MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • Naga Panchami 13th January Episode: ప్రాణాలు వదలిన మోక్ష, కరాళి చేతికి నాగమణి.. మరోసారి సుబ్బు ఎంట్రీ..!

Naga Panchami 13th January Episode: ప్రాణాలు వదలిన మోక్ష, కరాళి చేతికి నాగమణి.. మరోసారి సుబ్బు ఎంట్రీ..!

ఈ ప్రమాదం నుంచి మోక్షను  కాపాడాలంటే ఏం చేయాలి, మరో మార్గం చెప్పమని అడుగుతుంది. అయితే.. నీకు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉన్నాయని, ఆ స్వామి కాపాడతాడు అని ఆ స్వామిజీ ధైర్యం చెబుతాడు.

4 Min read
Author : ramya Sridhar
Published : Jan 13 2024, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Naga panchami

Naga panchami

Naga Panchami 13th January Episode: అంతకముందు ఎపిసోడ్ లో మోక్షను పాముగా మారిన పంచమి కాటేసిన విషయం తెలిసిందే. మోక్ష నొప్పితో బాధపడుతుండగానే..  పంచమి నాగలోకానికి అడుగుపెడుతుంది. అక్కడ.. ఎవరూ  చూడకుండా.. నాగదేవతకు క్షమాపణలు చెప్పి, నాగమణి తీసుకుంటుంది. ఆ మణితో తిరిగి వస్తుంటారు. ఈ లోగా.. మోక్ష ప్రాణాలు కోల్పోతాడు.  పక్కనే ఉన్న స్వామిజీ ని స్పృహ కోల్పోయేలా చేసి.. మోక్ష శవాన్ని కరాళీ తన మంత్రజాలంతో మాయం చేస్తుంది. తర్వాత ఆ స్వామిజీని కూడా మాయం చేస్తుంది. ఈ లోగా పంచమి.. మణితో అక్కడికి వచ్చి మోక్ష గురించి అడుగుతుంది. తాను మేఘన కాదని.. కరాళి అని.. తనకు నాగమణి ఇస్తేనే.. మోక్ష ఎక్కడ ఉన్నాడో చెబుతాను అని కరాళీ భయపెడుతుంది. ముందు తన అన్నను కాపాడుకొని, తర్వాత.. నీ మోక్షను బతికిస్తాను అని.. నాగమణి తీసుకొని వెళ్తుంది.. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత కరాళి ఈ లోకంలోకి వస్తుంది. అదంతా తన కళ అని అర్థం చేసుకుంది. కానీ.. కచ్చితంగా ఇదే జరుగుతుందని.. అలానే జరగాలి అని అనుకుంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Naga panchami

Naga panchami

అంటే.. పంచమి ఇంకా పాముగా మారి.. మోక్షను కాటు వేయలేదు. ఇంకా.. స్వామిజీ చెప్పిన దాని గురించే మోక్ష, పంచమిలు ఆలోచిస్తూ ఉంటారు. స్వామిజీ వచ్చి.. తనకు తెలిసి.. నాగమణి కంటే, నాగ చంద్ర కాంత మొక్క తెమ్మని చెబుతాడు. అయితే.. ఫణీంద్ర ఇంకా రాలేదు అని  అప్పటి వరకు ఆగాల్సిందే అని మోక్ష అంటాడు. తర్వాత.. ఫణీంద్రపై స్వామిజీ అనుమానం చేస్తాడు. ఎలాంటి లాభం లేకుండా.. ఫనీంద్ర మీకు ఈ సహాయం చేస్తున్నాడంటే తనకు నమ్మకం లేదని స్వామిజీ అంటాడు. తాను.. మోక్షను కాటు వేస్తే  నాగదేవత ఇచ్చిన తన పని పూర్తౌతుందని, అందుకే ఫణీంద్ర సహాయం చేస్తున్నాడని పంచమి చెబుతుంది. కానీ మనసులో మాత్రం.. తాను నాగలోకంలో శాశ్వతంగా ఉంటానంటే అంగీకరించానని, అందుకే సహాయం చేస్తున్నాడు అని పంచమి మనసులో అనుకుంటుంది.

37
Naga panchami

Naga panchami

పలుమార్లు స్వామిజీ మాత్రం పంచమి, మోక్షలను హెచ్చరిస్తాడు. ఫణీంద్ర మిమ్మల్ని మోసం చేస్తున్నాడని తనకు అనుమానంగా ఉందని  చెబుతాడు. అయితే.. ఫణీంద్ర మోసం నుంచి మేము ఎలా బయటపడాలి అని పంచమి అడుగుతుంది. తాను కాటేయకపోయినా..  ఫణీంద్ర మోక్షను కాటేస్తాడని.. ఈ ప్రమాదం నుంచి మోక్షను  కాపాడాలంటే ఏం చేయాలి, మరో మార్గం చెప్పమని అడుగుతుంది. అయితే.. నీకు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉన్నాయని, ఆ స్వామి కాపాడతాడు అని ఆ స్వామిజీ ధైర్యం చెబుతాడు.

47
Naga panchami

Naga panchami

ఫణీంద్ర పంచమి వాళ్ల వద్దకు వస్తూ ఉంటే.. మధ్యలో ఐదుతలల నాగు  ఫణీంద్రకు ఎదురౌతుంది. ఫణీంద్రను భయపెడుతుంది. భయంతో  ఫణీంద్ర నమస్కారం చేయడంతో.. సుబ్రహ్మణ్యస్వామి బాలుడి రూపంలో మారి మళ్లీ కనిపిస్తాడు. ‘నేనేదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి’ ఫణీంద్ర అంటాడు. ‘ నమ్మకద్రోహం నేరం అని తెలియదా నాగరాజా, నమ్మకం ఓ వరం, నమ్మకం అనే ఆయుధంతో విశ్వాసాన్ని కూడా జయించవచ్చు. అంత శక్తివంతమైనది నమ్మకం. నమ్మకంలేనిదే సృష్టి లేదు. ఒకరినొకరు నమ్మితేనే భార్యభర్తలు కాపురాలు చేస్తారు. భక్తులు నమ్మి పూజిస్తేనే దేవుళ్లు, గుడిలు. అలాంటి నమ్మకాన్ని నువ్వు అపవిత్రం చేస్తున్నావు. అది నీ ఇష్ట రూప నాగులకు తగనిది. పంచమి నిన్ను పూర్తిగా నమ్మింది. తన ప్రాణమైన భర్తను కూడా వదిలేసి నాగలోకానికి రావడానికి ఒప్పుకుంది. కానీ నువ్వు  ప్రతిఫలంగా తన భర్తను బతికిస్తావని నమ్మించావు. నాగమణి తేవడానికి సహాయం చేస్తానని నమ్మించావు. కానీ మనసులో మాత్రం.. మోక్ష ప్రాణాలను గాలికి వదిలేశావ్’ అని సుబ్బు అడుగుతాడు.

57
Naga panchami

Naga panchami

‘ కానీ, నాకు మరో మార్గం లేదు. నాగ దేవత  ఇచ్చిన సమయం అయిపోయింది. యువరాణిని తీసుకువెళ్లకపోతే.. నాకు మరణ శిక్ష తప్పదు’ అని ఫణీంద్ర అంటాడు. దానికి.. సుబ్బు. నువ్వు మీ యువరాణిని నమ్మకంగా తీసుకువెళ్లాలి కానీ, మోసం చేసి కాదు. పంచమి నా భక్తురాలు. తను పాముగా మారినప్పుడు ఎలాంటి అభ్యంతరం లేకుండా మీ లోకానికి తీసుకువెళ్లు. నీ కార్యానికి నేను అడ్డు చెప్పను. కానీ పంచమి రూపంలో ఉన్న నా భక్తురాలిని తీసుకువెళితే మాత్రం.. నీకు శిక్షతప్పదు. పంచమి ఇష్టపూర్వకంగా అంగీకరిస్తే.. నాగలోకానికి తీసుకువెళ్లు. వీలైతే ఆమె భర్తను కాపాడటానికి సహాయపడు. లేదంటే.. నీకు శిక్ష తప్పదు’ అని సుబ్బు వార్నింగ్ ఇస్తాడు.

దీంతో.. ఫణీంద్రలో మార్పు వస్తుంది. న్యాయబద్దంగానే నాగదేవత అప్పగించిన పనులు పూర్తి చేస్తాను అని.. మోసం చేయను అని  చెంపలువాయించుకుంటాడు. న్యాయంగా ఉన్నవారికే.. తన మద్దతు ఉంటుందని సుబ్బు చెప్పి, మాయం అయిపోతాడు. ఫణీంద్ర మళ్లీ పాముగా మారి బయలు దేరాతాడు. ఈలోగా. పంచమి, మోక్షలు స్వామిజీతో మాట్లాడతారు. స్వామిజీ మాటలకు పంచమిలోనూ ఫణీంద్రపై అనుమానం కలుగుతుంది. 

67
Naga panchami

Naga panchami

ఫణీంద్ర మోసం చేస్తే ఎలా అని పంచమి ఆలోచిస్తూ ఉంటుంది. ఫనీంద్ర ఇంకా రాలేదు అంటే.. ఏం చేయాలి అని  అంటే.. మోక్ష ఎవరికీ చెప్పకుండా దూరంగా వెళ్లిపోదాం అంటాడు. అది కరెక్ట్ పద్దతి కాదని స్వామిజీ వారిస్తాడు. ఈ లోగా.. ఫణీంద్ర వచ్చేస్తాడు. స్వామిజీకి నమస్కారం చేస్తాడు. నాగదేవత అప్పగించిన పని మీద మాత్రమే వచ్చానని చెబుతాడు. పంచమి మోక్షను కాటు వేయాలని, లేకపోతే.. తానే  కాటు వేయాల్సి వస్తుంది అని చెబుతాడు. మరి.. మోక్షను కాపాడతాను అని చెప్పింది నిజం కాదా అని స్వామిజీ అడిగితే.. కాదని.. నిజంగానే సహాయం చేస్తాను అని చెబుతాడు.  ఈ విషయంలో తనను అనుమానించాల్సిన అవసరం లేదని, కచ్చితంగా సహాయం చేస్తాను అని చెబుతాడు. తాను మాట తప్పను అని మాటిస్తాడు. కానీ.. ఈ రోజు రాత్రితో పని పూర్తవ్వాలి అని చెబుతాడు.

77
Naga panchami

Naga panchami


మరోవైపు మేఘన.. పంచమి వాళ్లు ఉన్న ప్రదేశానికి రావడానికి రెడీ అవుతుంది. వాళ్లు ఎక్కడ ఉన్నారు.. ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి అని.. తన మంత్ర శక్తులతో అర చేతిలో చూస్తుంది. వాళ్ల మాటలు మొత్తం వింటూ ఉంటుంది.  అప్పుడే స్వామిజీ.. నాగమణి తీసుకురావడం కష్టమని,  నాగచంద్ర కాంత మొక్క తేవడం బెటర్ అని అంటాడు. ఆ మొక్క కోసం అయితే.. నేను రావాల్సిన అవసరం లేదు కదా.. నువ్వు వెళ్లి తీసుకురావచ్చు కదా అని పంచమి... ఫణీంద్రను అడుగుతుంది. అంటే నన్ను ఇంకా నమ్మడం లేదా అని ఫణీంద్ర అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. కమింగ్ అప్ లో.. కరాళి..పంచమిగా మారి.. నాగలోకానికి వెళ్లాలి అనుకుంటుంది. అది తర్వాతి ఎపిసోడ్ లో చూద్దాం...

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Recommended image2
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image3
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved