Adi Reddy: నెలకు అన్ని లక్షలా... లెక్కలతో సహా యూట్యూబ్ ఆదాయం బయటపెట్టిన ఆదిరెడ్డి!
బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి అందరి మైండ్ బ్లాక్ చేశాడు. యూట్యూబ్ ద్వారా తన ఆదాయం బయపెట్టి షాక్ ఇచ్చాడు. జస్ట్ ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తూ అతడు లక్షలు సంపాదిస్తున్నాడు...
Adi Reddy
బెంగుళూరులో చిన్న ఉద్యోగం చేసుకునే ఆదిరెడ్డి బిగ్ బాస్ షో గురించి మాట్లాడటం చూసి... యూట్యూబ్ లో రివ్యూలు చేయమని మిత్రులు సలహా ఇచ్చారట. ఫ్రెండ్స్ సలహా మేరకు వీడియోలు స్టార్ట్ చేయగా విపరీతమైన ఆదరణ దక్కిందట. ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూ వీడియోలు వైరల్ అవుతుండగా... సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు.
Adi Reddy
ఏకంగా బిగ్ బాస్ తెలుగు 6లో ఛాన్స్ పట్టేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఆదిరెడ్డి ఫైనల్ కి వెళ్ళాడు. రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ వరుసగా స్థానాలు సొంతం చేసుకున్నారు. సింగర్ రేవంత్ విన్నర్ కాగా, ఆదిరెడ్డికి నాలుగో స్థానం దక్కింది. ఓ యూట్యూబర్ టాప్ సెలెబ్స్ తో పోటీపడి రాణించడం గొప్ప పరిణామం.
Adi Reddy
హౌస్లో ఆదిరెడ్డి తన పాయింట్ ఖచ్చితంగా మాట్లాడేవాడు. గేమ్స్ లో గట్టి ఎఫర్ట్స్ పెట్టేవాడు. గీతూ, ఆదిరెడ్డి బెస్ట్ ఫ్రెండ్స్ గా మెలిగారు. అయితే 8వ వారంలో గీతూ, ఆదిరెడ్డికి కూడా తేడా వచ్చింది. ఇకపై నేనేమిటో నీకు చూపిస్తూ అంటూ గీతూతో ఛాలెంజ్ చేశాడు. అయితే 9వ వారం గీతూ ఎలిమినేట్ అయ్యింది.
Adi Reddy
ఆదిరెడ్డి హౌస్లో దొరికిన బెస్ట్ గిఫ్ట్ అని గీతూ ఎలిమినేషన్ రోజు ఎమోషనల్ అయ్యింది. ఆదిరెడ్డి డాన్స్ కి హోస్ట్ నాగార్జున బిగ్ ఫ్యాన్. కొంచెం కూడా బాడీలో ర్ రిథమ్ లేకుండా ఇష్టం వచ్చినట్లు ఎగిరే ఆదిరెడ్డిని చూసి తెగ నవ్వేవాడు. బిగ్ బాస్ షో అనంతరం ఆదిరెడ్డి వీడియోలకు మరింత రీచ్ పెరిగింది.
Also Read Bigg Boss Telugu 7: నామినేషన్స్ లో పీక్స్ చేరిన అమర్-యావర్ గొడవ... శివాజీ రాకుంటే!
Adi Reddy
సీజన్ 7 మొదలు కాగా... ఆదిరెడ్డి వరుస రివ్యూ వీడియోలు చేస్తున్నాడు. లైవ్ తో పాటు ప్రోమోలు, ఎపిసోడ్స్ చూస్తూ ఆదిరెడ్డి రివ్యూలు చెబుతున్నాడు. మంచో చెడో తనకు అనిపించింది చెబుతాడు ఆదిరెడ్డి. ఈ క్రమంలో కొందరిని విమర్శించడం, మరికొందరిని పొగడటం చేస్తాడు.దీంతో డబ్బులు తీసుకొని కొందరికి అనుకూలంగా ఇంకొందరికి వ్యతిరేకంగా రివ్యూ చెబుతున్నాడనే విమర్శలు ఉన్నాయి.
Adi Reddy
పేయిడ్ రివ్యూవర్ అనే విమర్శలకు సమాధానం చెబుతూ... తన యూట్యూబ్ ఆదాయం బయటపెట్టాడు. అవును నేను పేయిడ్ రివ్యూవర్ నే. నాకు యూట్యూబ్ పే చేస్తుందని లెక్కలు చెప్పాడు. ఆదిరెడ్డి షేర్ చేసిన సమాచారం ప్రకారం అతనికి నెలకు రూ. 39 లక్షలు ఆదాయం సమకూరింది. అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏడాది సంపాదనకు మూడు రెట్లు నెలలో రాబడుతున్నాడు.
Adi Reddy
ఆదిరెడ్డి తల్లి ఆత్మహత్య చేసుకుందట. ఆమెకు ఒంటి మీద కనీస బంగారం కూడా ఉండేది కాదట. ఏదైనా వేడుకకు వెళ్లాల్సి వస్తే బంధువుల బంగారం తీసుకుని ధరించి వెళ్ళేదట. ఇప్పుడు మా అమ్మ ఉంటే ఒంటినిండా బంగారం చేయించే వాడినని హౌస్లో చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ఆదిరెడ్డి చెల్లి బ్లైండ్ కాగా, ఆమె కూడా ఛానల్ నడుపుతుంది...
Also Read Bigg Boss Telugu 7: హౌజ్‌లో ఉన్న టాప్-10 కంటెస్టెంట్లలో ఎవరి స్థానం ఎంత?