MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • TV
  • Naga Panchami today Episode:పంచమి కోసం తపిస్తున్న మోక్ష, కుళ్లిపోయిన నంభూద్రి శవం, పగతో రగిలిపోతున్న కరాళి..!

Naga Panchami today Episode:పంచమి కోసం తపిస్తున్న మోక్ష, కుళ్లిపోయిన నంభూద్రి శవం, పగతో రగిలిపోతున్న కరాళి..!

వైదేహి  మాత్రం.. అసలు పంచమికి ఈ ఇంటి కోడలికి ఉండే అర్హత లేదని.. కేవలం నీ ప్రాణాలు కాపాడగలదని మాత్రమే ఈ ఇంటికి కోడలిగా ఉండేందుకు అంగీకరించాను అని అంటుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 27 2024, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Naga panchami

Naga panchami

Naga Panchami today Episode: మోక్ష ఇంట్లో మేఘన పూజ చేస్తుంది. ఆమె అలా పూజ చేయడం చూసి ఇంట్లో వారందరూ సంతోషిస్తారు. ఆమె తీసుకువచ్చి అందరికీ హారతి ఇస్తుంది. అందరూ తీసుకుంటారు. అక్క వాళ్లకు కూడా ఇస్తాను అని మేఘన అంటే.. ఇంట్లో వాళ్లందరూ కలిసి.. జ్వాల, చిత్రలపై సెటైర్లు వేస్తారు. వాళ్లకు తిండి ఉంటే చాలని, పూజలు అవసరం లేదు అని అంటారు ఆ మాటలు విని హర్ట్ అయిన జ్వాల, చిత్రలు..  ఇంట్లో వాళ్లపై తిరిగి సెటైర్లు వేస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Naga panchami

Naga panchami

అయితే.. వాళ్లను ఆపమని.. వైదేహి మోక్షను పిలుస్తుంది. మోక్ష రాగానే.. నీకు పునర్జన్మ ఈ మేఘన రూపంలో దక్కిందని.. దేవుడికి నమస్కరించి హరతి తీసుకోమని చెబుతారు. కానీ.. మోక్ష తీసుకోడు. వైదేహి ఎన్నిసార్లు చెప్పినా హారతి తీసుకోకపోగా.. తనకు అసలు ఈ ప్రాణమే వద్దు అంటాడు. కావాలంటే ప్రాణం తీసుకోమని చెబుతాడు. నిజానికి తాను ఈ రోజు బతకలేదని.. చాలా రోజులుగా తాను బతికి ఉన్నానంటే దానికి పంచమినే కారణం అని అంటాడు. అయితే.. వైదేహి  మాత్రం.. అసలు పంచమికి ఈ ఇంటి కోడలికి ఉండే అర్హత లేదని.. కేవలం నీ ప్రాణాలు కాపాడగలదని మాత్రమే ఈ ఇంటికి కోడలిగా ఉండేందుకు అంగీకరించాను అని అంటుంది.

35
Naga panchami

Naga panchami

మోక్ష మాత్రం.. తాను పంచమి లేకుండా బతకలేనని.. మీరు ఇఛ్చిన జన్మ ఎప్పుడో పోయిందని.. తాను మిగిలింది కేవలం పంచమి పోసిన ప్రాణంతోనే అని అంటాడు.  ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంట్లో వాళ్లు కూడా అసహనంతో వెళ్లిపోతారు. అయితే.. మేఘన మాత్రం.. మోక్ష ప్రాణం పోయినా.. పంచమిని దూరం చేయలేమేమో అని అనుకుంటుంది.

శబరి కూడా.. మోక్ష, పంచమి విషయంలో తాము తప్పు చేస్తున్నామా అని ఫీలౌతుంది నిజంగా పంచమి అమాయకురాలు అయితే.. ఆ దేవుడు తనకు అన్యాయం జరగకుండా చూసుకోవాలి అని అనుకుంటుంది, 

45
Naga panchami

Naga panchami

ఇక.. మేఘన తన అన్నయ్య ఆత్మను రప్పిస్తుంది. నంభూద్రి ఆత్మలా వచ్చి ఏమైంది కరాళి అని అడుగుతాడు. తాను నాగమణి సాధించలేకపోయాను అని జరిగిన విషయం చెబుతుంది. నిన్ను నేను కాపాడుకోలేకపోయాను అని బాధపడుతుంది. మోక్షను బలి ఇస్తే తప్ప.. నాకు మహాకాళీ శక్తులు ఇవ్వను అంటోందని  కూడా చెబుతుంది. అయితే... మహాకాళీ కూడా నిన్ను మోసం చేస్తుందేమో జాగ్రత్త గా ఉండు అని నంభూద్రి చెబుతాడు. ఇక.. తన శరీరం మొత్తం కుళ్లిపోయిందని.. ఏం చేసినా తనను బతికించలేవు అని చెబుతాడు. మోక్షను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండమని చెబుతుంది. కానీ.. మేఘన తనకు సంసార జీవితం మీద ఆశలేదని.. ఏ నాటికి అయినా.. మహా మాంత్రికురాలిని కావాలని అనుకుంటుంది. ఇక.. నంభూద్రి మాయం అయిపోతాడు.

55
Naga panchami

Naga panchami

ఇక..నాగచంద్రకాంత మొక్కను తన రూపంలో తీసుకువచ్చింది కరాళి అనే అనుమానం పంచమికి కలిగిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకోవడానికే కరాళి స్థావరానికి పంచమి, ఫణీంద్ర వస్తారు. వారికి కరాళి నే మేఘన అనే విషయం తెలిస్తే.. కథ మళ్లీ ఆసక్తిగా మారే అవకాశం ఉంది. మరి.. ఆ విషయం వారు ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved