- Home
- Entertainment
- పవన్, బన్నీ అనుకోకుండా ఇలా, రెండు సార్లు రిపీట్.. మామా అల్లుళ్ళ మధ్య సింక్ భలే కుదిరిందే..
పవన్, బన్నీ అనుకోకుండా ఇలా, రెండు సార్లు రిపీట్.. మామా అల్లుళ్ళ మధ్య సింక్ భలే కుదిరిందే..
ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ సొంతంగా ఒక వాహనం రెడీ చేయించుకున్నారు. ఈ వాహనం పేరు 'వారాహి'.. ఎన్నికల యుద్ధం కోసం సిద్ధం అయింది అంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏం చేసినా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఆ మధ్యన పవన్ వైజాగ్ పర్యటన, ఇప్పటం గ్రామం పర్యటన ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో అందరికీ తెలిసిందే. ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ సొంతంగా ఒక వాహనం రెడీ చేయించుకున్నారు.
ఈ వాహనం పేరు 'వారాహి'.. ఎన్నికల యుద్ధం కోసం సిద్ధం అయింది అంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో వారాహి వాహనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వాహనం రంగు, డిజైన్ ఏపీలో వివాదంగా మారింది. అయితే ఈ వాహనం రిజిస్ట్రేషన్ పనులు తెలంగాణాలో పూర్తయ్యాయి. తెలంగాణ ఆర్టీవో అధికారులు ఈ వాహనానికి 'TS 13 EX 8384' అనే నంబర్ కేటాయించారు.
వారాహి నంబర్ తెలియగానే నెటిజన్లు పవన్, బన్నీ మధ్య బంధం అంటూ మామా అల్లుళ్ళపై పోస్ట్ లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. ఇదేంటి అనుకుంటున్నారా.. అయితే వివరాల్లోకి వెళదాం. పవన్ కళ్యాణ్ వారాహి వాహనం నంబర్ 8384.. ఇదే నంబర్ ని అల్లు అర్జున్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప చిత్రంలో కూడా ఉంటుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ సీక్రెట్ మెసేజ్ ల కోసం ఉపయోగించే పేజర్ పరికరం నంబర్ కూడా అదే.
మామా అల్లుళ్ళ బంధం ఇక్కడితో ఆగిపోలేదు. గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఉపయోగించిన జీప్ నంబర్ 2425. ఇదే నంబర్ ని అల్లు అర్జున్ తన డీజే చిత్రంలో స్కూటర్ కోసం ఉపయోగించారు. ఈ రకంగా మామా అల్లుళ్ళ మధ్య సింక్ భలే కుదిరింది అంటూ నెటిజన్లు పోస్ట్ లతో మోతెక్కిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని ఎన్నికల ప్రచార రథంగా ఉపయోగించనున్నారు. అయితే ఈ వాహనానికి పవన్ కళ్యాణ్ ఆర్మీ వాళ్ళు ఉపయోగించే ఆలివ్ గ్రీన్ ని నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించారని వైసిపి నాయకులు ఆరోపించారు. అయితే తెలంగాణ ఆర్టీవో అధికారులు క్లారిటీ ఇస్తూ.. ఐడి ఆలివ్ గ్రీన్ కాదని.. ఏమిరాల్డ్ గ్రీన్ అని తెలిపారు. అందుకే వాహనానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలతో బిజీ కానున్నారు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు మూవీ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రం తర్వాత సుజీత్, హరీష్ శంకర్ లతో వరుసగా పవర్ స్టార్ చిత్రాలు చేయాల్సి ఉంది.