- Home
- Entertainment
- Uday Kiran: ఉదయ్ కిరణ్ `చిత్రం` మూవీని మిస్ చేసుకున్న క్రేజీ హీరో ఎవరో తెలుసా? ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు
Uday Kiran: ఉదయ్ కిరణ్ `చిత్రం` మూవీని మిస్ చేసుకున్న క్రేజీ హీరో ఎవరో తెలుసా? ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు
Uday Kiran: ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయం అయిన `చిత్రం` మూవీని ఓ క్రేజీ హీరో మిస్ చేసుకున్నారు. ఉదయ్ కిరణ్‌కి లైఫ్ ఇచ్చాడు. కానీ ఆ హీరో ఇప్పుడు లేకుండా పోయాడు.

`చిత్రం` సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయిన ఉదయ్ కిరణ్
లవర్ బాయ్‌గా టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేశాడు ఉదయ్ కిరణ్. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని ఇండస్ట్రీలో యంగ్ సెన్సేషన్‌గా మారాడు. అప్పట్లో ఉదయ్ కిరణ్‌కి ఉన్న క్రేజ్ మామూలు కాదు. యూత్‌లో, ముఖ్యంగా అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. వరుసగా ప్రేమ కథా చిత్రాలే చేయడం అందుకు కారణమని చెప్పొచ్చు. ఆయా మూవీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో బిగ్ స్టార్ అయిపోయాడు ఉదయ్ కిరణ్. `చిత్రం`, `నువ్వు నేను`, `మనసంతా నువ్వే`, `కలుసుకోవాలని` చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న పవన్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ కూడా ఉదయ్ కిరణ్ దెబ్బకి కంగారు పడ్డ పరిస్థితి నెలకొంది.
ఉదయ్ కిరణ్ లైఫ్‌ని తలక్రిందులు చేసిన మిస్టేక్స్
అయితే ఆ తర్వాత కొన్ని తప్పిదాలు, పరాజయాలు ఉదయ్ కిరణ్ లైఫ్‌ని తలక్రిందులు చేశాయి. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు తలెత్తడం, అదే సమయంలో సినిమాలు ఆడకపోవడంతో ఉదయ్ కిరణ్ డిస్టర్బ్ అయ్యాడు. అయినా కూల్‌గా తన కెరీర్‌ని బిల్డ్ చేసుకోవాలని ప్రయత్నించినా కొందరు సినిమాలు చేస్తామని చెప్పి హ్యాండివ్వడం, వచ్చినట్టే వచ్చి కొన్ని ఆఫర్లు బ్యాక్ కావడం, నిర్మాతలు డ్రాప్ కావడం వంటి కారణాలతో ఉదయ్ కిరణ్ కోలుకోలేకపోయారు. మానసికంగా చాలా కృంగిపోయారు. చివరికి బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కోసం ఉదయ్ కిరణ్‌ని పక్కన పెట్టిన తేజ
ఉదయ్ కిరణ్ `చిత్రం` మూవీతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. దీనికి దర్శకుడు తేజ. ఆయనకు ఇదే తొలి చిత్రం. కొత్తవాళ్లతోనే ఈ సినిమా తీయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా వందల మందిని ఆడిషన్ చేస్తే ఉదయ్ కిరణ్ దొరికాడు. ఆయనతో ఈ మూవీ చేశాడు. అయితే ఉదయ్ కిరణ్‌ని హీరోగా అనుకున్నాక సడెన్‌గా మార్పులు చేయాల్సి వచ్చింది. ఇండస్ట్రీలోని ప్రముఖ వ్యక్తి.. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు, చాలా సినిమాలు చేశాడు, మంచి క్రేజ్ ఉంటుంది, అతన్ని పెట్టుకో అన్నారట. ఆ తర్వాత ఆ కుర్రాడిని తీసుకుని వాళ్లమ్మ వచ్చింది. కుర్రాడు బాగానే ఉన్నాడు, సెట్ అవుతాడని తేజ అనుకున్నారు. కానీ రెమ్యూనరేషన్ ఐదు లక్షలు అడిగారట. తన హీరో బడ్జెట్ పదివేలు మాత్రమే అన్నాడట తేజ. దీంతో వాళ్ల అమ్మ డ్రాప్ అయ్యింది. ఆ యంగ్ హీరో `చిత్రం` సినిమా ఆఫర్‌ని కోల్పోయాడు.
ఆ కుర్రాడు ఓకే చేస్తే ఉదయ్ కిరణ్‌ని మనం చూసేవాళ్లమా?
అనంతరం ఉదయ్ కిరణ్‌నే హీరోగా ఫైనల్ చేశారు తేజ. హీరోయిన్‌గా రీమాసేన్‌ని ఎంపిక చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు. 2000లో జూన్ 16న విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కి గురి చేసింది. ఇలా కూడా సినిమా తీస్తారా అని అంతా ఆశ్చర్యపోయారు. ఈ క్రేజీ లవ్ స్టోరీకి అంతా ఫిదా అయ్యారు. యూత్ అయితే ఇరగబడి చూశారు. ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. చిరంజీవిపై అభిమానంతో ఇండస్ట్రీలోకి ఒక అనామక కుర్రాడిగా వచ్చి ఏకంగా `చిత్రం` చిత్రంతో స్టార్ అయిపోయాడు ఉదయ్ కిరణ్. ఆ తర్వాత ఆయన జీవితమే మారిపోయింది. ఒక వేళ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఈ మూవీ చేసి ఉంటే ఉదయ్ కిరణ్ ని మనం చూసేవాళ్లమా? అనేది పెద్ద సస్పెన్స్.
`చిత్రం`ని మిస్ చేసుకున్న హీరో తరుణ్?
అయితే `చిత్రం` మూవీని వదులుకున్న కుర్రాడు ఎవరో కాదు తరుణ్ అని సమాచారం. దర్శకుడు తేజ ఈ విషయాన్ని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో తెలిపారు. అయితే ఆ సమయంలో తరుణ్ పేరుని చెప్పలేదు తేజ. ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన కుర్రాడు, అతనికి మంచి పాపులారిటీ ఉందని తెలిపారు. వాళ్లమ్మ నటి, ఆయన్ని అమ్మనే డీల్ చేస్తుందన్నారు. అప్పట్లో ఇలా ఉన్నది కేవలం తరుణ్ మాత్రమే. కాబట్టి ఆయనే అని అంతా కన్ఫమ్ చేస్తున్నారు. మొత్తంగా వాళ్ల అమ్మ కారణంగా తరుణ్ `చిత్రం` మూవీని మిస్ చేసుకున్నారు. అయితే అదే ఏడాది తరుణ్ `నువ్వే కావాలి` చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఇది కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తరుణ్ కూడా ఉదయ్ కిరణ్ తరహాలోనే ప్రారంభంలో వరుసగా లవ్ స్టోరీస్ చేసి లవర్ బాయ్‌గా ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వరుస పరాజయాలను ఫేస్ చేశాడు. ఇప్పుడు సినిమాలు మానేసి బిజినెస్ చూసుకుంటున్నారు. త్వరలో ఆయన రీఎంట్రీ ఉంటుందని సమాచారం. ఇదే మాట చాలా రోజులుగా వినిపిస్తుంది. కానీ ఎలాంటి అప్ డేట్ లేదు. మరి తరుణ్ రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.