంచి తిరిగి వారికి చెల్లించి మంచి మనసు చాటుకున్నారు.
పవర్ స్టార్ చాలా సార్లు రియల్ హీరో అనిపించుకున్నారు. తన సాయం కోసం ఇండిస్ట్రీ నుంచి వచ్చే జూనియర్ ఆర్టిస్ట్ లను గౌరవించి.. మర్యాదలు చేసి.. వారికి కావల్సిన సాయం చేసి పంపిస్తారు. ఈవిషయం సాయం పొందిన పావలా శ్యామలా లాంటి వారు ఎన్నో సార్లు.. మీడియా ముఖంగా చెప్పారు. ఇక అలాగే వైజాక్ హుద్ హుద్ వల్ల బాధితులుగా మారిన వారికి 50 లక్షలు, చెన్నై వరద బాధితులకు రెండు కోట్లు సాయం చేశారు పవన్. ఇలా ఎన్నో గుప్త దానాలు పవర్ స్టార్ లిస్ట్ లో సీక్రేట్ గా ఉన్నాయి.
నక్సలైల్ గా ప్రజలకోసం పోరాడదాం అనుకున్న వ్యక్తి.. అది సాద్యపడకపోవడంతో.. రాజకీయ నేతగా మారి ప్రజలకు మరింత దగ్గర అయ్యారు. అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఎన్నో పర్యటనలు చేసి అనుభవం గడిండి.. ఆతరువాత కాలంలో జనసేన పార్టీని స్థాపించారు. ప్రజలకు మరింత సేవా కార్యక్రమాలు చేయవచ్చని భావించి పవన్ కళ్యాణ్ మార్చి 14, 2014 న జనసేన పార్టీ స్థాపించారు. ఈ పార్టీ కోసం పనిచేయడానికి లక్షల మంది జనసైనికులు పవన్ వెంట నడుస్తున్నారు.
ఇక పవన్ కల్యాణ్ గరించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన మల్టీ టాలెంటెడ్. హీరోగానే కాకుండా కథా రచయితగా, సింగర్ గా, స్టంట్ మాస్టర్ గా, డైరెక్టర్ గా.. ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ చూపించి ఆడియన్స్ ను మెప్పించారు. ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించారు.
ఇక సినిమాలు, రాజకీయాలను రెండింటినీ బ్యాలన్స్ చేసుకుంటూ.. బిజీ లైఫ్ ను లీడ్ చేస్తున్న పవర్ స్టార్ కు వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే టైమ్ దొరికితే చాలు ఆయన ఫామ్ హౌస్ కు వెళ్ళి కూరగాయలు , ఆకుకూరలు పండిస్తారు. ప్రశాంతమైన జీవితాన్ని గడపడం కోసం ఆయన ఇక్కడ టైమ్ స్పెండ్ చేస్తారు.