- Home
- Entertainment
- Uday Kiran : ‘ఉదయ్ కిరణ్ మరణించిన ఇన్నేళ్లకు ఆ సమయం వచ్చింది’.. అక్క శ్రీదేవి ఆసక్తికర వ్యాఖ్యలు
Uday Kiran : ‘ఉదయ్ కిరణ్ మరణించిన ఇన్నేళ్లకు ఆ సమయం వచ్చింది’.. అక్క శ్రీదేవి ఆసక్తికర వ్యాఖ్యలు
దివంగత, టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ (Uday Kiran) ను గుర్తుచేసుకుంటూ ఆయన సోదరి శ్రీదేవి ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. ఆ సందర్భం గురించి మాట్లాడుతూ భావోద్వేగమైంది.

టాలీవుడ్ లవర్ బాయ్, దివంగత ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పదేళ్ల కిందనే యుక్తవయస్సులో మరణించినా ఇప్పటికీ ఆయన అభిమానులు గుర్తుచేసుకుంటూనే ఉంటున్నారు.
ఉదయ్ కిరణ్ 33 ఏళ్ల వయస్సులోనే మరణించారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆయన ఇంట్లో తనువు చాలించిన విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదలడం అప్పట్లో ఓ సంచనలంగా మారింది.
ఇదిలా ఉంటే.. ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి తాజాగా తమ్ముడిని తలుచుకుంటూ భావోద్వేగం అయ్యారు. అందుకు ఓ సందర్భంగా కూడా ఉంది. ఉదయ్ నటించిన ‘నువ్వు నేను’ బ్లాక్ బాస్టర్ మూవీ మళ్లీ రీరిలీజ్ కాబోతుండటం విశేషం.
ఈ సందర్బంగా అక్క శ్రీదేవి మాట్లాడుతూ.. ‘నువ్వు నేను’ సినిమా చాలా స్పెషల్. ఈ సినిమా మార్చి 21న రీరిలీజ్ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది.
ఎందుకంటే.. ఈ సినిమాతోనే ఉదయ్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఇది తనకి గొప్ప అవకాశం. మళ్లీ ఈసినిమా తెరపైకి వచ్చే సమయం రావడం సంతోషంగా ఉంది. అలాగే మన టాలీవుడ్ నటులకు ఈ సినిమా నివాళి ఇచ్చే సమయం కూడా వచ్చింది.
ఎంఎస్ నారాయణ, రాళ్లపల్లి, ధర్మవరం సుబ్రహ్మణ్యం, ప్రసాద్, వైజాగ్ ప్రసాద్, తెలంగాణ శంకుతలకు సినిమా తెరపై ప్రదర్శించి మరోసారి నివాళి అర్పించే అవకాశం వచ్చిందన్నారు. ఇలాంటి సినిమాను అందించిన ఆ మూవీ యూనిట్ కు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇక మార్చి 21న ఈ చిత్రం రీరిలీజ్ కాబోతోంది.