MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • నాగార్జున కు ఒళ్లు మండేలా చేసిన డైరెక్టర్, కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్.. ఎవరా దర్శకుడు, ఏంటా సినిమా?

నాగార్జున కు ఒళ్లు మండేలా చేసిన డైరెక్టర్, కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్.. ఎవరా దర్శకుడు, ఏంటా సినిమా?

కింగ్ నాగార్జునకు ఓ డైరెక్టర్ కోపం వచ్చేలా చేశాడు. అది కూడా ఒక పోస్టర్ తో కింగ్ కు ఒళ్లు మండేలా చేశాడు. పట్టరాని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు నాగార్జున. కానీ వారి కాంబోలో వచ్చిన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇంతకీ  ఎవరా దర్శకుడు?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 30 2025, 05:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నాగార్జునకు స్టార్ డమ్ తెచ్చిన సినిమా
Image Credit : Starmaa

నాగార్జునకు స్టార్ డమ్ తెచ్చిన సినిమా

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగార్జున.. టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోయాడు నాగార్జున.తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన్మధుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే నాగార్జున కెరీర్ కు బిగినింగ్ లోనే ఊపునిచ్చిన సినిమా మాత్రం శివ. ఈసినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు నాగ్. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ఈసినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అంతే కాదు ఇటు నాగార్జున కెరీర్ ను.. అటు రామ్ గోపాల్ వర్మ కెరీర్ ను నిలబెట్టింది ఈసినిమా. అయితే ఈ మూవీకి పోస్టర్ డిజైన్ చేసింది మాత్రం అప్పటి కెమెరా మెన్ అయిన తేజ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
శివ సినిమాకు పోస్టర్ డిజైన్ చేసిన తేజ
Image Credit : annapurna studios

శివ సినిమాకు పోస్టర్ డిజైన్ చేసిన తేజ

శివ సినిమా అన్ని రకాలుగా టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్స్ ను క్రియేట్ చేసింది. ఈ మూవీ కోసం డైరెక్టర్ వర్మకు అప్పటికి కెమెరా మెన్ గా వర్క్ చేస్తున్న తేజా సహాయం చేశారు. శివ సినిమా టైటిల్ డిజైన్, పోస్టర్స్ డిజైన్ బాధ్యతలను వర్మ తేజాకు అప్పగించారు వర్మ. అయితే అప్పటికే ఉన్న టైటిల్స్, పోస్టర్స్ కు భిన్నంగా తేజ సరికొత్తగా శివ సినిమా పోస్టర్స్ ను డిజైన్ చేశారు. అయితే ఫస్ట్ టైమ్ బ్లాక్ అండ్ వైట్ లో హీరో ఫోటో, టైటిల్ ను డిజైన్ చేశారు తేజ. పోస్టర్ లో హీరో ఫోటో బ్లాక్ గా ఉండటం, అందరు ఇది వర్కౌట్ కాదు అన్నారు. కానీ పోస్టర్ చూపించిన వెంటనే ఎవరికి నోట్లో మాట రాలేదు. అందరికి ఈ పోస్టర్ నచ్చింది.

Related Articles

Related image1
దసరా బుల్లోడు రివ్యూ, వాణిశ్రీ తో ఏఎన్నార్ మోటు సరసం, రొమాంటిక్ సాంగ్స్ తో రెచ్చిపోయిన అక్కినేని..
Related image2
అల్లు అర్జున్ తాతను జీవితాంతం వెంటాడిన సూపర్ స్టార్ కృష్ణ పాట ఏదో తెలుసా?
34
తేజాపై కోపంతో వెళ్లిపోయిన నాగార్జున
Image Credit : youtube/ABN-Open Heart With RK

తేజాపై కోపంతో వెళ్లిపోయిన నాగార్జున

శివ సినిమా టైటిల్ పోస్టర్స్ ను తేజ అందరికి చూపించారు. చుట్టు ఉన్నవారంతా బాగుంది అన్నారు. అక్కడే నాగచైతన్యను ఎత్తుకుని నిల్చున్న నాగార్జున మాత్రం ఈ పోస్టర్ చూసి కోపంతో రగిలిపోయారు. హీరో ఫేస్ బ్లాక్ ఉంటే ఎవరికైనా నచ్చదు కదా.. అందుకే ఓళ్లు మండి నాగార్జున అక్కడ నుంచి వెళ్లిపోయారు. కానీ వర్మ మాత్రం ఈ పోస్టర్స్ బాగున్నాయి ప్రొసీడ్ అవ్వు అని చెప్పారు.. దాంతో అవే పోస్టర్లు బయటకు వచ్చాయి. చూసిన ప్రతీ ఒక్కరు డిఫరెంట్ గా ఫీల్ అయ్యారు.. శివ సినిమాకు ఈ పోస్టర్లే పెద్ద పబ్లిసిటీ అయ్యింది. ఇండస్ట్రీలో ఈ పోస్టర్ల ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. అంతకు మించి శివ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

44
టాలీవుడ్ లో గేమ్ ఛేంజర్ మూవీ..
Image Credit : zee5

టాలీవుడ్ లో గేమ్ ఛేంజర్ మూవీ..

‘శివ’ సినిమా నాగార్జున కెరీర్‌లోనే కాకుండా, తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఒక గేమ్ చేంజర్‌గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నాగార్జునను ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. అప్పట్లోనే ఈమూవీ 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇక ఈసినిమా 36 ఏళ్ల తర్వాత తాజాగా రీ-రిలీజ్ అయ్యింది మూవీ. ఆధునిక హంగులతో 4K వెర్షన్‌ శివ సినిమాను నవంబర్ 14న రీ రిలీజ్ చేశారు మేకర్స్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
Recommended image2
Bigg Boss Telugu 10 Timings: టైమ్ మారింది భయ్య.. ఇక బిగ్ బాస్ అభిమానులకు పండగే? అందరికి అందుబాటు సమయానికి సీజన్ 10
Recommended image3
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Related Stories
Recommended image1
దసరా బుల్లోడు రివ్యూ, వాణిశ్రీ తో ఏఎన్నార్ మోటు సరసం, రొమాంటిక్ సాంగ్స్ తో రెచ్చిపోయిన అక్కినేని..
Recommended image2
అల్లు అర్జున్ తాతను జీవితాంతం వెంటాడిన సూపర్ స్టార్ కృష్ణ పాట ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved