MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • NagaPanchami 30th January Episode:ప్రమాదంలో నాగ లోకం, మోక్ష.. పంచమి అడుగులు ఎటువైపు..?

NagaPanchami 30th January Episode:ప్రమాదంలో నాగ లోకం, మోక్ష.. పంచమి అడుగులు ఎటువైపు..?

. పెళ్లి కాని అమ్మాయి ఇంట్లో ఉంటే ఏం  బాగుంటుంది..వెళ్లిపోతుందిలే అని అంటుంది. అందరూ వెళ్లమని.. ఎప్పుడైనా వచ్చిపోతూ ఉండమని  చెబుతారు. ఇఫ్పుడే వెళ్లగొట్టేలా ఉన్నారే అని మనసులో అనుకుంటుంది. మోక్షను పిలిస్తే.. చెప్పి వెళ్లిపోతాను అని అంటుంది.

3 Min read
Author : ramya Sridhar
Published : Jan 30 2024, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Naga panchami

Naga panchami

NagaPanchami 30th January Episode:పంచమి.. మోక్షతో మాట్లాడుతూ ఉంటుంది. కలిసి బతికితే ఇద్దరం కలిసే బతుకుదామని, లేకపోతే.. ఇద్దరం కలిసే చచ్చిపోదాం అని మోక్ష చెప్పడంతో... పంచమి ఆనందంతో హత్తుకుంటుంది. అయితే.. అది పంచమి కల. నిజంగా మోక్ష వచ్చినట్లు ఊహించుకొని మాట్లాడుతూ ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Naga panchami

Naga panchami

ఇంతలో పంచమి తల్లి వచ్చి... ఏమైందని అడిగితే.. అప్పుడు ఈ లోకంలోకి వస్తుంది. అప్పుడు పంచమి తల్లి గౌరమ్మ.. నువ్వు మనిషివి మాత్రమే  ఇక్కడ ఉన్నావని.. ప్రాణం మోక్ష దగ్గరే ఉందని చెబుతుంది. మోక్ష దగ్గరకు వెళ్లిపొమ్మని  చెబుతుంది. కానీ తాను వెళ్లలేను అని చెబుతుంది. మోక్ష బాబు దేవుడు లాంటివాడని.. అలాంటి తనకి నాలాంటి దానితో జీవితం నరకంగా ఉంటుందని చెబుతుంది. మోక్ష బాబు మరో పెళ్లి చేసుకొని పిల్లా, పాపలతో సంతోషంగా ఉండాలని అంటుంది. వీళ్ల ఇలా మాట్లాడుకుంటూ ఉంటే.. నాగవరంలోకి కొందరు ఆడవాళ్లు అక్కడికి వస్తారు.

37
Naga panchami

Naga panchami

వాళ్లు రావడం రావడం.. పంచమిని ఆమె మొగుడు వదిలేశాడు అంట కదా అని అడుగుతారు.అలాంటిదేమీ లేదని.. తన అల్లుడు బంగారం అని చెబుతుంది. రెండు రోజులు ఆడపిల్ల పుట్టింటికి కూడా రాకూడదా అని అడుగుతుంది. అంటే.. మొగుడు లేకుండా వచ్చిందంటే ఆ మాత్రం అనుమానం ఉంటుంది కదా అని ఆ ఆడాళ్లు అంటారు. ఆ తర్వాత..పంచమి మరో అబ్బాయితో మాట్లాడుతుందని ఫణీంద్ర గురించి ఆరా తీస్తారు. ఆ అబ్బాయి మా చుట్టాలబ్బాయి అని చెప్పడంతో.. మేము కూడా అదే అనుకున్నాం అని అక్కడి నుంచి వెళ్లిపోతారు.

తర్వాత పంచమి తల్లి.. ఈ  అవమానాలన్నీనీకు అవసరమా తల్లి.. నువ్వు నీ నాగలోకానికి వెళ్లిపో అని వాళ్ల అమ్మ చెబుతుంది. అయితే.. తనకు భూలోకం మీద చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని అవి పూర్తి చేసిన తర్వాత.. ఇక్కడి నుంచి నాగలోకానికి వెళ్లిపోతాను అని చెబుతుంది.
 

47
Naga panchami

Naga panchami

సీన్ కట్ చేస్తే... మేఘన ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి రెడీ అవుతుంది. అయితే.. మోక్ష తనను ఎంత వరకు నమ్ముతాడో చూడాలి అని అనుకుంటుంది. బ్యాగ్ తీసుకొని హాల్ లోకి వచ్చి.. వైదేహి ఆంటీ అని పిలుస్తుంది. ఇంట్లో వాళ్లు అందరూ వచ్చేస్తూ ఉంటారు. తాను పంచమి స్నేహితురాలిని.. తాను తీసుకువస్తేనే వచ్చాను అని.. పంచమి లేకుండా తాను  ఈ ఇంట్లో ఉంటే బాగోదని..వెళ్లిపోతాను అని చెబుతుంది. అయితే.. ఎవరూ పెద్దగా ఆపాలని అనుకోరు. వైదేహి మాత్రమే.. నువ్వు మా మోక్షను కాపాడిన దేవత అని..  నువ్వు ఉండాలి అనుకుంటే ఈ ఇంట్లో ఉండొచ్చు అని అంటుంది. అయితే.. పెళ్లి కాని అమ్మాయి ఇంట్లో ఉంటే ఏం  బాగుంటుంది..వెళ్లిపోతుందిలే అని అంటుంది. అందరూ వెళ్లమని.. ఎప్పుడైనా వచ్చిపోతూ ఉండమని  చెబుతారు. ఇఫ్పుడే వెళ్లగొట్టేలా ఉన్నారే అని మనసులో అనుకుంటుంది. మోక్షను పిలిస్తే.. చెప్పి వెళ్లిపోతాను అని అంటుంది.

57
Naga panchami

Naga panchami

ఇంతలో వైదేహి మోక్షను పిలుస్తుంది. మోక్ష ను పిలిచి.. మేఘన వెళ్తుందని చెబుతుంది. అయితే.. మోక్ష.. మేఘన నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దని.. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెబుతాడు. అది విని ఇంట్లో అందరూ షాకౌతారు. శబరి, వాళ్ల అన్నయ్యలు.. వద్దు అని అలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెబుతారు. కానీ.. తాను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెబుతాడు. వైదేహి.. ఎవరో ఒకరు.. తన కొడుకు పెళ్లికి ఒప్పుకున్నాడు అది చాలు అని అనుకొని.. మేఘనను కూడా ఒప్పిస్తుంది.

67
Naga panchami

Naga panchami

మరోవైపు..ఫణీంద్ర..కు నాగదేవత ప్రత్యక్షమౌతుంది. అప్పుడు ఫణీంద్ర.. నాగలోకానికి వచ్చింది యువరాణి పంచమి కాదని కరాళి అని చెబుతుంది. అది విని నాగదేవత కూడా షాకౌతుంది.  ఆ తర్వాత.. నీకు, యువరాణికి తాను పెట్టిన కండిషన్స్ అన్నీ తొలగిస్తున్నట్లు చెబుతుంది. తొందరగా.. పంచమిని నాగలోకానికి తీసుకురావాలని.. నాగమణికి పూజ చేయాల్సిన సమయం వచ్చిందని లేకపోతే.. నాగలోకం ప్రమాదంలో ఉందని చెబుతుంది

77
Naga panchami

Naga panchami

అయితే.. పంచమి నాగలోకానికి  రావడానికి ఒప్పుకుంది కానీ.. రావడానికి ఆలస్యం అయ్యేలా ఉందని చెబుతాడు. తొందరగా.  పంచమిని తీసుకురమ్మని నాగదేవత ఆదేశిస్తుంది. మరి.. మరోవైపు నాగలోకం, మోక్ష ప్రమాదంలో ఉన్నారు. మరి.. పంచమి ఎవరిని ఎలా కాపాడుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Recommended image3
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved