- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode: భాగ్యాన్ని అడ్డంగా బుక్ చేసిన నర్మద, ప్రేమ.. పచ్చళ్ల వ్యాపారం గోవిందా
Illu Illalu Pillalu Today Episode: భాగ్యాన్ని అడ్డంగా బుక్ చేసిన నర్మద, ప్రేమ.. పచ్చళ్ల వ్యాపారం గోవిందా
Illu Illalu Pillalu Today Episode:భాగ్యాన్ని టార్గెట్ చేశారు నర్మద, ప్రేమ. వారు రామరాజు నుంచి పాతిక లక్షలు కొట్టేయకుండా విజయవంతంగా అడ్డుకున్నారు. దీంతో వల్లీ, భాగ్యం ముఖాలు మాడిపోయాయి.

భాగ్యం పచ్చడి
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడు ఎపిసోడ్ మొత్తం భాగ్యం పికిల్స్ చుట్టే తిరుగుతుంది. భాగ్యం పికెల్స్ అంటే రెండు రాష్ట్రాల్లో మారుమోగిపోవాలి అని నర్మద, ప్రేమ వెటకారం చేస్తారు. ఈలోపు వల్లీ మాట్లాడుతూ విదేశాల దాకా అమ్మాలంటే ఆ మాత్రం పెట్టుబడి పెట్టాలి కదా, అయినా పబ్లిసిటీ అని చెప్పి కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలి అని అంటుంది. దానికి నర్మద అది సరే ఇంతకీ మీకు పచ్చళ్ళు పెట్టడం వచ్చా అని అడుగుతుంది. తనకి ఇడ్లీ బాబాయ్ రెచ్చిపోయి భాగ్యం కళ్ళు మూసుకొని పచ్చళ్ళు పెట్టేస్తుందని చెబుతాడు. ఇడ్లీ బాబాయిని రెచ్చగొట్టి ప్రేమ అప్పటికప్పుడే భాగ్యం చేత పచ్చళ్ళు పెట్టించేలా చేస్తుంది.
ఇక భాగ్యం పచ్చడి తయారు చేయడం మొదలు పెడుతుంది. భాగ్యం, వల్లీ, ఇడ్లీ బాబాయ్ పచ్చళ్ళు పెడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. పాతిక లక్షల అప్పు రామరాజు నుంచి తీసుకుంటున్నాము కాబట్టి అందులో ఒక పది తనకి ఇమ్మని వల్లి అడుగుతుంది. విశ్వ తనను బ్లాక్ మెయిల్ చేసిన సంగతిని భాగ్యానికి చెబుతుంది. విశ్వ తన గురించి మా మావయ్య గారికి ఎక్కడ చెప్పేస్తాడని, నా కాపురం ఎక్కడ కూలిపోతుందో అని భయంగా ఉందమ్మా అని చెబుతుంది. దాంతో భాగ్యం ఇవ్వడానికి ఒప్పుకుంటుంది.
భాగ్యానికి బుద్ధిచెప్పిన నర్మద
ఈలోపు పచ్చళ్ల పెట్టే దగ్గరికి నర్మద, ప్రేమ వస్తారు. ప్రేమ మాట్లాడుతూ ‘చూస్తుంటే మీ ఇద్దరూ మా మామయ్య గారి దగ్గర పాతిక లక్షలు తీసుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో భాగ్యం పికిల్స్ ని పీక్స్ కి తీసుకెళ్లేలా ఉన్నారు కదా’ అని అంటుంది. నర్మదా మాట్లాడుతూ విదేశాల్లో కూడా భాగ్యం పికిల్స్ పానకంలాగా పాకేస్తుంది ఆ విషయం మర్చిపోయావా అని అంటుంది. అసలే వీళ్ళ బుర్రలు మామూలు బుర్రలు కాదు, వ్యాపారంలో తన పండిపోయి ఎండిపోయాయి కదా అని నర్మదా వెటకారం చేస్తుంది. నర్మద భాగ్యాన్ని, వల్లిని మాటల్లో పెట్టి పచ్చడిలో ఉప్పు ఎక్కువ వేసేస్తుంది. భాగ్యం నర్మద, ప్రేమను చూసి అనుమానిస్తుంది. మీ ఇద్దరూ ఏదో తేడాగా మాట్లాడుతున్నారని అంటుంది. దాంతో నర్మద, ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
నర్మద ఉప్పు వేసిన సంగతిని గమనించకుండా పచ్చళ్ళు సిద్ధం చేసేస్తూ ఉంటారు భాగ్యం, వల్లి, ఇడ్లీ బాబాయ్. ఉప్పు వేయలేదనుకొని ఆ పచ్చడిలో మరింత ఉప్పును వేస్తారు. ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామని భాగ్యం నోట్లో పెట్టుకోబోతుంది. కానీ ఇడ్లీ బాబాయ్ ఆపేస్తారు. 100 కేజీల పచ్చడి కూడా నువ్వు ఉప్పు చూడకుండా చకచకా చేస్తావని.. అలాంటిది ఇప్పుడు సరిపోయిందో లేదో చూడడం ఏంటి? నీకు అవమానం కాదా అని అంటాడు ఇడ్లీ బాబాయ్. పచ్చళ్ల రుచి రామరాజుకి నచ్చితే పాతిక లక్షలతో పాటు మరో ఐదు లక్షలు అదనంగా ఇస్తాడని ఆశ పెడతాడు. దీంతో వల్లి భాగ్యం నిజమేనని నమ్మేస్తారు.
