- Home
- Entertainment
- Bigg Boss Telugu: బిగ్ బాస్ 6 లో యాంకర్ ఉదయభాను? ఊహించని రెమ్యూనరేషన్, ఇక షోలో రచ్చ రచ్చే!
Bigg Boss Telugu: బిగ్ బాస్ 6 లో యాంకర్ ఉదయభాను? ఊహించని రెమ్యూనరేషన్, ఇక షోలో రచ్చ రచ్చే!
బిగ్ బాస్ 6 కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ గా కొన్ని క్రేజీ నేమ్స్ తెరపైకి వస్తున్నాయి. మాజీ స్టార్ యాంకర్ ఉదయభాను లేటెస్ట్ సీజన్లో సందడి చేయడం ఖాయమంటూ కథనాలు వెలువడుతున్నాయి.

Udayabhanu
బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Telugu 6)త్వరలో ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా ఈ మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో స్టార్ మాలో రానుంది. ఇప్పటికే కొందరు కంటెస్టెంట్స్ ఎంపిక జరిగింది. ఎంపికైన కంటెస్టెంట్స్ ని షో మొదలు కావడానికి ముందు రెండు వారాలు పాటు క్వారంటైన్ లో ఉంచుతారు. కరోనా వైరల్ కారణంగా గత రెండు సీజన్స్ నుండి నిర్వాహకులు ఈ ప్రక్రియ అవలంబిస్తున్నారు.
ఈ కరోనా పరిస్థితుల కారణంగానే పేరున్న సెలెబ్రిటీలు షోలో పాల్గొనడానికి ఇష్టపడడం లేదు. బిగ్ బాస్ సీజన్ 4, 5లలో చాలా వరకు కొత్త ముఖాలే కంటెస్టెంట్స్ గా హౌస్ కి వెళ్లడం జరిగింది. ఈసారి కొంచెం గ్రాండ్ గా ప్లాన్ చేయాలనేది నిర్వాహకుల ఆలోచనగా తెలుస్తుంది. ఈ క్రమంలో బుల్లితెర, వెండితెరకు చెందిన పాప్యులర్ నటులు, యాంకర్స్ ని షో కోసం సంప్రదిస్తున్నారట.
కాగా యాంకర్ ఉదయభాను(Udaya Bhanu) పేరు వాళ్ళ టాప్ ప్రయారిటీ లిస్ట్ లో ఉందట. యాంకర్ ఉదయభాను కోసం బిగ్ బాస్ టీమ్ సంప్రదింపులు మొదలుపెట్టారట. గతంలోనే ఉదయభాను బిగ్ బాస్ షోలో పాల్గొనాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో ఉదయభాను షో పట్ల ఆసక్తి చూపలేదు. ఈసారి ఎలాగైనా పట్టుబట్టి ఆమెను ఆటలో దించాలని చూస్తున్నారట.
udayabhanu
దీని కోసం ఆమెకు భారీగా పారితోషికం ఆఫర్ చేస్తున్నారట. మేకర్స్ ప్రయత్నాలు ఫలిస్తే బిగ్ బాస్ 6 లో ఉదయభాను పాల్గొనడం ఖాయమే అంటున్నారు. ఇదే జరిగితే షోకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఉదయభాను షోలో ఉండడం ద్వారా మంచి టీఆర్పీ దక్కే అవకాశం కలదు.
ఇక ఉదయభాను కెరీర్ గురించి చెప్పాలంటే ఒకప్పుడు ఆమె తెలుగులో టాప్ యాంకర్. సుమ సైతం ఆమె తర్వాతే. ఉదయభాను యాంకర్ గా ఉన్న అనేక షోస్ టీఆర్పీలో దూసుకుపోయాయి. బుల్లితెరపై వచ్చిన ఇమేజ్ తో ఉదయభాను హీరోయిన్ గా కూడా మారారు. లీడర్, జులాయి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ లో ఉదయభాను కనువిందు చేశారు.
ఉదయభాను జీవితంలో కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. ఆ కారణంగా ఆమె కొన్నాళ్ళు బుల్లితెరకు దూరమయ్యారు. ఉదయభాను రేసు నుండి తప్పుకున్నాక సుమకు ఎదురులేకుండా పోయింది. ఆమె ప్లేస్ సొంతం చేసుకుని టాప్ యాంకర్ గా ఎదిగారు. వివాహం తర్వాత ఆమె కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు.