- Home
- Entertainment
- TV
- వారణాసి ఈవెంట్ అట్టర్ ప్లాప్, రాజమౌళి పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్, గ్లోబ్ ట్రాటర్ ఫెయిల్యూర్ కు కారణాలివే
వారణాసి ఈవెంట్ అట్టర్ ప్లాప్, రాజమౌళి పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్, గ్లోబ్ ట్రాటర్ ఫెయిల్యూర్ కు కారణాలివే
Varanasi Event Disaster : ఎంతో అట్టహాసనంగా.. భారీ అంచనాల నడుమ నిర్వహించిన వారణాసి టైటిల్ రిలీజ్ ఈవెంట్ అట్టర్ ప్లాప్ అయ్యింది. చిన్న చిన్న ఈవెంట్లకంటే దారుణంగా రాజమౌళి సినిమా ఈవెంట్ నిర్వహించడంతో.. మహేష్ బాబు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

అట్టర్ ప్లాప్ ఈవెంట్...?
రాజమౌళి ఎంతో అట్టహాసంగా నిర్వహించిన వారణాసి టైటిల్ రిలీజ్ ఈవెంట్ గ్లోబ్ ట్రాటర్ పై.. సోషల్ మీడియాతో పాటు మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదో అద్భుతం చేస్తారనుకుంటే.. సాధారణ ఈవెంట్ కంటే దారుణంగా నిర్వహించారని అభిమానులు మండిపడుతున్నారు. కోట్లు ఖర్చు పెట్టి... ఎప్పుడు, ఎక్కడా లేని విధంగా ఎల్ ఈ డీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు రాజమౌళి టీమ్. కానీ అది కూడా చివరికి హ్యాండ్ ఇవ్వడంతో టీమ్ కు ఇబ్బంది తప్పలేదు. కరెక్ట్ టైమింగ్ ఫాలో అవ్వకపోవడం, వచ్చిన వారిని ఎంటర్టైన్ చేసేలా ఎటువంటి ఈవెంట్లు జరగకపోవడంతో పాటు.. మహేష్ బాబు, రాజమౌళి లాంటి స్టార్స్ నుంచి మరింత స్టఫ్ ను ఎక్స్ పెక్ట్ చేసిన వారిని వారణాసి ఈవెంట్ బాగా నిరాశపరిచింది. దాంతో సోషల్ మీడియాలో దీనిపై రకరకాల విమర్శలు వస్తున్నాయి.
టెక్నికల్ ప్లాబ్లమ్స్..
మహేష్ బాబు వారణాసి టైటిల్ రిలీజ్ ఈవెంట్ లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ టీమ్ ను బాగా ఇబ్బందిపెట్టాయి. యాంకర్ మొదలుపెట్టినప్పటి నుంచీ మైక్ లు మొరాయించడం.. వాయిస్ నాయిస్ తో పాటు.. ఎల్ ఈడీ స్క్రీన్లు పనిచయకపోవడం లాంటి సమస్యలు ఇబ్బందిపెట్టాయి. అంతే కాదు భారీగా ఖర్చు పెట్టి తీసుకువచ్చిన జనరేటర్ల పవర్ కూడా సరిపోకపోవడంతో.. మహేష్ బాబు టైటిల్ ట్రైలర్ ను ఈ భారీ ఎల్ ఈడీపై ప్లే చేయడానికి సాధ్యం కాలేదు. ఈ విషయంలో రాజమౌళి కాస్త నిరాశ చెందారు. అటు ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడం కోసం యాంకర్ సుమ రకరకాల ప్రయత్నాలు చేసినా.. అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. చివరికి ఈ విషయంలో స్వయంగా రాజమౌళి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
అభిమానులకు రాజమౌళి వివరణ..
ఎల్ ఈడీ స్క్రీన్ పనిచేయకపోవడంపై వారణాసి ఈవెంట్ లోనే రాజమౌళి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జక్కన్న మాట్లాడుతూ.. '' ఈ ఈవెంట్ ఏర్పాట్లు జరిగే టైమ్ లో.. స్క్రీన్ పై ముందుగా ట్రైలర్ ను ప్లే చేసే ప్రయత్నం చేశాము. భారీగా జనరేటర్లు, క్రైయిన్ లుతెప్పించి..స్క్రీన్ కు అడ్డుగా పరదాలు కట్టి.. టెస్ట్ చేద్దామనుకున్నాము.. కానీ ఎక్కడి నుంచి ఎవరు పంపారో తెలియదు.. పైన కొన్ని డ్రోన్ లు తిరిగాయి. ఈ వీడియోను ముందే దొంగతనం చేసి.. సోషల్ మీడియాలో రిలీజ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ నా సినిమానుంచి ఒక్క బిట్ కూడా బయటకు పోనివ్వను.. అందుకే ఆ ప్రయత్నం ఆపేశాము. ఇప్పడు ప్లే చేయడానికిపవర్ సరిపోవడంలేదు.. అందుకే కాస్త టైమ్ ఇవ్వండి.. ఓ టెన్ మినిట్స్ ఓపికగా ఉండండి..ఈ విషయంలో నేను మీకు సారి చెపుతున్నాను అంటూ.. రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.
