MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Funky Teaser: అనుదీప్‌ మామూలోడు కాదు, విశ్వక్‌ సేన్‌నే తన దారికి తెచ్చుకున్నాడు.. ఫంకీ టీజర్‌ ఎలా ఉందంటే?

Funky Teaser: అనుదీప్‌ మామూలోడు కాదు, విశ్వక్‌ సేన్‌నే తన దారికి తెచ్చుకున్నాడు.. ఫంకీ టీజర్‌ ఎలా ఉందంటే?

దర్శకుడు అనుదీప్‌ ప్రస్తుతం విశ్వక్‌ సేన్‌ హీరోగా `ఫంకీ` మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. ఇందులో చూస్తుంటే విశ్వక్‌ సేన్‌ని అనుదీప్‌ బాగా సానాబెట్టాడనిపిస్తోంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 11 2025, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
`ఫంకీ` మూవీ టీజర్‌
Image Credit : Asianet News

`ఫంకీ` మూవీ టీజర్‌

దర్శకుడు అనుదీప్‌ `జాతిరత్నాలు` మూవీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. టాలీవుడ్‌లో ఒక విభిన్నమైన కామెడీ సినిమాని రూపొందించి ఆకట్టుకున్నాడు. డైలాగ్‌ లతో కామెడీని పండించి, హిట్ కొట్టాడు. అంతేకాదు ఇప్పుడు వస్తోన్న అనేక కామెడీ చిత్రాలకు `జాతిరత్నాలు` మూవీని ఆదర్శంగా నిలిపారు. అయితే మధ్యలో తన పంథాని దాటి `ప్రిన్స్` చిత్రంతో కొత్తగా ప్రయత్నించాడు. కానీ ఆ మూవీ ఆడలేదు. అనుదీప్‌కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో ఇప్పుడు కొంత గ్యాప్‌తో తన స్టయిల్‌ కామెడీ మూవీతో వస్తున్నారు. తాజాగా అనుదీప్‌ `ఫంకీ` అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించడం విశేషం. కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్ర టీజర్‌ తాజాగా శనివారం విడుదలైంది. ఇది ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.

24
విశ్వక్‌ సేన్‌ని తన దారికి తెచ్చుకున్న అనుదీప్‌
Image Credit : Asianet News

విశ్వక్‌ సేన్‌ని తన దారికి తెచ్చుకున్న అనుదీప్‌

అయితే సాధారణంగా విశ్వక్‌ సేన్‌ మూవీ అంటే మాస్‌, యాక్షన్‌తో ఉంటుంది. భారీ డైలాగ్‌లుంటాయి. మాస్‌ కా దాస్‌ మార్క్ యాటిట్యూడ్‌ ఉంటుంది. కానీ ఇందులో అవేవీ కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే విశ్వక్‌ సేన్‌ని అనుదీప్‌ తన దారికి తెచ్చుకున్నాడనిపిస్తోంది. తన మార్క్ కామెడీ స్టయిల్‌కి విశ్వక్‌ని మౌల్డ్ చేశాడు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు. తాజాగా విడుదలైన టీజర్‌లో విశ్వక్‌ సేన్‌ తన మార్క్ బాడీ లాంగ్వేజ్‌ని ప్రజెంట్‌ చేస్తూనే అందులో ఓవర్ బోర్డ్ పోకుండా దాన్ని కామెడీగా మలచడం విశేషం. అనుదీప్‌ మార్క్ పంచ్‌ డైలాగ్‌ల కామెడీకి, విశ్వక్‌ సేన్‌ డైలాగ్‌ డెలివరీ, యాటిట్యూడ్‌ తోడు కావడంతో `ఫంకీ` టీజర్‌ ఆద్యంతం నవ్వులు పూయించింది.

Related Articles

Related image1
Niharika NM: మహేష్‌ బాబు, టామ్‌ క్రూజ్‌.. ఇద్దరితో ఒకేసారి ఛాన్స్.. నిహారిక రొమాన్స్ ఆయనతోనే
Related image2
Heroes 50th Movie: చిరు, బాలయ్య, నాగ్‌, వెంకీ 50వ సినిమా హిట్టా ఫట్టా.. మెగాస్టార్‌, మన్మథుడికి చేదు అనుభవం
34
పంచ్‌ డైలాగ్‌లతో ఆద్యంతం కామెడీగా `ఫంకీ`టీజర్‌
Image Credit : Asianet News

పంచ్‌ డైలాగ్‌లతో ఆద్యంతం కామెడీగా `ఫంకీ`టీజర్‌

ఇందులో విశ్వక్‌ సేన్‌ ఫిల్మ్ డైరెక్టర్‌గా కనిపిస్తున్నాడు. ఓ స్కూల్‌ ఈవెంట్‌లో విశ్వక్‌ మాట్లాడుతూ, ఈ స్కూల్‌లో చదువుకోవడం వల్లే ఫెయిల్‌ అయ్యానని, బాగా చదువుకోకపోవడం వల్లే సినిమాల్లోకి వెళ్లానని, డైరెక్టర్‌ అయ్యానని చెప్పడం అందరికి షాకిస్తుంది. నవ్వులు పూయిస్తుంది. అంతేకాదు కాలేజీలో ఎవరినైనా లవ్‌ చేశార్రా అని విశ్వక్‌ అడగ్గా, తన అసిస్టెంట్‌లో ఒకరు `కావ్యని లవ్‌ చేశాన`ని చెప్పాడు. మరో అసిస్టెంట్‌ `అమ్మని లవ్‌ చేస్తున్నా` అని చెప్పగా, విశ్వక్‌.. `కావ్య వాళ్ల అమ్మని ప్రేమిస్తున్నావా` అని పంచ్‌ వేయడం దిమ్మతిరిగిపోయింది. ఇలా టీజర్‌ మొత్తం వరుసగా పంచ్‌ డైలాగ్‌లతో సాగింది. అక్క, బావకి సంబంధించిన కామెడీ కూడా అదిరిపోయింది. చివర్లో ఓ యాక్షన్‌ సీన్‌ చూపించి, `అరేయ్‌ నేను ఇక్కడ లేనంత వరకేరా ఇక్కడ లేను. ఒక్కసారి వచ్చానంటే నేను ఇక్కడే ఉన్నట్టు` అని విశ్వక్‌ చెప్పడం క్రేజీగా ఉంది. ఇలా ఆద్యంతం పంచ్‌ డైలాగ్‌లో సాగే ఈ టీజర్‌ నవ్వులు పూయించింది. అనుదీప్‌ ఈజ్‌ బ్యాక్‌ అనిపించింది. ఓ రకంగా అనుదీప్‌ తనలోని మరో వెర్షన్‌ చూపించబోతున్నాడని చెప్పొచ్చు.

44
`ఫంకీ` కాస్ట్ అండ్‌ క్రూ వీరే
Image Credit : Asianet News

`ఫంకీ` కాస్ట్ అండ్‌ క్రూ వీరే

అనుదీప్‌ దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌, కయాదు లోహర్‌ జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో నరేష్‌, ఈశ్వరీ రావు, సంపత్‌ రాజ్‌, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరంతా ఉండటంతో సినిమా నవ్వుల సునామీలా ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుందని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దీప‌ అనాథ కాదన్న దశరథ-షాక్ అయిన జ్యో-దశరథ ఎమోషనల్-జ్యో డౌట్ క్లియర్?
Recommended image2
ఆకలి తీర్చినందుకే ఆ డైరెక్టర్ నన్ను హీరో చేశాడు.. రూ. 3 కోట్లతో సినిమా తీశాడు..
Recommended image3
రష్మిక మందన్న కు విజయ్ దేవరకొండ తల్లి పెట్టిన కండీషన్లు ఏంటో తెలుసా? కోడలి క్వాలిఫికేషన్స్ ఏంటంటే?
Related Stories
Recommended image1
Niharika NM: మహేష్‌ బాబు, టామ్‌ క్రూజ్‌.. ఇద్దరితో ఒకేసారి ఛాన్స్.. నిహారిక రొమాన్స్ ఆయనతోనే
Recommended image2
Heroes 50th Movie: చిరు, బాలయ్య, నాగ్‌, వెంకీ 50వ సినిమా హిట్టా ఫట్టా.. మెగాస్టార్‌, మన్మథుడికి చేదు అనుభవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved