- Home
- Entertainment
- వారణాసి రిలీజ్ డేట్ రివీల్ చేసిన కీరవాణి, మహేష్ బాబు సినిమా వచ్చేది ఎప్పుడో తెలుసా?
వారణాసి రిలీజ్ డేట్ రివీల్ చేసిన కీరవాణి, మహేష్ బాబు సినిమా వచ్చేది ఎప్పుడో తెలుసా?
Varanasi Release Date : మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లోపాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోన్ని సినిమా వారణాసి. ఈసినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. ఇంతకీ ఈమూవీ రిలీజ్ ఎప్పుడు?

మహేష్ బాబు వారణాసి సినిమా రిలీజ్ డేట్..
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈమూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈసినిమా విశేషాలను పంచుకోవడం కోసం రాజమౌళి గ్లోబ్ ట్రాటర్ పేరుతో భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ భారీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ డేట్ ను తెలియకుండానే రివిల్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. ఈమూవీని 2027 సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పకనే చెప్పేశారు.
మహేష్ బాబు డైలాగ్ తో ఆకట్టుకున్న కీరవాణి.
కీరవాణి మాట్లాడుతూ.. ''సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో పోకిరి సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆసినిమాలో మహేష్ బాబు యాక్టింగ్, డైలాగ్స్ ఎంత బాగుంటాయంటే.. అసలు ఆసినిమా ఎన్నిసార్లు చూశానో నాకే లెక్కలేదు. చాలామంది అంటుంటారు.. కీరవాణి మోలోడీ మ్యూజిక్ బాగా కొడతారు అని.. కానీ నా మ్యూజిక్ గురించి అందరికి ఎందుకు అర్ధం కావడంలేదు... నేను ప్లాట్ కొన్నాను.. హైదరాబాద్ లో కాదు, సిమెంట్ తో చేసిన ప్లాట్ కాదు.. మహేష్ బాబు ఫ్యాన్స్ గుండెల్లో ప్లాట్ కొన్నాను.. టైల్స్ వేస్తున్నారు.... మోలోడీ నాదే.. ఫాస్ట్ బీట్ నాదే.. ''అంటూ పోకిరి డైలాగ్ ను చాలా పవర్ ఫుల్ టోన్ లో చెప్పి.. అందరిని ఆశ్చర్యపరిచారు కీరవాణి.
సూపర్ స్టార్ కృష్ణ సాహసాలు అంటే చాలా ఇష్టం.
కీరవాణి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. '' ఫిల్మ్ ఇండస్ట్రీలో సాహసానికి మారు పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన చేసినన్ని సాహసాలు ఇంకెవరు చేయలేదు. ఆయన చేసిన మోసగాళ్లకు మోసగాడు సినిమా చూసి కృష్ణగారికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అటువంటి కృష్ణగారి వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. మహేష్ బాబు విశ్వరూపం ఈసినిమాలో చూస్తారు'' అని అన్నారు.
మహేష్ బాబు వారణాసి టైటిల్ వీడియో రిలీజ్..
రాజమౌళి పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఫస్ట్ లుక్ తో కూడిన టైటిల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈసినిమాకు ''వారణాసి'' టైటిల్ ను ఫిక్స్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటిలో జరుగుతోన్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో.. ఈసినిమా టైటిల్ రిలీజ్ చేశారు టీమ్. ఈ సినిమా ఫస్ట్ లుక్ వీడియోలో పవర్ ఫుల్ లుక్ లో కనిపించారు మహేష్. త్రిశూలం పట్టుకుని, ఎద్దుపై సవారీ చేస్తూ కనిపించాడు. ఈ టైటిల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కీలక పాత్రల్లో ఎవరెవరంటే?
రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న వారణాసి లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తోంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమాలో మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. వీరిద్దరికి సబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రిసెంట్ గా రిలీజ్ చేశారు టీమ్. మందానికి పాత్రలో ప్రియాంక చోప్రా.. కుంభ పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ లుక్స్ వైరల్ అయ్యాయి. ఇక కుంభ లుక్ పై ఎన్నో మీమ్స్ ట్రోల్స్ కూడా వచ్చాయి. రాజమౌళి హాలీవుడ్ ను కాపీచేశారని... తమిళ సినిమా 24 లో సూర్య లుక్ లా ఉందంటూ.. ఎన్నో కామెంట్స్ వచ్చాయి.