అంతా ఉప్పుమయం
రాత్రి అందరూ భోజనాలు చేసేందుకు కూర్చుంటారు. అప్పుడు భాగ్యం ఆవకాయ జాడి పట్టుకుని వస్తుంది. ఆవకాయ తినమని రామరాజుని అడుగుతుంది. ఇప్పుడు ఆవకాయతో భోజనం ఏంటని అడుగుతాడు రామరాజు. వేదవతి జరిగిన విషయమంతా వివరిస్తుంది. రామరాజు చాలా మంచి ఆలోచన చేశారని పైగా మంచి రుచికరమైన పచ్చళ్లకు మంచి డిమాండ్ ఉంటుందని అంటాడు. రామరాజు అప్పు సంగతి కూడా అడిగేస్తుంది భాగ్యం. ప్రతినెలా కట్టేస్తామని మాటిస్తుంది. ఏడాదికల్లా 20 లక్షల రూపాయలు తిరిగి తీర్చేస్తామని ఇడ్లీ బాబాయ్ చెబుతాడు. మొత్తం డబ్బును చాలా తక్కువ సమయంలోనే ఇచ్చేస్తామని, తమ పచ్చళ్లకు కోట్ల డిమాండ్ వస్తుందని చెబుతాడు. అది విని రామరాజు మీరు ఎదగడం కోసం అవసరమైతే మా రైస్ మిల్లు ష్యూరిటీ పెట్టి మరి డబ్బు ఇస్తానని మాట ఇస్తాడు.
ప్రేమ మాట్లాడుతూ మావయ్య గారు మీరు ఆ పచ్చడిని తిని.. వారు పచ్చళ్లు చేయడంలో ఎంత దిట్టో తెలుసుకుని... వ్యాపారంలో ఎవరికి అందనంత ఎత్తుకు ఎదుగుతారు అని చెప్పండి అని అంటుంది. దీంతో రామరాజు పచ్చడి వడ్డించమని చెబుతాడు. అన్నంలో కలుపుకుని తింటాడు రామరాజు. ముద్ద నోట్లో పెట్టాక ఉప్పు ఎక్కువగా ఉండడంతో అలా ఉండిపోతాడు. పక్కవాళ్లకు కూడా ఒక్కో ముద్దా పెడతాడు. అందరూ తిని ఏమీ చెప్పలేక వెళ్లి అంతా బయట ఉమ్మేస్తారు. రామరాజు ‘ఏంటిది అసలు పచ్చడేనా? ఉప్పు తప్ప అందులో ఏమీ లేదు. పచ్చడి చండాలంగా ఉంది.పచ్చడి అనేది పేద మధ్యతరగతి వారికి. రూముల్లో ఉండి చదువుకునే వారికి అమృతంతో సమానం. ఇంత దరిద్రంగా పచ్చళ్ళు చేస్తే ఎవడు కొంటాడు. ఇంకేదైనా వ్యాపారం చేసుకోండి’ అంటాడు. భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాడు.
వార్నింగ్ ఇచ్చిన ప్రేమ
అందరూ వెళ్లిపోయాక పచ్చడిని భాగ్యం, వల్లి, ఇడ్లీ బాబాయ్ టేస్ట్ చూస్తారు. ఉప్పు అధికంగా ఉండడంతో వాళ్లు కూడా తినలేరు. అక్కడే ఉన్న నర్మద, ప్రేమ మాట్లాడుతూ ఎదుటివారిని మోసం చేసి డబ్బును గడించాలని చూస్తే ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు. ఇప్పటికైనా ఇలా మాయ చేసి బతకాలనే ఆలోచన మానేసి కష్టపడి బతకడం నేర్చుకోండి. అలాకాకుండా ఎదుటి వాళ్ళని ముంచి బతకాలని చూస్తే మేము అడుగడుగునా అడ్డుపడుతూనే ఉంటామని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. దీంతో వల్లీ, భాగ్యం, ఇడ్లీ బాబామ్ షాక్ తో అలా ఉండిపోతారు.
ప్రేమకు సర్ ప్రైజ్ ఇచ్చిన ధీరజ్
ఇక్కడ నుంచి సీన్ ప్రేమ, ధీరజ్ దగ్గరికి మారిపోతుంది. ప్రేమ ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి ధీరజ్ వస్తాడు. అయినా సరే ప్రేమ పట్టించుకోకుండా ఉంటుంది. ధీరజ్ ఎన్నిసార్లు హారన్ కొట్టినా ప్రేమ వినిపించుకోదు. ధీరజ్ కారు దిగి మళ్లీ గిల్లికజ్జలు పెట్టుకుంటాడు. తన కారెక్కితే కిడ్నాప్ చేస్తానని చెబుతాడు. స్టేషన్లోనే ధీరజ్ గతంలో ఉన్న సంగతిని గుర్తు చేస్తుంది ప్రేమ. చివరికి ప్రేమను కారులో బలవంతంగా కూర్చోబెడతాడు. కానీ ఎక్కడికో మాత్రం చెప్పడు. సర్ప్రైజ్ ఇవ్వడానికి తీసుకెళ్లున్నానని అంటాడు. దానికి కూడా ప్రేమ వెటకారం చేస్తుంది. ఇద్దరూ కలిసి చెప్పులు షాపుకు వెళ్తారు. అక్కడ తన చేతులతోనే ప్రేమకు స్వయంగా షూ తొడుగుతూ ఉంటాడు.అది చూసి ప్రేమ ఎంతో సంతోషిస్తుంది.