MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • TV
  • నాగార్జున దగ్గర నేను తగ్గాను, నన్ను పక్కన పెట్టి ప్రశాంత్ ని విన్నర్ చేశారా... వీడియో వదిలిన శివాజీ!

నాగార్జున దగ్గర నేను తగ్గాను, నన్ను పక్కన పెట్టి ప్రశాంత్ ని విన్నర్ చేశారా... వీడియో వదిలిన శివాజీ!

బిగ్ బాస్ తెలుగు 7 ఘనంగా ముగిసింది. టైటిల్ పల్లవి ప్రశాంత్ గెలిచాడు. ఈ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అంటూ గట్టిగా ప్రచారం జరిగింది. కాగా శివాజీ దీనిపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో వదిలారు.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 19 2023, 08:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లో ఒకరైన శివాజీ టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యాడు. టాప్ సెలబ్రిటీ హోదాలో అడుగుపెట్టిన అమర్ దీప్ తేలిపోవడంతో శివాజీకి ఇక తిరుగు లేదు అనుకున్నారు. ఈసారి టైటిల్ శివాజీదే అని జనాలు ఫిక్స్ అయ్యారు. చివరి వారాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పల్లవి ప్రశాంత్ పుంజుకున్నాడు. అతడికి ఓటింగ్ పెరుగుతూ వచ్చింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మొదట్లో శివాజీ, ప్రశాంత్ నామినేషన్స్ లో ఉంటే అత్యధిక ఓటింగ్ శివాజీకి పడేది. తర్వాత స్థానంలో ప్రశాంత్ ఉండేవాడు. షో ముగింపు దశకు చేరుకుంటుండగా ప్రశాంత్ అందరికంటే అత్యధిక ఓట్లు సాధించేవాడు. మిగతా వాళ్ళతో అతనికి పోటీ లేకుండా పోయింది. ప్రశాంత్ శివాజీ శిష్యుడిగా హౌస్లో మెలిగాడు. శివాజీ, ప్రశాంత్, యావర్ స్పై టీమ్ గా పేరుగాంచారు. 

 

38

శివాజీని స్టార్ మా తొక్కేసింది. అతన్ని కాదని పల్లవి ప్రశాంత్ కి టైటిల్ కట్టబెట్టారని ప్రచారం జరుగుతుండగా శివాజీ ఒక వీడియో వదిలాడు. సదరు వీడియోలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ''సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నందమూరి తారక రామారావు చెప్పారు. మా నటులకు ప్రేక్షకులే దేవుళ్ళు. జీవితంలో నటిస్తే ఎవరూ ఆదరించరు. మనం మనలానే ఉండాలి. 

48

బిగ్ బాస్ షో నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది. ముఖ్యంగా నాకు సినిమాల్లో మొదటి అవకాశం ఇచ్చిన నాగార్జున గారు హోస్ట్ గా మెప్పించారు. షో సక్సెస్ లో ఆయన పాత్ర ఎంతో ఉంది. ఒక మాస్టర్ వలె ప్రతి వారం ఆయన కంటెస్టెంట్స్ తప్పు ఒప్పులు చెప్పడం, సరి చేయడం బాగుంది. నేను ఎవరి దగ్గర తగ్గను. నాగార్జున బాబుతో మాట్లాడేటప్పుడు ప్రతి మాట ఆచి తూచి మాట్లేడేవాడిని. ఆయన విషయంలో నేను తగ్గి ఉన్నాను. 


 

58

కొందరు స్టార్ మా శివాజీనీ పక్కన పెట్టింది. ప్రశాంత్ కి టైటిల్ ఇచ్చారని అంటున్నారు. అది నిజం కాదు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే విజేతను నిర్ణయిస్తారు. పల్లవి ప్రశాంత్ నాబిడ్డ. వాడు టైటిల్ గెలవడం నాకు ఎంతో సంతోషం. నేను రైతు కుటుంబం నుండే పరిశ్రమకు వచ్చాను. వాడు కూడా రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టాడు. ఒక కామనర్ ఎప్పుడూ ఓడిపోతూ ఉంటాడు. పల్లవి ప్రశాంత్ కామనర్ గా హౌస్లో అడుగుపెట్టి గెలిచాడు. 

68

యావర్, ప్రశాంత్ నాకు దగ్గరయ్యారు. మేము స్నేహం చేశాము. కలిసి ఆడటం అనేది బిగ్ బాస్ నియమాలకు విరుద్ధం. ఆ పని మేము చేయలేదు. వారిద్దరినీ నేను ప్రోత్సహించాను అంతే. నాపై ప్రేమ కురిపించి ఆదరించిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. మిమ్మల్ని నేను త్వరలో కలుస్తాను...'' అని వీడియో ముగించాడు. 


 

78

శివాజీ వీడియో వైరల్ అవుతుంది. ఇక టైటిల్ కొట్టకున్నా శివాజీ రెమ్యూనరేషన్ రూపంలో భారీగా రాబట్టారని సమాచారం. ఈ సీజన్లో ఆయనదే అత్యధిక పారితోషికం అట. వారానికి రూ. 4 లక్షల ఒప్పందంపై హౌస్లో అడుగుపెట్టిన శివాజీ రూ. 60 లక్షలు తీసుకున్నాడని సమాచారం. 
 

88

శివాజీ నటనకు గుడ్ బై చెప్పి చాలా కాలం అవుతుంది. బిగ్ బాస్ షోతో జనాలు మరలా ఆయన్ని గుర్తు చేసుకున్నారు. మరి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడేమో చూడాలి... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved