MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • చిరంజీవి కి ఒక్క సినిమాతో చెక్ పెట్టిన మోహన్ బాబు, మెగాస్టార్ ని ఓడించిన మంచు మూవీ ఏదో తెలుసా?

చిరంజీవి కి ఒక్క సినిమాతో చెక్ పెట్టిన మోహన్ బాబు, మెగాస్టార్ ని ఓడించిన మంచు మూవీ ఏదో తెలుసా?

టాలీవుడ్ లో వరుస విజయాలతో చిరంజీవి విజృంభిస్తున్న టైమ్ లో.. ఒక్క సినిమాతో మెగాస్టార్ దూకుడుకి బ్రేక్ వేశాడు మోహన్ బాబు. మెగా సినిమాను ఓడించి, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మంచు వారి చిత్రం ఏదో తెలుసా? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 08 2025, 12:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాలీవుడ్ లో మెగా మంచు స్నేహం..
Image Credit : Asianet News

టాలీవుడ్ లో మెగా మంచు స్నేహం..

టాలీవుడ్‌లో స్నేహితులుగా కనిపించినా, పోటీ విషయానికి వస్తే.. వివాదాల్లో నిలుస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి - కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య స్నేహం ఉన్నప్పటికీ, అనేక సందర్భాల్లో కోల్డ్ వార్ కూడా నడిచిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా బాక్సాఫీస్ పోటీల్లో అయితే వీరి సినిమాలు తారాస్థాయిలో తలపడేవి. అంతే కాదు భహిరంగంగా కూడా వీరి మధ్య ఎన్నో వివాదాలు నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు అవ్వడం.. టాలీవుడ్ లో ప్రముఖులగా ఉండటంతో.. అప్పట్లో వీరి మధ్య జరిగిన వార్ ఇండస్ట్రీని కుదిపేసింది. సినీ వజ్రోత్సవాల సమయంలో మోహన్ బాబు కామెంట్స్ ఎన్ని మంటలు రేపాయో అందరికి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య స్నేహం ఉన్నా... కోల్డ్ వార్ మాత్రం కంటీన్యూ అవుతూనే ఉంది. అది ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చిరంజీవి దూకుడు
Image Credit : Facebook/Chiranjeevi

చిరంజీవి దూకుడు

90వ దశకంలో మెగాస్టార్ దూకుడు మామూలుగా ఉండేది కాదు. ఆయన వరుస విజయాలతో దూసుకుపోయాడు. ఖైదీ సినిమా నుంచి చిరంజీవిని ఆపడం ఎవరి వల్ల కాలేదు. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి సినిమాలు ఇండస్ట్రీని దున్నేశాయి. అవే కాకుండా గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రీ లాంటి సినిమాలు చూసి ప్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. మెగాసినిమాలతో టాలీవుడ్ అల్లాడిపోయింది. ఆ టైమ్ లోనే మెహన్ బాబు కూడా స్టార్ హీరోగా ఉన్నారు. ఆయన కూడా హిట్ సినిమాలు చేశారు.. కానీ మెగా రేంజ్ ను మాత్రం అందుకోలేకపోయారు. సరిగ్గా అదే టైమ్ లో ఒక్క సినిమాతో చిరంజీవికి చెక్ పెట్టారు మెహన్ బాబు. మెగా దూకుడుకు కాస్త బ్రేక్ వేయగలిగారు.

36
మెగా దూకుడికి బ్రేక్ వేసిన మోహన్ బాబు
Image Credit : Asianet News

మెగా దూకుడికి బ్రేక్ వేసిన మోహన్ బాబు

1995లో చిరంజీవి దూకుడును కాస్త స్లో చేయగలిగాడు మంచు మోహన్ బాబు. ఈ సమయంలో విడుదలైన మోహన్ బాబు ‘పెదరాయుడు’ సినిమాతో చిరంజీవికి చెక్ పెట్టేశాడు. అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన చిరంజీవి ‘బిగ్ బాస్’ సినిమా పెదరాయుడు ధాటికి నిలబడలేకపోయింది. ఒకే రోజు ఈ రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అంటే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నేరుగా తలపడాయి. అయితే సాధారణంగా ఇలాంటి బాక్సాఫీస్ వార్‌లో చిరంజీవిదే ఎప్పుడు పైచేయిగా ఉండేది. కానీ అప్పుడు మాత్రం పరిస్థితి తలకిందులు అయ్యింది.

46
పెదరాయుడు సినిమా ప్రభంజనం
Image Credit : Social Media

పెదరాయుడు సినిమా ప్రభంజనం

‘పెదరాయుడు’ సినిమాను దర్శకుడు రవి రాజా పినిశెట్టి రూపొందించారు. ఈ చిత్రం తమిళంలో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన హిట్ మూవీ ఆధారంగా తెలుగు రీమేక్‌గా తెరకెక్కింది. తమిళ వెర్షన్‌లో శరత్ కుమార్ ద్విపాత్రాభినయం చేశాడు. తెలుగు వెర్షన్‌లో మోహన్ బాబు అదే విధంగా డ్యూయల్ రోల్ పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన గెస్ట్ రోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయింది. ఆయన సుమారు 20 నిమిషాల పాటు కనిపించిన ఆ పాత్ర ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపింది. ‘పెదరాయుడు’గా మోహన్ బాబు చూపించిన యాక్టింగ్ అదే సమయంలో యంగ్ మోహన్ బాబు యాక్షన్, రొమాన్స్, సౌందర్య అభినయం సినిమాకు బలంగా నిలిచాయి. దాంతో పెదరాయు సినిమా ప్రభంజనం సృష్టించింది. పల్లె జనాలు ఈసినిమాను బాగా ఆదరించారు. అద్భుత విజయం అందించారు.

56
డిజాస్టర్ గా చిరంజీవి బిగ్ బాస్
Image Credit : Asianet News

డిజాస్టర్ గా చిరంజీవి బిగ్ బాస్

ఇక అదే రోజు.. అంటే 1995 జూన్ 15న ‘పెదరాయుడు’ , చిరంజీవి ‘బిగ్ బాస్’ సినిమా రిలీజ్ అయ్యింది. ప్రారంభంలో ప్రేక్షకులు చిరంజీవి సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. భారీ అంచనాలతో విడుదలైన ‘బిగ్ బాస్’ మొదట కొన్ని రోజులు బాగానే నడిచినా.. ఆతరువాత కొద్ది రోజుల్లోనే కలెక్షన్లు పడిపోయాయి. దాంతో బిగ్ బాస్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక మొదట పెద్దగా అంచనాలు లేని ‘పెదరాయుడు’ మాత్రం రాను రాను పుంజుకుంది. గ్రామీణ నేపథ్యంతో, బలమైన కథతో, ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సౌందర్య హీరోయిన్‌గా చేసిన పాత్రకు మంచి గుర్తింపు కూడా వచ్చింది.

66
చిరంజీవి రికార్డు బ్రేక్ చేసిన మోహన్ బాబు
Image Credit : our own

చిరంజీవి రికార్డు బ్రేక్ చేసిన మోహన్ బాబు

పెద్దరాయుడు సినిమా అన్ని అంచనాలను మించి భారీ విజయాన్ని సాధించింది. అప్పటివరకు రికార్డులు సృష్టించిన ‘ఘరానా మొగుడు’ సినిమా రికార్డులను ‘పెదరాయుడు’ బ్రేక్ చేసింది. ఈ సినిమా 39 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకొని శతదినోత్సవం జరుపుకుంది.ఇక అదే సమయంలో విడుదలైన చిరంజీవి ‘బిగ్ బాస్’ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. 1995లో జరిగిన ఈ బాక్సాఫీస్ వార్‌లో మోహన్ బాబు ‘పెదరాయుడు’ విజేతగా నిలిచింది. ఇక అదే ఏడాది చిరంజీవి రిక్షావోడు సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. మెగాస్టార్.. ఫామ్ కోల్పోకుండా కంటీన్యూ అయ్యారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మంచు మోహన్ బాబు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Apoorva Remuneration: మూడు వారాలకే అపూర్వ ఎలిమినేషన్.. ఆమెకు అందిన పారితోషికం ఎంతో తెలుసా?
Recommended image2
Charan Remuneration: నాలుగు వారాలున్న చరణ్‌కి బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి దక్కిన పారితోషికం ఇంతేనా?
Recommended image3
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Related Stories
Recommended image1
సందీప్ రెడ్డి వంగా చేతిలో.. దెబ్బలు తిన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా? కారణం తెలిస్తే షాక్ అవుతారు?
Recommended image2
50 దేశాల్లో రిలీజైన కృష్ణ సినిమా, ఫస్ట్ పాన్ వరల్డ్ తెలుగు కౌబాయ్ మూవీగా మోసగాళ్లకు మోసగాడు రికార్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved