ఏఎన్నార్ నుంచి రాంచరణ్ వరకు.. టాలీవుడ్ అల్టిమేట్ రికార్డ్స్.. వీటిని టచ్ చేయడం అసాధ్యం

First Published 20, Nov 2019, 10:05 AM IST

తెలుగు సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా రికార్డ్స్ నమోదయ్యాయి. వాటిలో కొన్ని రికార్డులు బ్రేక్ అయ్యాయి కూడా.

తెలుగు సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా రికార్డ్స్ నమోదయ్యాయి. వాటిలో కొన్ని రికార్డులు బ్రేక్ అయ్యాయి కూడా. కానీ ఏఎన్నార్, మహేష్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి హీరోలు సెట్ చేసిన కొన్ని రికార్డులు ఇక బ్రేక్ కావడం అసాధ్యం అంటే అతిశయోక్తి కాదు. మరి కొందరు స్టార్ హీరోలు కూడా తిరుగులేని రికార్డులు నెలకొల్పారు.

హీరోగా అత్యధిక చిత్రాలు: ఇప్పటి హీరోలు తమ కెరీర్ మొత్తం 50 సినిమాలు పూర్తి చేస్తే గొప్ప విషయం. కానీ సూపర్ స్టార్ కృష్ణ మాత్రం ఇక భవిష్యత్తులో ఎవరికీ సాధ్యం కానీ రికార్డ్ సృష్టించారు. కృష్ణ కథానాయకుడిగా 325 చిత్రాల్లో నటించారు. హీరోగా అత్యధిక చిత్రాల్లో నటించిన ఘనత ఆయనదే.

అత్యధిక 100 రోజుల చిత్రాలు: ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడితే సంబరాలు జరిగేవి. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు నటించిన అనేక చిత్రాలు 100 రోజులు ఆడాయి. ఏఎన్నార్ నెలకొల్పిన ఈ రికార్డ్ ని మాత్రం మరో హీరోకి కలలో కూడా అసాధ్యం. ఏఎన్నార్ నటించిన 114 చిత్రాలు 100 రోజులు ప్రదర్శించబడ్డాయి.

ట్రెండ్ సెట్టర్: టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ అనగానే మొదట గుర్తుకు వచ్చేది నాగార్జున నటించిన శివ చిత్రం. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్ సినిమా మేకింగ్ విధానాన్నే మార్చేసింది.

అత్యధిక ఇండస్ట్రీ హిట్స్: తెలుగు చలనచిత్ర రంగంలో రారాజుగా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి పేరిట ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. కానీ అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ సాధించిన ఏకైక హీరో చిరంజీవి. చిరు పేరిట 7 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఈ రికార్డు కూడా బ్రేక్ కావడం అసాధ్యమే.

వరుసగా ఇండస్ట్రీ హిట్స్ : మెగాస్టార్ పేరిట నమోదైన మరో రికార్డ్ ని కూడా ఇతరులు చేరుకోవడం అసాధ్యం. 1987-92 మధ్య కాలంలో వరుసగా ఆరు సంవత్సరాలు 6 ఇండస్ట్రీ హిట్స్ చిరంజీవి పేరిట నమోదయ్యాయి. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.

ఒకే రోజు విడుదలై 100 రోజులు: 1993 సెప్టెంబర్ 3న ఒకే రోజు బాలకృష్ణ నటించిన నిప్పు రవ్వ, బంగారు బుల్లోడు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు 100 రోజులు ప్రదర్శించడం విశేషం.

సింగిల్ థియేటర్ లో: సూపర్ స్టార్ మహేష్ బాబు పేరిట అరుదైన రికార్డ్ నమోదైంది. మహేష్ నటించిన నాలుగు చిత్రాలు సింగిల్ థియేటర్ లో రూ. కోటికి పైగా గ్రాస్ వసూలు చేశాయి. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి చిత్రాలు ఆ ఘనత సాధించాయి. ప్రస్తుతం థియేటర్స్, స్క్రీన్స్ సంఖ్య పెరిగింది కాబట్టి మహేష్ సాధించిన ఈ రికార్డుని అందుకోవడం కూడా అసాధ్యమే.

అత్యధిక సెంటర్స్ లో 175: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి చిత్రం ఏకంగా 52 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడింది. ఇది అల్టిమేట్ రికార్డ్.

మగధీర: మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన మగధీర చిత్రం ఏకంగా 223 సెంటర్స్ లో 100 రోజులు ప్రదర్శించబడింది. ఈ రికార్డుని అందుకోవడం ఇక అసాధ్యమే.

బాహుబలి: ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ని పెంచిన మూవీగా చరిత్రలో నిలిచిపోయింది.

loader