మహేష్ బాబు ఎంట్రీ పై కోపంగా ఫ్యాన్స్..
ఈ ఈవెంట్లో స్టార్స్ ఏదో గొప్పగా మాట్లాడతారు అని ఊహించుకుని వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. సినిమా గురించి వివరాలు బయటపడతాయి అన్న భయంతో.. రాజమౌళి మందే టీమ్ అందరికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. స్టార్స్ కూడా సినిమా గురించి మితంగా మాట్లాడే విధంగా ముందే ప్రిపేర్ చేశారు జక్కన్న. ఇక మహేష్ బాబు ఎంట్రీ కూడా ఏదో తోలు బొమ్మలాటలాగా ఉందంటూ.. ఫ్యాన్స్ నుంచే విమర్శలు వస్తున్నాయి. అంత పెద్ద స్టార్ ను అలా తీసుకురాకుండా ఉంటే బాగుండేది అని అంటున్నారు. సాధారణ ఈవెంట్ లో మాదిరిగా.. స్టేజ్ పై నిలబడి మాట్లాడినా చాలు.. మహేష్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతారు. కానీ ఇలా జిమ్మిక్కులు చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. పైగా మహేష్ నుంచి గొప్పగా ఏదైనా వచ్చిందా అంటే..పట్టుమని పదినిమిషాలు కూడా ఆయన మాట్లాడలేదు. అటు రాజమౌళి కూడా పెద్దగా మాట్లాడింది లేదు. ప్రియాంక, పృధ్విరాజ్ ఏదో తప్పదు అన్నట్టుగా రెండు మాటలు మాట్లాడారు. స్టార్స్ ఎంట్రీలపై కూడా క్లారిటీ లేకుండా కన్ ఫ్యూజ్ చేశారు. అసలు ఈవెంట్ ను ఈవెంట్ టాగా నిర్వహించలేదంటున్నారు అభిమానులు.
హాట్ స్టార్ కు అమ్ముకున్న రాజమౌళి.. ?
ఈ వారణాసి టైటిల్ ఈవెంట్ ను రాజమౌళి ఓటీటీకి ఇవ్వడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. లైవ్ టెలికాస్ట్ పెట్టకుండా.. ఓటీటీకి ఈ వెంట్ హక్కులను 50 కోట్లకు ఇచ్చారట జక్కన్న. అయితే ఓటీటీల ఈ వెంట్ కూడా లేట్ గా లైవ్ స్టార్ట్ అవ్వడంతో.. ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. బయట ఓపెన్ ప్లేస్ లో కార్యక్రమం పెట్టి.. లైవ్ ఇవ్వకపోతే.. ఇలాంటి సమస్యలు వస్తాయంటున్నారు అభిమానులు. చివరికి యాంకర్ల విషయంలో కూడా ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. చిన్న ఈవెంట్ అయినా.. సూపర్ సక్సెస్ చేసే సుమ.. ఈ ఈవెంట్ ను నడిపించలేకపోయింది. ఆమెకు తోడుగా హిందీ యాంకర్ ను రంగంలోకి దింపినా.. పెద్దగా ప్రభావం కనిపించలేదు. ప్రతీ సారి ఆర్డర్ ను మారుస్తూ.. జక్కన్న టీమ్..సుమను కూడా కాస్త కన్ ఫ్యూజ్ చేసినట్టు అనిపించింది.
రాజమౌళిపై కోపంగా మహేష్ ఫ్యాన్స్.
తమ అభిమాన నటుడి కోసం వస్తే.. ఈవెంట్ ను ఇలా చేశారేంటి అంటూ.. మహేష్ బాబు ఫ్యాన్స్ రాజమౌళిపై మండిపడుతున్నారు. ప్రతీ ఈవెంట్ ను సక్సెస్ ఫుల్ గా చేసే రాజమౌళి.. ఈసారి ఎందుకు తడబడ్డాడా అని ఆలోచనలో పడ్డారు. ఈవెంట్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది అంటున్నారు. అంతే కాదు ఓటీటీకి ఈవెంట్ ఇవ్వడంతో.. జానాల్లోకి పెద్దగా ఈవెంట్ వెళ్లలేకపోయింది. సామాన్యులు ఈవెంట్ ను చూసే అవకాశం లేకపోయింది. దాంతో వారణాసి టైటిల్ కాస్త లేట్ గానే జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఈమొత్తం ఈవెంట్ లో మహేష్ ఫ్యాన్స్ ను సంతోషపెట్టింది.. మహేష్ బాబు లుక్ తో పాటు టైటిల్ మాత్రమే. ఇదేదో చిన్న ఈవెంట్ పెట్టి చేసినా.. హ్యపీగా ఉండేది అంటున్నారు సూపర్ స్టార్ అభిమానులు.