MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • TV
  • బిగ్‌ బాస్‌ తెలుగు 8 కంటెస్టెంట్లలో పారితోషికం ఎవరికి ఎక్కువిస్తున్నారో తెలుసా? ఆ ఇద్దరు ఎందుకు స్పెషల్‌?

బిగ్‌ బాస్‌ తెలుగు 8 కంటెస్టెంట్లలో పారితోషికం ఎవరికి ఎక్కువిస్తున్నారో తెలుసా? ఆ ఇద్దరు ఎందుకు స్పెషల్‌?

బిగ్‌ బాస్‌ తెలుగు 8లో కంటెస్టెంట్లకి సంబంధించిన పారితోషికం వివరాలు లీక్‌ అయ్యాయి. ముఖ్యంగా ఆ ఇద్దరు కంటెస్టెంట్లకి మాత్రం గట్టిగానే ఇస్తున్నారట. వాళ్లెవరు?

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Oct 06 2024, 06:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌  విజయవంతంగా ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే హౌజ్‌ నుంచి ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అయ్యారు. నేడు మరో కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ కాబోతున్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఆదివారం నైనిక హౌజ్‌ని వీడుతున్నట్టు సమాచారం. అదే సమయంలో ఈ ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ ఉండబోతున్నాయి. ఎనిమిది మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంద కంటెస్టెంట్లు ఉండగా, వీరికి మరో ఎనిమిది మంది తోడు కాబోతున్నారు. 16 మందితో మళ్లీ హౌజ్‌ కళకళలాడబోతుందని చెప్పొచ్చు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే ప్రస్తుతం మాత్రం హౌజ్‌లో నిఖిల్‌, విష్ణుప్రియా, యష్మి, ప్రేరణ, నాగమణికంఠ, నబీల్‌, కిర్రాక్‌ సీత, పృథ్వీరాజ్‌ కంటెస్టెంట్లుగా ఉన్నారు. మరి వీరి పారితోషికాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు లీక అయ్యాయి. ఇప్పుడున్న వారిలో ఎవరికి ఎక్కువ పారితోషికాలు ఇస్తున్నారనేది తెలిసింది. ముఖ్యంగా ఇద్దరు కంటెస్టెంట్లకి మాత్రం గట్టిగానే పారితోషికం ఇస్తున్నారట. మరి ఆ ఇద్దరు ఎవరు అనేది చూస్తే,
 

35

బిగ్‌ బాస్‌ తెలుగు 8 లో పారితోషికం రోజు వారి లెక్క ప్రకారం ఉంటుంది. తక్కువలో తక్కువ రోజుకి పదిహేను వేల వరకు ఇస్తారు. వారం లెక్కన కౌంట్‌ ఉంటుంది. ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలకు కలిపి రెమ్యూనరేషన్‌ ఇస్తారు. ప్రస్తుతం ఉన్న వారిలో తక్కువగా నాగమణికంఠకి, నబీల్‌లకు ఇస్తున్నారని తెలుస్తుంది. ఆ తర్వాత కిర్రాక్‌ సీత, పృథ్వీరాజ్‌లకు యావరేజ్‌గా ఉందని, ప్రేరణ, యష్మిలకు బాగానే ఉందని, కానీ నిఖిల్‌, విష్ణు ప్రియాలకు గట్టిగానే ఇస్తున్నారట. చాలా డిమాండ్‌ మేరకు వీళ్లు బిగ్‌ బాస్‌ షోకి వచ్చినట్టు తెలుస్తుంది. 
 

45

నాగమణికంఠ, నబీల్‌లు సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు. వీరికి రోజుకి ఇరవై వేలలోపే ఉంటుందట. అలాగే కిర్రాక్‌ సీత, పృథ్వీరాజ్‌లకు ఇరవై ఐదు వేల వరకు ఉంటుందని, యష్మి, ప్రేరణ టీవీ ఆర్టిస్టులు. వీరికి రోజుకి సుమారు 35 వరకు ఇస్తారని తెలుస్తుంది. వీరికి తక్కువ పేమెంట్స్ ఉంటున్నాయని సమాచారం. బుల్లితెరపై సందడి చేస్తున్న వీరికి ఉన్నంతలో బెటర్‌గానే పారితోషికం అందుతుందని తెలుస్తుంది. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు కూడా రోజుకి ముప్పై వేల వరకు అందుకున్న కంటెస్టెంట్లే కావడం విశేషం. 
 

55

అయితే హౌజ్‌లో నిఖిల్‌, విష్ణుప్రియా మాత్రం స్పెషల్‌గా నిలుస్తున్నారు. వీరికి ఒక్కో రోజుకి యాభై వేలవరకు పారితోషికం తీసుకుంటున్నారట. విష్ణు ప్రియా గత సీజన్‌లోనే బిగ్‌ బాస్ కి రావాలని నిర్వాహకులు అడిగారు. తనకు రోజుకి 70వేలు ఇస్తే వస్తా అని చెప్పింది. దీంతో సైలైంట్‌ అయ్యారు. ఈ సారి మరోసారి ఆమెని అప్రోచ్‌ అయ్యారని, అయితే ఈ సారి దిగొచ్చిందట. తనకు పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో ఎంతో కొంతకి ఓకే చెప్పిందట. ఈ క్రమంలో ఆమెకి రోజుకి 45-50వేల వరకు పారితోషికం ఇస్తున్నారట.

అలాగే నిఖిల్‌ పారితోషికం కూడా నాలభై వేలకు పైగానే ఉంటుందని తెలుస్తుంది. సీరియల్‌ నటుడిగా నిఖిల్‌కి మంచి క్రేజ్‌ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగానే రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారట. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ఇది. ఇందులో నిజమెంతా అనేది వాళ్లు తెలియజేస్తేనే తెలుస్తుంది. సెప్టెంబర్‌ 1న 14 మందితో ప్రారంభమైన బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ విజయవంతంగా రన్‌ అవుతుంది. ఇప్పటి వరకు బేబక్క, శేఖర్‌ బాషా, అభయ్‌ నవీన్‌, సోనియా, ఆదిత్య ఓం ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. 

ఇంట్లోనేమో ఎన్టీఆర్‌ ఫోటో పెట్టుకుని అరాధిస్తాడు.. ఆయన రిక్వెస్ట్ చేస్తే మొహంమీదే నో చెప్పిన హీరో ఎవరో తెలుసా?
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved