- Home
- Entertainment
- TV
- Illu Illalu Pillalu Today నవంబర్ 15 ఎపిసోడ్: ఫలించిన వల్లి కుట్ర, విశ్వ మాయలో అమూల్య, ధీరజ్ ప్రేమలో మునిగితేలుతున్న ప్రేమ
Illu Illalu Pillalu Today నవంబర్ 15 ఎపిసోడ్: ఫలించిన వల్లి కుట్ర, విశ్వ మాయలో అమూల్య, ధీరజ్ ప్రేమలో మునిగితేలుతున్న ప్రేమ
Illu Illalu Pillalu Today : ప్రేమను పోలీస్ చేయాలని ధీరజ్ నిర్ణయించుకుంటాడు. అందుకోసం ముందుగా షూ కొనిపెట్టాలని బయటకు తీసుకొని వెళతాడు. మరోవైపు అమూల్యను ఎలాగైనా విశ్వ ప్రేమలో పడేయడానికి శ్రీ వల్లి తిప్పలుపడుతూ ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్
Illu Illalu Pillalu Today : కాలేజీ కి వెళ్లడానికి బస్ కోసం ఎదురు చూస్తున్న ప్రేమను ధీరజ్ కారు ఎక్కించుకొని బయటకు తీసుకొని వెళతాడు. ఎక్కడికి అంటే సర్ ప్రైజ్ అని చెబుతాడు కానీ... ఏమీ చెప్పడు. కానీ.. ధీరజ్ తో అలా బయటకు వెళ్లడాన్ని ప్రేమ చాలా ఎంజాయ్ చేస్తుంది.
శ్రీవల్లి బుట్టలో ప్రేమ
మరోవైపు అమూల్య విషయంలో తాను నడిపిన ప్రేమ రాయభారం ఎక్కడ బయటపడుతుందా అని శ్రీవల్లి బయపడుతూ ఉంటుంది. అదే టైమ్ లో అమూల్య బయటకు వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇదే కరెక్ట్ టైమ్ అని భావించి వెళ్లి అదే పనిగా అమూల్యను పొగడటం మొదలుపెడుతుంది. నీ రాశి ఫలం అద్భుతంగా ఉందని, అది రాశిఫలం కాదు సీతా ఫలం లాగా మధురం అని , జాతకం సూపర్ అని పొగిడేస్తుంది. ‘ మమూలుగా అదృష్టం కోసం మనిషి పరిగెడతాడు. కానీ ఇక్కడ అదృష్టమే నీకోసం రన్నింగ్ చేసుకుంటూ వచ్చేసింది. ఊహించని అద్భుతాలు జరుగుతాయంట. ఆ అద్భుతాలు నిన్ను ఎక్కడికో తీసుకువెళతాయంట. అందుకని, ఈ రోజు నీ జీవితంలో ఏం జరిగినా, నీకు ఎవరు ఏం చెప్పినా.. అంతా నీకు మంచి చేయడం కోసమే దేవుడు వాళ్లను పంపారని నువ్వు పాజిటివ్ గా తీసుకోవాలి, సరేనా అమూల్య’ అని శ్రీవల్లి చెబుతుంది.
ఆ మాటలకు అమూల్య.. ‘ ఇంతకీ మీరు చదివింది ఏ రాశి వదినా..?’ అని అడుగుతుంది. మీన రాశి అని శ్రీవల్లి చెబితే... పేపర్ తీసుకొని చెక్ చేసి అది కన్య రాశి వదిన అని అమూల్య చెబుతుంది. దీంతో వల్లీ షాక్ అయ్యి... తన ప్లాన్ బెడిసి కొట్టేసిందే అని ఫీలౌతుంది. దానిని నవ్వుతూ కవర్ చేస్తుంది. ‘ అమూల్య రాశి మారి ఉండొచ్చు కానీ... నీ జీవితంలో పట్టబోయే అదృష్టం మాత్రం మారదని నా మనసు గట్టిగా చెబుతుంది’ అని అంటుంది. అమూల్య మాత్రం.. తనకు కాలేజీకి టైమ్ అవుతుందని బయలుదేరబోతుంది. అయితే వెళ్తున్న ఆమెను ఆపి.. మాట్లాడాలి అని కూర్చోపెడుతుంది.
మీ నాన్నకు ఎందుకు చెప్పలేదు..?
‘ అమ్మూ... ఆ డైనోసార్ విశ్వగాడు మళ్లీ నీ వెనక పడుతున్నాడా?’ అని అడుగుతుంది. లేదు అని అమూల్య చెప్పగా ‘ నీకు విశ్వ ప్రపోజ్ చేశాడు కదా? వాడ్ని నువ్వు పెళ్లి చేసుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయని నేను కూడా చెప్పాను కదా? మరి, ఆ విషయం గురించి నువ్వు ఏం ఆలోచించావ్?’ అని అడుగుతుంది. దానికి అమూల్య‘ వాడు ఒక రౌడీ ఎదవ వదినా, వాడు ప్రపోజ్ చేస్తే నేను ఆలోచించడం ఏంటి? నాన్సెన్స్. వాడు ఒంకోసారి అలాంటి పనులు చేస్తే మామూలుగా ఉండదు’ అని చెబుతుంది. ఆ మాటలకు భయపడిన శ్రీవల్లి... నవ్వుతూ కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ‘ ఆ బండోడుని బండ కేసి బాదుతావా? మరి అలాగైతే.... మొన్న వాడు నీకు ప్రమోజ్ చేసిన విషయాన్ని మీ నాన్న గారికి ఎందుకు చెప్పలేదు?’ అని అడుగుతుంది. ‘ నువ్వే కదా గొడవలు అవుతాయ్ చెప్పొద్దు అన్నావ్ ’ అని అమూల్య సమాధానం ఇస్తుంది. ‘ అంటే.. నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని కూడా చెప్పాను, అంటే నువ్వు మీ నాన్నకు చెప్పకుండా ఆగిపోయింది మొదటి విషయం గురించి ఆలోచించి కాదు, రెండో విషయం గురించి ఆలోచించి’ అని శ్రీవల్లి అంటుంది. కానీ అమూల్య మాత్రం... తన మనసులో విశ్వ గురించి ఎలాంటి ఆలోచనలు లేవని చెబుతుంది. కానీ... శ్రీవల్లి మాత్రం వినిపించుకోదు. నీ మనసులో ఏదో ఒక మూలన ఇష్టం మొదలైంది అని అమూల్య మనసు మార్చేందుకు ప్రయత్నిస్తుంది. వల్లి మాటలకు అమూల్య కూడా ఆలోచనలో పడుతుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తాను వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందని వల్లి సంబరపడుతుంది.
బాధ్యతగా రన్నింగ్ షూ కొన్న ధీరజ్
మరోవైపు ప్రేమను తీసుకొని ధీరజ్.... ఓ చెప్పుల షాప్ కి తీసుకొని వస్తాడు. ప్రేమను మంచి రన్నింగ్ షూ కొని పెట్టాలని అనుకుంటాడు. అలాంటివే చూపించమని అడుగుతాడు. నాకు రన్నింగ్ షూ ఎందుకు అని ప్రేమ అడిగితే....‘ నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నావ్ కదా, ఫిజికల్ టెస్టుల్లో పాస్ అవ్వడానికి రోజూ రన్నింగ్ చేయాలి కదా.... అలా చేయాలంటే రన్నింగ్ షూ కావాలి కదా ’ అని చెబుతాడు. అయితే... తనకు షూ వద్దని చెబుతుంది. కానీ.. ధీరజ్ ఆపుతాడు. ‘ నీ కళను నీ సంతోషం కోసం నిజం చేసుకో, మా నాన్న కోసం చంపుకోవద్దు , ఇది నా బాధ్యత, నెరవేర్చనివ్వు’ అని ధీరజ్ చెబుతాడు. బాధ్యత అన్న మాటకు ప్రేమ హర్ట్ అవుతుంది. కానీ షూస్ కొనుక్కోవడానికి ఒకే చెబుతుంది. షాప్ అతను ఇచ్చిన షూ వేసుకోలేక ప్రేమ ఇబ్బంది పడుతుంటే.. ఆ షాప్ అతను హెల్ప్ చేస్తూ ఉంటాడు. ధీరజ్ చూడటం చూసి ప్రేమ ఆడుకోవడం మొదలుపెడుతుంది. ఇక... ఆ షూస్ ప్రేమ పాదాలకు వేయడానికి ధీరజ్ రంగంలోకి దిగుతాడు.
ఛాన్స్ దొరికిందని ప్రేమ ధీరజ్ ని ఆడుకోవడం మొదలుపెడుతుంది. ‘ నా పాదాలు షాప్ అతను పట్టుకోవడం చూసి పొసెసివ్ ఫీల్ అయ్యావ్ కదా అని అడుగుతుంది’. కానీ.. ధీరజ్ మాత్రం ‘అలాంటిది ఏమీ లేదని.. ఇది కూడా తన బాధ్యతే’ అని చెబుతాడు. ఇక.. ధీరజ్ తన పాదాలకు షూ వేస్తుంటే... ప్రేమ మురిసిపోతూ ఉంటుంది. ఆ సీన్స్ చూడటానికి చాలా బాగుంటాయి. మొత్తానికి ఒక జత షూ కొనుగోలు చేసి మళ్లీ కారులో బయలుదేరతారు.
అప్పుడు కారులో ప్రేమకు బ్యాగ్ కనపడుతుంది. ఆ బ్యాగ్ ఎవరది అని అడిగితే.. ఒక పెద్దాయన మర్చిపోయాడని చెబుతాడు. ఆబ్యాగ్ ఇచ్చేయమని ప్రేమ చెప్పి..వెళ్లిపోతుంది. ఆ బ్యాగ్ ఇవ్వడానికి ధీరజ్ వెనక్కి వెళ్లిపోతాడు.
అమూల్య కోసం చచ్చిపోతానన్న విశ్వ
మరోవైపు అమూల్య కాలేజీకి వెళ్తుంటే.... విశ్వ బైక్ మీద వెంబడించడం మొదలుపెడతాడు. అమూల్యను ఆపి ‘ నీతో మాట్లాడాలి’ అని అంటాడు. ఆ మాటకు అమూల్య.. ‘ నేను నీతో ఎందుకు మాట్లాడాలి? అసలు ఎవరు నువ్వు నాతో మాట్లాడటానికి, నా వెంట పడకు, నాతో మాట్లాడొద్దని చెప్పినా నీకు అర్థం కాదా? అనవసరంగా తన్నులు తింటావ్ లే అని నీ గురించి ఇంట్లో చెప్పలేదు. నువ్వు ఈ పనులు ఆపకపోతే మా ఇంట్లో చెబుతాను అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో’ అని వార్నింగ్ ఇస్తుంది. దానికి విశ్వ జాలిగా ఫేస్ పెట్టి... ‘ చంపేస్తారు.. పర్లేదు అమూల్య ఇంట్లో చెప్పేయ్... మీ వాళ్లు నన్ను చింపేసినా పర్వాలేదు. నేను చనిపోయిన తర్వాత అయినా నేను, నా ప్రేమ నిజం అని నమ్ము అది చాలు. అమూల్య నువ్వు నన్ను ద్వేషించడానికి లక్ష కారణాలు ఉండొచ్చు. కానీ, నేను నిన్ను ప్రేమించడానికి ఒకే ఒక్క కారణం నీ మంచితనం. ఒకప్పుడు మీ కుటుంబం అంటే కోపం ఉన్న మాట నిజం. మీ కుటుంబంపై పగ తీర్చుకోవాలని చూసిన మాట కూడా నిజమే. అవన్నీ ఎంత నిజమో... నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అన్న మాట కూడా అంతే నిజం. అలాగే.. ప్రస్తుతం నా మనసులో నీ మీద ప్రేమ తప్ప... మీ కుటుంబం మీద పగ కానీ, ప్రతికారం తీర్చుకోవాలనే ఆలోచన లేదు’ అని చెబుతాడు. పరిస్థితి చూస్తుంటే... అమూల్య విశ్వ ప్రేమలో పడిపోయినట్లే కనపడుతుంది. శ్రీవల్లి మాటలు అమూల్య మనసు మార్చేసినట్లే కనపడుతోంది. మరి... ఆమె రియాక్షన్ తెలియాలంటే... తర్వాతి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.